Parashuram Avataram |
క్షత్రియులలో అధర్మ ప్రవర్తన పెరిగి, దుర్మదాంధులైన వారిని నశింపచేసి భూభారాన్ని తగ్గించిధర్మాన్ని నిలబెట్టడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయుడు దాల్చిన అవతారం మరియు వీరు సప్త చిరంజీవులలో ఒకరు.!!
సప్తర్షులలో ఒకరైన జమదగ్ని మరియు రేణుకా మాత కుమారునిగా జన్మించాడు. జమదగ్ని భృగువంశానికి చెందిన ఋచీక మహర్షి మరియు గాధి రాజు కుమార్తె సత్యవతిల (అంటే విశ్వామిత్రుని సోదరి , విశ్వామిత్రుడు గాధి కుమారుడు) సంతానం. అంటే విశ్వామిత్రుడు జమదగ్నికి మేనమామ వరస మరియు పరశురామునికి తాత వరస అన్నమాట !!
ఈవిధంగా పరశురాముడు భృగు వంశానికి చెందినవాడు కనుక ఆయనకి “భార్గవ రాముడు” అని పేరు. తన తండ్రి జమదగ్ని నుండి అఖండ పరశువు (గండ్ర గొడ్డలి) పొందినవాడు కనుకనే ఆయనని “పరశురాముడు” అని పిలుస్తాము
పరశురాముని జననం చిత్రంగా ఉంటుంది.!! ఈ వివరణ భాగవతంలో ఉంటుంది. ఋచీకుడు (అనగా జమదగ్ని తండ్రి మరియు పరశురాముడి తాతగారు) తన భార్య సత్యవతి కోరిక మేరకు సంతానం కొరకై ఒక యఙ్ఞం చేసి విప్రమంత్రపూతమైన ఒక హవిస్సును సత్యవతిని తీసుకోమని రాజమంత్ర పూతమైన రెండవ హవిస్సును సత్యవతి తల్లికి ఇవ్వమని చెబుతాడు.!! కానీ పొరపాటున సత్యవతి తన తల్లికి ఇవ్వవలసిన హవిస్సును తాను తీసుకుని రెండవ హవిస్సును తన తల్లికిస్తుంది. విషయం గ్రహించిన ఋచీకుడు సత్యవతి గర్భాన క్షత్రియ అంశ కలిగిన ఉగ్ర కోపం కల పుత్రుడు జన్మిస్తాడని వివరిస్తాడు. కానీ సత్యవతి ప్రార్థన మేరకు ఆ ఫలితాన్ని మనుమడికి వర్తింపజేస్తాడు.!! అందుకే బ్రాహ్మణుడైన పరశురామునికి క్షత్రియులకు ఉండవలసిన క్షాత్ర లక్షణాలు ఉన్నాయి.!! కానీ ఇది ఆ భగవానుని సంకల్పం ధర్మస్థాపన చేయడానికి
ఇంతటి క్షాత్రం ఉన్నవాడు కనుకనే తన తండ్రి ఆదేశానుసారం తన తల్లి అయిన రేణుకా మాత శిరస్సును ఖండిస్తాడు.!! పుత్రుడి పితృవాక్య ఆదేశాన్ని పాటించినందుకు వరంగా తన తండ్రిని ప్రార్థంచి తిరిగి తన తల్లీ, సోదరులను బ్రతికిస్తాడు.!!
ఒకనాడు హైహవ వంశ రాజు మహా పరాక్రమవంతుడైన కార్త్యవీరార్జునుడు తన సేనా పరివారంతో జమదగ్ని ఆశ్రమానికి వచ్చినపుడు రాజుకి మరియు తన పరివారానికి.
పరశురామావతారం
శ్రీ మహావిష్ణువు పరశురామునిగా అవతరించిన వైశాఖ శుద్ధ తదియను పరశురామ జయంతిగా పిలుస్తారు. ఈ రోజున ఉపవసించి ప్రదోషకాలంలో పరశురాముని షోడశోపచారాలతో పూజించి అర్ఘ్యమివ్వాలి. పరశురాముని కథ, మహిమలు అద్భుతం. శ్రీమన్నారాయణుని అంశావతారం ఈ పరశురామావతారం.
అధికార గర్వంతో మధించిన అనేకమంది రాజులను చంపి పృథ్విపై ధర్మమును స్థాపించడానికి అవతరించినవాడు పరశురాముడు. జమదగ్ని మహర్షి – రేణుక దంపతుల కుమారుడు.
రేణుకాదేవి ఒక రాజును మోహించినదని భావించి జమదగ్ని ఆమెను వధించమని కొడుకులను ఆదేశించాడు. మిగిలినవారు నిరాకరించగా పరశురాముడు తండ్రి ఆజ్ఞ నిర్వర్తించినాడు. తండ్రి సంతోషించి వరం కోరుకో అన్నాడు. తల్లిని బ్రతికించమనీ, సోదరులను మన్నించమనీ అడుగగా తండ్రి పరశురాముని కోరిక తీర్చాడు. పిదప ఋచీకుని వద్దకు వెళ్ళాడు.
