రంజనీ
మూడు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు "రంజన్యై నమః' అని చెప్పాలి.
రంజనీ = రంజింప చేయునది లేదా రంజనము చేయునది.
రంజనీ యంత్రము |
వ్యక్తులు, సన్నివేశాలు రంజింపబడాలంటే, వ్యక్తుల ద్వారా జరిగే సంభాషణ, ఒకరి సాన్నిధ్యం వలన ఒకరికి కలిగే అనుభూతి బాగుండే విధంగా వుండాలి. ఇలా చేయగల సామర్థ్యాన్ని 'రంజనం' అంటారు. చోటులో ' అస్తిత్వం' మాత్రమే వుంటే ఇది సాధ్యం కాదు. 'అస్మిత్వం' వుంటే ఇది సాధ్యమౌతుంది. అంటే - చోటంతా తానే అయి వుండటం అన్నమాట. ఇది అమ్మవారికే చెల్లుతుంది. మిగిలిన ఎవరికైనా చోటులో కొంతమేరకు - ( అస్తిత్వమే' వుంటుంది గాని, అంతటా - 'అస్మిత్వం' వుండదు. రంజింప చేయునది - అని ఈ నామానికి అర్థం.
ఫలస్తుతి:
మనసుకు ప్రశాంతత ఆహ్లాదాన్ని కలిగించే నామ మంత్రం ఇది, ఎప్పుడూ ఏదో ఒక అలజడితో ఆందోళనతో కారణం చిన్నదైనా పెద్దగా భయపడటం, కారణం లేకున్నా కంగారు పడటం, ప్రతి చిన్న దానికి అతిగా స్పందించడం , ఇటువంటి లక్షణాలు తగ్గి ప్రవర్తన, క్రియ, మాట, లో మంచి మార్పు వస్తుంది. అధిక రక్తపోటు , మధుమేహ వ్యాధితో బాధపడే వారికి ఈ నామ మంత్రం గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. నిత్యం ఈ నామ ధ్యానం చేసే వారిలో కోపం తగ్గి క్షమగుణం కలుగుతుంది.. కుటుంబ లో ఎక్కువగా కలహాలి జరుగుతుంటే కొద్దిరోజులు ఈ నామ మంత్రాన్ని "ఓం ఐం హ్రీం శ్రీo రంజని ఆహ్లాదజనని" ఇలా జపించ వచ్చు అలాగే ఈ నామ మంత్రం తో సహస్త్ర నామం సంపుటికరణ చేయవచ్చు.
ఓం ఐం హ్రీం శ్రీo రంజన్యై నమః - ఓం శ్రీ మాత్రే నమః.