- శ్రీ స్వామివారు కడప నవాబుకు చెప్పిన కాలజ్ఞానబోధ -
నేను శ్రీ వీర భోజుండనై ఈ ప్రపంచంలో ఉద్భవిస్తాను. ఈ కలియుగంలో 5000 సంవత్సరములు గడిచేసరికి దుష్టశిక్షణ, శిష్టరక్షణకై వస్తాను. ఈ లోపుగా సంభవించే కొన్ని పరిణామములను తెలియపరుస్తున్నాను విను.۞ ఉప్పుకొండూరులో ఊరి చెరువు కింద ఉత్పాతాలు పుడతాయి. నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్రమంగా నశించిపోతారు. జలప్రవాహాలు ముంచెత్తటం వలన 14 నగరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. నేను రావటానికి ఇదే ఒక ప్రబల నిదర్శనం.
۞ నాలుగు వర్ణాలవారు న్యాయం తప్పి నడుస్తారు.
۞ దేశంలో పెద్ద పొగ మేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుపోయి, మాడిపోతారు.
۞ సంవత్సరము 1 ధాత నామ సంవతసరం2 మా్ఘ శుద్ధ బుధవారం రోజున పట్టపలే పద్దెనిమిది పట్టణాలు దోపిడీకి గురవుతాయి.
۞ కోటిదూపాటిలోనూ, కొచ్చెర్ల కోటలోనూ కోడి మాట్లాడుతుంది.
۞ జనులలో అత్యధికులు ఇచ్చిన సొమ్ములు దిగ ప్రింగి అబద్ధాలాడి బాకీలు ఎగగొడతారు. దీనిని నిరూపించుకోవటం కోసం తప్పుడు ప్రమాణాలు చేస్తారు! భర్త మణించిన స్త్రీలు మరల ముత్తయిదువులవుతారు.
۞ కోమటి కులంలో 25 గోత్రములు వారు మాత్రమే నిలిచివుంటారు. ఉత్తర దేశంలో ఉత్తమ భేరీ కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు.
- ఇది మహాత్మాగాంధీ గురించి చెప్పిన జ్యోతిష్యం అని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. బ్రహ్మంగారు తాను చెప్పిన జోస్యంలో ఏ విధంగా అయితే 'మహాత్మ' అనే పదం వాడారో గాంధీ కూడా అదే పేరుమీద పేరు పొందటం మనందరికీ తెలిసినదే కదా! దేశవిదేశీయులందరూ కూడా ఆయనను 'మహాత్మ' పేరు మీదే సంభోదిస్తారు.
۞ పట్టపగలు ఆకాశంలోనుంచి పిడుగుల వాన పడి, నిప్పుల వాన కురుస్తుంది అందులో కొందరు మరణిస్తారు.
۞ పందికడుపున ఏనుగు పుడుతుంది. మేకకు అయిదు తలల మేకపోతు పుడుతుంది.
- ఇది కూడా ఇప్పుడు మనం చూస్తున్నదే! పంది కడుపున ఏనుగు తొండం మాదిరి అవయవం కలిగిన పంది పిల్లలు పుట్టటం పేపర్లలో కూడా చూస్తూనే వున్నాము.
- అలాగే వికృతులతో కూడిన మేకపిల్ల పుట్టటం కూడా!
- గుణవంతులందరూ బనగానపల్లె చేరుకుంటారు. బనగానపల్లె నవాబు కొంత కాలమే పాలన చేస్తాడు. ఆతరువాత బనగానపల్లెను ఇతర రాజులు స్వాధీన పరుచుకుంటారు.
- అద్దంకి నాంచారమ్మ ముందుగా మాటలాడుతుంది, అందవల్ల ఎందరో నష్టపోతారు.
۞ మహానంది మరుగున మహిమలు పుడతాయి.
۞ నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది. దానిని గుర్తించిన వారిని నేను కపాడతాను. నాలుగు నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు వచ్చి మేమే వీరభోగ వసంతరాయలమని చెబుతారు. నిజమైన భక్తులు మాత్రం ఆ మాటలను నమ్మకుండా వుంటారు. మూఢులు మాత్రం నమ్ముతారు.
۞ మరొక విచిత్రం పుడుతుంది. వీపున వింజామరలు, అరికాలున తామరపద్మం కలిగిన వారు వస్తారు. వారిని నేనే అని భ్రమ వద్దు. నా రాకకు ఒక గుర్తు ఏమిటంటే కందిమల్లయ్యపల్లిలో నవరత్న మంటపం కడతారు. ఈ పల్లె పెరిగి పట్టణంగా మారుతుంది.
۞ ”కంచికామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది. ఈ సంఘటన జరిగిన తర్వాత వందలాదిమంది మృతి చెందుతారు.
