యస్తు భద్రనగే పుణ్యే
జపం కుర్యాత్ భక్తితః
సహస్ర గుణితం పుణ్యం
తస్యభూయాద్ధరాతలే
శ్రీరామ ఉపాసనకు సంబంధించిన శాస్త్రం పరాశర సంహిత. ఆ గ్రంథంలో పద్నాలుగు క్షేత్రాల్లో శ్రీరాముడు స్వయంభువుగా వెలినినట్లు ఉన్నది. అందులోని 35వ అధ్యాయం భద్రాద్రి ప్రాభవాన్ని గురించి పేర్కొన్న శ్లోకమిది. భద్రాచల క్షేత్రంలో భక్తితో శ్రీరామమంత్రాన్ని జపిస్తే వెయ్యిరెట్లు ఫలం లభిస్తుంది అని ఈ శ్లోకానికి అర్థం.
భద్రాచల క్షేత్రంలోని మూలమూర్తులు స్వయంవ్యక్తాలని బ్రహ్మపురాణం కూడా చెబుతోంది. భద్రమహర్షి తపస్సు ఫలితంగా స్వామి ఆవిర్భవించినట్లు తెలుస్తోందే తప్ప ఆ కథ ఏకాలానిదో ఇదమిత్తంగా తెలియదు.
శ్రీరాముడు అవతారం తరువాత మళ్లీ - భూమిపైకి వచ్చి శ్రీరామ రూపాన్ని ధరించిన సందర్భం భద్రాచలం ఒక్కటే నాలుగుచేతులలో శంఖ-చక్ర, ధనుర్బాణాలను ధరించి శ్రీరాముడు సీతా, లక్ష్మణ సమేతుడై ఇక్కడ దర్శనమిస్తాడు.
భద్రాచలలో సీతారాముల కళ్యాణం |
సీతారాముల కల్యాణం
భద్రాద్రిలో సీతారామకల్యాణం శ్రీరామ నవమి పర్వదినాన జరుగుతుంది. అష్టమి తిథితో కూడని నవమి తిధినాడు మాత్రమే శ్రీ రామనవమిని ఆచరించడం ఇక్కడ సంప్రదాయం. ఒకవేళ సూర్యోదయానికి అష్టమి ఉన్నట్లయితే దశమినాడే శ్రీరామ నవమిని పాటిసారు.ఆగమశాస్త్రం ప్రకారం ఆలయాలలో అర్చామూర్తికి ఎనాడు ప్రతిష్ట జరుగుతుందో అదే ఆ మూర్తి జన్మదినం. ఎది ఆలయస్వామి జన్మదినమో ఆనాడే వార్షిక కల్యాణం చేయాలి. ఏప్పుడు వెలిశారో తెలియని మూర్తికి ప్రతిష్టాదినాన్ని ఎప్పుడని నిర్ణయిస్తారు? అందుకే త్రేతాయుగంలోని శ్రీరాముని జన్మదినవమే భద్రాద్రి రాముడు అవిర్భవించిన దినంగా పరిగణించి శ్రీరామ నవమినాడే నీతారామ కళ్యాణం జరగాలని రామదాసు కాలంలోనే నిర్ణయించారు.
గోత్రప్రవరలు:
రామాయణం ప్రకారం, శ్రీరామునిది వాశిష్ఠ గోత్రం. సీతమ్మవారిది గౌతమ గోత్రం.
భద్రాద్రి రాముడు వైకుంఠ నారాయణుడు కనుక ఇక్కడ కల్యాణంలో శ్రీరామునికి అచ్యుత గోత్రంగా చెబుతారు. శ్రీమహాలక్ష్మి గోత్రమైన సౌభాగ్యగోత్రాన్ని సీతమ్మ తల్లికి కల్యాణవేళ చెబుతారు.
నాలుగు చేతులు, శంఖుచక్రాలు ఉన్నాయి కనుక ఈ రాముణ్ణి రామనారాయణుడని పిలవాలని వైఖానసులు వాదిస్తున్నారు. మూర్తి ఏవిధంగా మలచబడినప్పటికీ రామునికి వాల్మీకి ఇచ్చిన గోత్ర ప్రపర్లే చెప్పాలని ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ చర్చలు గత కొంతకాలంగా తెలుగునాట అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. అయినప్పటికీ రామనారాయణుడనే వ్యవహరించడమే ప్రస్తుతం కొనసాగుతోంది. తాను నరుడినే అని చెప్పుకున్న రాముడైనా, వైకుంఠాన్ని వీడివచ్చి భద్రగిరిపై వెలిసిన నారాయణుడైనా మన మొక్కులు నెరవేర్చి, ఆపదలు గట్టెక్కిస్తే అంతే చాలు కదా!