మనుమడి వైఖరి గమనించి శివుని గురించి తపస్సు చేయమన్నాడు. పరశురాముడు శివుని గురించి తీవ్ర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. రౌద్రాస్త్రం యివ్వమని కోరినాడు. అంత అస్త్రాన్ని ధరింపగల శక్తి లేదన్నాడు శివుడు. తిరిగి తపస్సు కొనసాగించాడు. అదే సమయంలో రాక్షసులు దేవలోకంమీద దాడి చేశారు.
శివుడు పరశురాముని రప్పించి దానవులను తరిమివేసే బాధ్యత అప్పగించాడు. నా దగ్గర ఆయుధం లేదన్నాడు పరశురాముడు. వెంటనే శివుడు అతనికి ఒక పరశువు అనగా గొడ్డలిని బహూకరించాడు. పరశురాముడు రాక్షసులను తరిమివేసి తిరిగి తపస్సులో కూర్చున్నాడు. శివుడు మరోసారి ప్రత్యక్షమైనాడు. అతడు కోరిన అస్త్రాలన్నీ యిచ్చాడు. పిదప వేయి చేతులుగల కార్తవీర్యార్జునుడనే రాజు సపరివారంగా జమదగ్ని ఆశ్రమానికి వెళ్లి ఆశ్రమంలో వున్న కామధేనువును చూశాడు.
ముని కామధేనువును ప్రార్థించి రాజుకు పరివారానికీ పలు రకాల విందులు అందజేశాడు. రాజు ఆ కామధేనువును అపహరించాడు. అడ్డు వచ్చిన జమదగ్నిని భటులు సంహరించారు. భృగుమహర్షి వచ్చి జమదగ్నిని తిరిగి జీవింపజేస్తాడు. రాజు కార్తవీర్యుని దురాగతం గురించి తెలిసికొని పరశురాముడు క్రోధంతో ఇరవై యొక్కసార్లు దండెత్తి కార్తవీర్యునితో సహా రాజులందరినీ వధించాడు. ఆ విధంగా పొందిన భూమిని కశ్యపునికి దానం చేసి హింసకు ప్రాయశ్చిత్తంగా తండ్రి సూచనపై తపస్సు వెళ్లిపోయాడు.
స్కంద – భవిష్య పురాణములననుసరించి వైశాఖ శుక్ల తృతీయ పునర్వసున రాత్రి మొదటి యామం సమయంలో శ్రీహరియే రామునిగా రేణుకాదేవి గర్భం నుండి స్వయంగా అవతరించాడు. ఆరు గ్రహాలు ఉచ్ఛస్థానంలో ఉన్నాయి.
మహాతపశ్శాలి పరశురామ జననం శ్రీమన్నారాయణుని దశావతారాల్లో విశిష్టమైనది. ధర్మస్థాపన చేసిన మహర్షి. భూమండలములోని రాజులను వెతికి 21 సార్లు దండెత్తి క్షత్రియుల్ని లేకుండా చేసి భార్గవ రాముడైనాడు. త్యాగశీలిగా తను పొందిన రాజ్యమును కశ్యప మహర్షికి దానం చేసి తపోదీక్షకై మహేంద్ర గిరికి తరలిపోయాడు. తండ్రి యాజ్ఞను నెరవేర్చి తల్లిని సంహరించి తిరిగి పొందిన పితృవాక్య పరిపాలకుడు.
మాతృప్రేమను చాటిన మహనీయుడు పరశురాముడు. పరశురాముడు భూమిమీద దైవభక్తి- సత్కర్మాచరణ- ఆస్తికత్వం నెలకొల్పిన మహాతపశ్శాలి. ఇంతటి మహాతపశ్శాలి జయంతిని పరశురామజయంతిని యావద్భారతదేశం జరిపి ఆ రోజున విష్ణు సహస్రనామపారాయణం – పురాణ పఠనం- సద్గోష్ఠులను నిర్వహించడం ఆనవాయితీ.
త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి శివధనర్భంగమనకు ముందు విశ్వామిత్రునితో పయనమవుతున్న రామలక్ష్మణులను గాంచి విషయం తెలుసుకుని శివధనుస్సు కన్నా ముందు తన వద్దనున్న విష్ణు చాపమును విరువమని ఆవేశంతో కోరగా, వినయంతో శ్రీరాముడు అలాగేయని పరశురాముడు అందించిన వైష్ణవ చాపమును స్పశింపగా అది మాయమైనది. వెంటనే శ్రీరాముని దీవించి తరలిపోయినాడు.
రామాయణ మహాకావ్యంలో ఇది ఒక గొప్ప లీలగా వెలిగింది. రాజులపై చేసిన దండయాత్రలో శరణువేడిన రాజులను కరుణతో క్షమించి వదిలి క్షమాసంపన్నునిగా పేరొందిన కరుణామూర్తి పరశురాముడు. మునికుమారునిగానున్న ఈ పరశురామ జయంతి పురాణ ప్రసిద్ధి చెందినది. యుగయుగాలలో ఈయనను స్మరించి తరించుట ఎంతో భాగ్యం. మహనీయం.
సంకలనం: శివ సత్య ప్రసాద్