۞ ఆవు కడుపులోని దూడ అదే విధంగా బయటి ప్రజలకు కన్పిస్తుంది.
۞ పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు.
۞ కృష్ణ గోదావరుల మధ్య మహాదేవుడను వాడు జన్మించి శైవుడైనా,అన్ని మతాలనూ గౌరవిస్తూ, గుళ్లూ గోపురాలూ నిర్మిస్తాడు. పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. ఊరూరా గ్రామదేవతలు ఊరేగుతారు.
۞ కాశీ, కుంభకోణం, గోకర్ణ క్షేత్రాల మహత్తులు తగ్గిపోతాయి. కంచి మహత్యం మాత్రం పెరుగుతుంది.
۞ ఆనంద నామ సంవత్సరాలు పదమూడు గడిచేవరకూ, ఈ నిదర్శనాలు| కనిపిస్తూంటాయి. పతివ్రతలు పతితలౌతారు. వరుసలు పాటించకుండా వుంటారు ఆచారాలు అన్నీ సమసిపోతాయి.
۞ రాయలవారి సింహాసనం కంపిస్తుంది. ఈ సమయంలో హస్తినాపురిలో మహామారి అనే శక్తి పుడుతుంది. రామేశ్వరం వరకు ప్రజలను నాశనం చేస్తుంది. రాయల విజయనగరం పాలించే సమయంలో గజపతులతో పోరు జరుగుతుంది
۞ శ్రీశైల క్షేత్రాన కల్లు, చేపలు అమ్ముతారు. వేశ్యాగృహాలు వెలుస్తాయి. అనేక. కాల వ్యాధులు ప్రబలుతాయి. మందులకు తగ్గవు, స్త్రీ పురుషులంతా దూరాచారులవుతారు. స్త్రీలు భర్తలను దూషిస్తారు.
۞ ఢిల్లీ ప్రభువు నశించిపోతాడు.
۞ వైష్ణవ మతం పైకి వస్తుంది. శైవమతం తగ్గిపోతుంది. నిప్పుల వాన కురుస్తుంది. గుండ్లు తేలతాయి. బెండ్లు మునుగుతాయి. చివరికి శివశక్తి అంటూ లేకుండా పోతుంది.
۞ విజయ నగరాన కోటలోని రాయల సింహాసనం బయటపడుతుంది. ఇందుకు గుర్తుగా గ్రామాలలోని రాతివిగ్రహాలు ఊగిసలాడుతాయి. అప్పుడు బిజ్జలరాయని కొలువున రాయల సింహాసనం బయటపడుతుంది..." ఇలా నవాబునకు కాలజ్ఞానము బోధించి, మంత్రదీక్ష యిచ్చి ఆశీర్వదించారు.
۞ నాలుగు వర్ణాల వారు మద్యపానం చేత భ్రష్ఠులయిపోతారు.
۞ వేదములు అంత్య జాతుల పాలవుతాయి. విప్రుల కులహీనులై తక్కువ కులస్థుల పంచన చేరతారు. విప్రులు విధవా వివాహాలు చేస్తారు. స్వ వృత్తి, ధర్మాలు మాని ఇతరులకు బానిస వృత్తి చేస్తారు.
۞ బ్రాహ్మణులను పిలిచేవారు వుండరు. బ్రాహ్మణులు ఇతర విద్యలు కోసం పంట భూములమ్ముతారు. నేను వచ్చేసరికి వారికి తినేందుకు తిండి, గుడ్డ కరువవుతాయి.
۞ మీన రాశికి సూర్యుడు వచ్చే సమయంలో నేను వీర భోగ వసంత రాయలుగా ఉద్బవిస్తాను. నాలుగు మూరల ఖడ్గము పట్టి శ్రీశైల పర్వతం మీదికి వచ్చి, అక్కడి ధనమంతా పుణ్యాత్ములయిన వారికి పంచి ఇస్తాను.
నేను తిరిగి భూమి మీదకు ఎలా వస్తానో వివరిస్తాను. వినండి:
- ۞ కేదారవనంలో నిరాహారినై తపం చేస్తాను. మూడు వరాలు పొంది, అచ్చటి నుండి విక్రమ నామ సంవత్సరం చైత్ర శుద్ధ దశమి, బుధవారం ఇంద్రకీలాద్రి పర్వతం మీద తపస్సు చేసి అక్కడ మహా మునులను, మహర్షులను దర్శనము చేసుకుంటాను. అటనుండి బయలుదేరి, శ్రీశైల మల్లికార్జునుని సేవిస్తాను. అనంతరం దత్తాత్రేయుల వారిని దర్శించుకుంటాను.
