శ్లో|| చతుర్దశ్యష్టమీచైవ – అమావస్యాధ పూర్ణమా!
పర్వాణ్యేతాని రాజేన్ర్ద రవి సంక్రాంతిరేవచ||
పర్వాలు అయిదు: 1. ఆష్టమి, 2. చతుర్దశి, 3. పూర్ణమ, 4.అమావాస్య, 5. సూర్య సంక్రమణ దినం. ఇవే కాక సూర్య – చంద్ర గ్రహణ సమయం, పుష్కర సమయం కూడా “పర్వ” కాలమనే వ్యవహరిస్తారు.
దేవగురువైన బౄహస్పతి ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశించే మొదటి పన్నెండు రోజులే పుష్కరాలు. సంవత్సరాంతంలోని పన్నెండు రోజులు కూడా సంక్రమణ దినాలే. అందువల్ల ఈ 24 రోజులు పర్వదినాలుగానే భావించాలి. ఈ కాలంలో విధియుక్తంగా ఎన్నో పుణ్యకర్మలను ఆచరించాలి.
రచన: నాగవరపు రవీంద్ర