దూరదర్శన్ (డిడినేషనల్) సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకుంది. మార్చి 28 నుంచి రామానంద్ సాగర్ నిర్మించిన 'రామాయణ్' ధారావాహికను పునఃప్రసారం చేస్తున్నది. ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరిగి రాత్రి 9 నుంచి 10గంటల వరకు ఈ ధారావాహికను చూడవచ్చు.. అలాగే డిడి భారతి చానల్లో మహాభారతం ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు చూడవచ్చు.
కరోనా కర్ప్యూ వేళ టీవీ చూడకుండా ఉండడం దాదాపు అసంభవం. పత్రికలు రావడం లేదు.
పత్రికలతో పాటే కరోనా కూడా వస్తుందని వదంతలు వచ్చాయి. దీనిని పెద్ద పెద్ద వైద్యులు తోసిపుచ్చారు. ముప్పయ్ రెండు సంవత్సరాల క్రితం మొదటిసారి ఈ ధారావాహిక ప్రసారమైనప్పుడు ఆ సమయంలో దేశమంతా వీధులన్నీ ఖాళీ అయ్యేవంటే అతిశయోక్తి కాదు.
శ్రీరామ నవమికి ముందు రామకథ ధారావాహికను ప్రసారం చేస్తున్నందుకు దూరదర్శన్ కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. చిత్రం ఏమిటంటే ధారావాహిక ఇస్తున్నందుకు దూరదర్శన్ దీనిని చూసే అవకాశం కరోనా కర్ప్యూ ద్వారా ఇచ్చినందుకు నరేంద్ర మోదీకి దేశ ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో సీతారాములుగా దీపికా చికాలియా అరుణ్ గోవిల్ నటించారు. రావణాసురుడు పాత్రలో అరవింద్ త్రివేదీ నటించారు, హనుమాన్ పాత్రలో ధారాసింగ్ కనిపించారు. రామాయణ్ ధారావాహికను పిల్లలతో కలసి తప్పక చూడండి. రామాయణం మన జాతి కావ్యం. దానిని చదివే అవకాశం కోసం ఎదురు చూస్తూ మొదట దృశ్యం రూపంలో వీక్షించండి ఆయా పాత్రల గొప్పతనం గురించి పిల్లలకు చెప్పండి. టీవీలో వచ్చే చర్చలను ఆలకించే అలవాటు పిల్లలకు చేయాలి. విశ్లేషణలు ఎలా ఉంటాయో చూపాలి. సైన్స్, చరిత్ర, కళ జంతు ప్రపంచం, కార్టూన్ చిత్రాలు వంటివి ఎంపిక చేసుకుని చూసే లక్షణాన్ని పిల్లలలో ప్రవేశపెట్టండి.
-జాగృతి