- ۞ వావి వరసలు లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి. పార్వతీ అవతారములను డబ్బులకు అమ్ముతారు. కులగోత్రములు, నీతి జాతి లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి.
- ۞ రణ్యాలలోనూ, భూమిలోనూ అమితమైన ధనముండెను. నేను భూమిపై పేక్కదుష్టాంతాలను పుట్టిస్తాను. పాతాళంలో నీరు ఇంకిపోతుంది. భూమి మీద మంటలు పుడతాయి.
- ۞ నాలుగు సముద్రాల మధ్యనున్న ధనమంతా శ్రీశైలం చేరుతుంది. నూట ఇరవై తిరుపతులు పాడయ్యేను. (అంటే 120 వైష్ణవ క్షేత్రములు నశించిపోవునని అర్థమయి వుండవచ్చును).
- ۞ ఉత్తర దేశంలో కత్తులు తెగుతాయి. తూర్పు దేశం ధూళి అయిపోతుంది.
- ۞ నా రాకకు ఇవే మీకు నిదర్శనాలు. నన్ను నమ్మిన వారికి నా రక్షణ కులుగుతుంది.
- ۞ వైశాఖ శుద్ద పంచమిన నేను బయలుదేరి సూర్య మండలం నుండి కొలువు పాకకు వస్తాను. అక్కడి నుండి అహోబిలము తర్వాత సూర్యనంది చేరుకుంటాను.
- ۞ శ్రీకృష్ణ నిర్యాణం ఆదిగా 4999 సంవత్సరాలకు కలిరూపం కొంత నాశనమవుతుంది.
- ۞ కలికి అవతారం కలియుగాంతాన వస్తుంది. పూర్వులు గ్రంథములలో కలియుగము, కలికి అవతారం వివరించారు. వ్యాసభగవానుడు, శాంతి పర్వం చివరన ఈ అవతారం గూర్చి చెప్పారు.
- ۞ శ్రీ శైలాన పొగమంటలు పుడతాయి. బసవడు నాట్యమాడగా 'గణగణ' మువ్వల మోత వినబడుతుంది.
- ۞ భ్రమరాంబ దేవాలయంలో ఒక మొసలి 7 రోజులుండి అదృశ్యమవుతుంది. భ్రమరాంబ మెడలోని మంగళసూత్రం తెగిపడిపోతుంది. ఆమె కంట నీరు కారుతుంది, స్తనాలనుంచి పాలు కారతాయి.
- ۞ కందనూరి గోపాలుని గుడిముందు చింతచెట్టు పుడుతుంది. మహానందిలో ఈశ్వరుని విగ్రహం కదులుతుంది. దేవాలయమున రెండు పాపములు తిరుగుతాయి.
- ۞ వాటిల్లో పెద్ద పాము శిఖరాన మూడు రోజులుండి తరువాత అదృశ్యమవుతుంది.
- ۞ సూర్యనందీశ్వరుని ముందట పనసమాను పుడుతుంది. ఆ చెట్టు ఆ క్షణాన పూలు పూచి, కాయలు కాచి, పండ్లు పండి వెనువెంటనే మాయమవుతుంది.
- ۞ శిరువెళ్ళ నరసింహుని గుడి ముందర గంగరావిచెట్టు మొలుస్తుంది. బహు“ధాన్య నామ సంవత్సర, వైశాఖ శుద్ద తదియ, శుక్రవారం నాడు పల్లెకు తురకలు వస్తారు.
- ۞ బసవన్న రంకె వేస్తాడు. తిరువళ్ళువరు వీరరాఘవస్వామికి చెమటలు పడతాయి, భద్రకాళి కంపిస్తుంది. కంచి కామాక్షమ్మ దేహాన చెమటలు పుడతాయి. ఆమె కంట నీరు స్తనాల పాలు కారతాయి.
- ۞ శాలివాహనం 1541 న ధూమకేతువు పుడుతుంది. శాలివాహనశకం 1555 నాటికి వివిధ దేశాల్లో జననష్టం జరుగుతుంది.
- ۞ పెమ్మసాని తిమ్మనాయుడు వంశం నిర్వంశమయ్యేను. ఉదయగిరి, నెల్లూరులు రూపుమాసి పోయేను. గండికోట, గోలకొండ, ఆదలేని, కందనూరు పట్టణాలు నశించి తురకలు పారిపోతారు. విజయపురంలాంటి పట్టణాలు క్షయనామ సంవత్సరం నాటికి నశిస్తాయి.
- ۞ స్త్రీల కన్నుల నుండి నెత్తుటి బిండువులు రాలతాయి. వడగండ్ల వానలు, బాణవర్షాలు కురుస్తాయి. చెరువులు, బావులు, నదులు నీరు ఇంకిపోతాయి. అయనా జుర్రేరు నీరు ఇంకదు.