రుద్రాక్షలలో అనేక నకిలీలు వస్తున్నాయి వాటిని గుర్తించే విధానం
- 1. రెండు రాగి రేకుల మధ్య రుద్రాక్షను ఉంచితే దానికై అదే సవ్యదిశలో తిరుగుతుంది.
- 2. ఒక గిన్నెలో నీరుపోసి దానిలో రుద్రాక్ష వేసినపుడు మునిగినట్లైతే అసలైనదని గుర్తించవచ్చు. గమనిక : రుద్రాక్ష పాతదయ్యే కొలదీ బరువు తగ్గుతుంది, నీటిలో మునిగే తత్వం కోల్పోతుంది
- 3. రుద్రాక్షలను నీటిలో వేసినపుడు రంగు వెలిసిపోయి వెలవెల పోకూడదు.
- 4. అసలైన రుద్రాక్షను నీటిలో వేసినపుడు కొంచెమైనా వేడి అవుతాయి.
- 5. పాలలో రుద్రాక్షను ఉంచినట్లయితే ఆ పాలు పాడుకాకుండా ఉండినట్లైతే మంచి రుద్రాక్ష.
- 6. కొన్ని చోట్ల స్వతః సిద్ధంగా ముఖాలు ఏర్పడకపోయినా కృత్రిమముగా ముఖాలను గీస్తున్నారు, పరిశీలించి చూస్తే కత్తి తోటి గాటు పెట్టినట్టు తెలుసుకోవచ్చు.
సంకలనం: భానుమతి అంకిశెట్టి