సీతారాముల పెళ్లివేడుక:
భద్రాద్రిలో కల్యాణోత్సవం వనంత నవరాత్రి ప్రయుక్తంగా నిర్వహిస్తారు. నప్తమి నుంచి అహ్నికం మొదలవుతుంది. పౌర్ణమి నాటికి పూర్ణాహుతి జరుగుతుంది. ఈ నందర్భంగా ప్రధానమైన పన్నెండురకాల అరాధనలు జరుగుతాయి. వనంత నవరాత్రాలకు, బ్రహ్మోత్సవాలకు మధ్యలో జరిగే కమనీయమైన సేవ భద్రాద్రి కల్యాణంలో ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి. వాటిలో ఒకటి కల్యాణ ప్రవరలు.
అలాగే భద్రగిరి సీతారామ కల్యాణంలో మూడు మాంగల్యాలు ఉంటాయని శ్రీరామ భక్తులందరికీ తెలిసిన విషయమే. కల్యాణంలో మరో సంప్రదాయం ఏమిటంటే గులాం కలిపిన గులాబీరంగు అక్షతలను వినియోగిస్తారు. తెలుగువారికే సొంతమైన జీలకర్ర, బెల్లం, తలంబ్రాలు పోసుకోవడం వంటివి కల్యాణ ప్రకరణ శాస్త్రానికి విరుద్ధం కాని రీతిలో సీతారామకల్యాణంలో చేరింది. అలాగే 'వారణ మాయిరం' అనే తమిళ పాశురాలతో జరిగే బంతులాట కూడా సంప్రదాయ సిద్దమైన వేడుకే. ఇరవైనాలుగు వైదిక అంశాలతో మూడు గంటలపాటు నయన మనోహరంగా జరిగే సీతారామ కల్యాణం సామాన్యునికి మధురానుభూతులను కలిగిస్తుంది.
పట్టాభిషేక ప్రాభవం:
భద్రాచలంలో కల్యాణ మహేోత్సవం తరువాత అంతటి వైభవంగా జరిగే మరో ఉత్సవం శ్రీరామపట్టాభిషేకం. ఈలోకానికి మళ్లీ రామరాజ్యం రావాలని మహా ఆశ దేశ పాలకులలో శ్రీరాముని సుగుణాలు నిండాలనే భద్రాచలం దేవాలయం ఉద్దేశ్యంతో శ్రీరామ పట్టాభిషేకాలు విరివిగా చేయమని పెద్దల ఆదేశం. పట్టాభిషేకాలు జరిగే వేదికలపై రాజధర్మాలు, న్యాయపద్ధతులు పాలకుల మంచిగుణాలను వ్రకటించే అవకాశం ఉంటుంది.
ఆదర్శ పాలకుడైన శ్రీరామ వట్టాభిషేకమే నేటి పాలకులకు నీతిపాఠాలు నేర్పించే వేదికగా మారుతుంది. శ్రీరామాయణ పారాయణకు అనుగుణంగా పట్టాభిషేక నిర్వహణ విధిని పెద్దలు నిబంధించారు. రామాయణాన్ని పారాయణ చేసి, దానికి నమావనగా వట్టాభి షేకం జరపాలని తెలియచేశారు.
ఆ నియమం ఆధారంగా భద్రాచల క్షేత్రంలో వట్టాభిషేక మహెూత్సవాలు జరుగుతాయి. మండల త్రయార్చన, పాదుకాది మకుటాంత సమర్పణం, ఆంజనేయ సమ్మానం వంటి ముఖ్య ఘట్టాలతో శ్రీరామ పట్టాభిషేకం కమనీయం.
వెన్నెల వేళ... ఇనకుల తిలకుడి కల్యాణం:
రామపాదం సోకిన నేల ఒంటిమిట్ట, జాంబవంతుని పూజకోసం ఇక్కడ స్వామి కోదండరాముడై వెలిశాడు. అన్ని రామాలయాల్లో వలె శ్రీరామనవమినాటి మధ్యాహ్నం కాకుండా పున్నమి వెలుగుల్లో కోదండ రామయ్యకు కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.
శ్రీ సీతారామలక్ష్మణులు ఒకే శిలలో కొలువుదీరిన క్షేత్రం ఒంటిమిట్ట. పూర్వం దీనినే ఏకశిలానగరం అని పిలిచేవారు. అరణ్యవాస కాలంలో సీతాలక్ష్మణ సమేతుడై శ్రీరాముడు ఇక్కడ కొంతకాలం గడివినట్లు కథనం. ఆ సమయంలో సీతాదేవి దావాంకోనం శ్రీరాముడు, లక్ష్మణుడు వేర్వేరుగా బాణాలతో తీర్థాలు తవ్వారు. వాటినే నేడు |రామతీర్థం, లక్ష్మణ తీర్థం అనేపేర్లతో పవిత్రంగా భావిస్తారు. తదనంతర కాలాల్లో జాంబవంతునికి తొలుత ఈ క్షేత్రంలో సీతారామలక్ష్మణ మూర్తులు లభించడంతో ఆయనే ప్రతిష్టించి పూజించినట్లు స్థలపురాణం చెబుతోంది.
ఒంటిమిట్ట రామాలయం |
పూర్వం దొంగతనాలు చేస్తూ జీవనం సాగించే ఒంటోడు, మిట్టడు అనే సోదరులు స్వామి దర్శనంతో మారిపోయారు. వారికి కనిపించిన విగ్రహాలను పాలకులకు చూపించి ఆలయం నిర్మింవ చేశారు. తరువాత ఈ క్షేత్రానికి ఆ సోదరుల పేరుమీదుగా ఒంటిమిట్ట అనే పేరు వచ్చింది. ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం
ఉదయగిరి ప్రాంత పాలకుడైన కంపరాయలు ఈ గుడిని నిర్మించాడు. తరువాతి విజయనగర చక్రవర్తులు ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు (1863-1936) ఒంటిమిట్ట రామాలయాన్ని పునరుద్ధరించారు. శ్రీరామ సేవా కుటీరం, రథం, రథశాల నిర్మింపచేశారు. పురావస్తుశాఖవారు ఒంటిమిట్ట ఆలయాన్ని అతిప్రాచీన కట్టడంగా గుర్తించి సంక్షిస్తున్నారు.
శ్రీమదాంధ్ర భాగవత కర్త బమ్మెర పోతన ఒంటిమిట్టలోనే ఉండి స్వామివారిని సేవించి భాగవతాన్ని రచించాడు. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య, కాలజ్ఞాన కర్త పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వెంకటకవి, వరకవి, ఇమాంబేగ్, భవనాసిమాల ఓబన్న, వావిలికొలను సుబ్బారావు, సాయం వరదాసు, విజయరాఘవాచార్యులు వంటి. కవివండితులెందరో అవోవ రచనా: కుసుమాలతో ఒంటిమిట్ట రామయ్యను సేవించి తరించారు.
ఒంటిమిట్ట సీతారామ కల్యాణం |
శ్రీరామక్షేత్రాలు అన్నింటా సీతారామ కల్యాణం మిట్టమధ్యాహ్న సమయంలో అభిజిత్‌ల గ్నంలో చేయడం సంప్రదాయం. అందుకు విరుద్ధంగా ఒంటిమిట్టలో శుక్ల పక్ష చతుర్ధశినాటి రాత్రి పండువెన్నెల్లో రామకల్యాణం నిర్వహిస్తారు. అలా రాత్రిపూట వెన్నెల్లో స్వామివారి కల్యాణం నిర్వహించడానికి ఆసక్తికరమైన గాథ ఒకటి ప్రచారంలో ఉంది. చిన్నతనం నుంచి శ్రీరాముడికి చంద్రుడంటే అత్యంత ఇష్టం, చిన్నతనంలో ఆకాశంలో చందమామను చూపిస్తే కానీ అన్నం తినే వాడు. కాదు.. చందమామ అచ్చంగా కావాలని మారాం చేసిన బాలరాముడికి అద్దంలో చందమామను చూపెట్టిన గాథ అందరికీ తెలిసనినదే అటువంటి శ్రీరాముడి కల్యాణం మధ్యాహ్నం జరిగింది. దీనితో చంద్రుడు శ్రీరామ కల్యాణం చూడలేకపోయాడు. తీవ్రమైన దుఃఖానికి బాధకు లోనయ్యాడు. ఈ విషయం శ్రీరాముడికి తెలిసి చంద్రుడిని ఓదార్చి మూడువరాలు ప్రసాదించాడు.
ఆ వరాలేమిటంటే,
- 🌝 రామభద్రుడు ఆనాటి నుంచి శ్రీరామచంద్రుడిగా ప్రసిద్ధుడు కావడం. తరువాతి జన్మలో శ్రీకృష్ణునిగా రాత్రిపూట జన్మించడం.
- 🌝కలియుగంలో రాత్రిపూట కల్యాణం చేసుకోవడం.
ఉత్సవానికి ముందుగా నిర్వహించే ఎదుర్కోలు నన్నివేశం ఉల్లానభరితంగా ఉంటుంది. ఆలయం పక్కనే చలువ పందిళ్ల కింద ఏర్పాటు చేసిన వివాహ వేదికపైకి కల్యాణ మూర్తులను ఊరేగింవుగా తీసుకువస్తారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సీతమ్మ, రామయ్య కల్యాణ వేదిక పై ఆసీనులవుతారు. ఒకపక్క పండితుల కల్యాణ వ్యాఖ్యానాలు కొనసాగుతుండగా, వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య జరిగే వేడుక తన్మయత్వంలో ముంచెత్తుతుంది.
ఆగమ పద్ధతిలో విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్పం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, ప్రవరలు, కన్యాదానం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
రచన: జాగృతి వారపత్రిక