నవ నారసింహ ఆలయాల్లో ప్రధానమైంది కదిరి క్షేత్రం. ఆ దేవుడు కాటమరాయుడు. ఆయనే కదిరి నరసింహుడు. భక్తుల చేత వసంత వల్లభుడిగా ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహుడిగా పూజలు అందుకుంటున్న శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుడి దివ్య క్షేత్రం అనంతపురం జిల్లా కదిరిలో ఉంది.
ప్రతి నెలలో స్వాతినక్షత్రం రోజున మూలవిరాట్ కు అభిషేకం చేస్తారు. నిత్య వైభవంతో కళకళలాడే ఈ క్షేత్రం మార్చి నెలలో పక్షం రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలతో భక్తులతో కిటకిటలాడనుంది. జై నారసింహ ధ్వానాలతో మార్మోతుంది. బ్రహ్మగరుడ సేవ, అత్యంత ప్రధానంగా జరిగే బ్రహ్మ రథోత్సవం (తేరు) అతి వైభవంగా జరుగుతాయి. వీటిని దర్శించేందుకు కదిరి చుట్టుపక్కల జిల్లాల ప్రజలే కాక కర్ణాటక, తమిళనాడు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతారు.
తేరు రోజున కదిరి జనసంద్రంను తలపిస్తుంది. భక్త ప్రహ్లాదుని సహిత నారసింహుని క్షేత్రం భారత దేశంలో మరెక్కడా లేదు. ఒక్క కదిరిలోనే ఉంది. అధి తెలుగువారికే సొంతమైన మరో విశేషం. కదిరి మల్లెపూలు, కనకాంబరాలుకు ప్రసిద్ధిగాంచిది. కదిరి కుంకుమ అంధ్ర, కర్ణాటకలో విరివిగా ఉపయోగిస్తారు. వీటిని స్వామివారికి సమర్పించడం ఆనవాయితి.
శ్రీ మహావిష్ణువు దానవుడైన హిరణ్యకశిపుని శిక్షించేందుకు, భక్తుడైన ప్రహ్లాదుని రక్షణకు నరసింహుని అవతారంలో స్తంభం నుంచి ఉద్భవించాడు. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఆ ఉగ్రరూపంలోనే కదిరి సమీపంలోని కొండపై సంచరించసాగాడు. స్వామి అలాగే ఉండటం సరికాదని ఆయనను శాంతింప చేయాలని దేవతలు మహరులు భావించారు. దేవతలు ఆ కొండపైకి చేరి నరసింహుణ్ణి స్తోత్రిస్తూ నెమ్మదిగా శాంతింప చేశారు. అలా ఆ కొండకు 'సోత్రాద్రి' అని పేరు వచ్చింది. దీనికి గుర్తుగా ఆ కొండపై కదిరికొండ లక్ష్మి నరసింహ దేవస్థానం ఉంది. అదే కొండపై భక్తులకు విష్ణుపాదాలు కూడా కనిపిస్తాయి. 'ఖ' అంటే విష్ణు పాదమని, అద్రి అంటే కొండ అని విష్ణుపాదాలు ఉన్న కొండ కనుక ఈ ప్రాంతానికి భాద్రి అనే పేరు వచ్చిందని అంటారు.
ఖాద్రి చెట్ల నుంచి..
కదిరి పక్కన ఉన్న కొండపై పూర్వం ఖదిర వృక్షాలు (చంద్ర చెట్లు లేదా మడుగు దామర లేదా ఇండియన్ మల్బరీ) ఎక్కువగా ఉండేవి. ఈ చెట్ల దగ్గర ఉన్న పుట్టలోనే నారసింహస్వామి స్వయం భువుగా వెలిశాడు కనుక ఈ నారసింహుణ్ణి ఖాద్రి లక్ష్మీ నరసింహుడు అన్నారని మరో కథనం. స్వామి స్వయంభువుగా వెలిశాడనేదానికి గుర్తుగా అభిషేకం చేశాక హృదయ భాగం నుంచి స్వేద బిందువులు కనిపిస్తాయని ఇది స్వామి వారి మహిమ అని భక్తులు భావిస్తారు.
పాలెగాడి గోవులు..
పదవ శతాబ్దంలో రంగనాయకులు అనే పాలెగాడి గోవులు రోజూ కదిరి కొండపైకి వెళ్లి అక్కడ ఖాద్రీ వృక్షాల కింద గల పుట్టలో ఉన్న నరసింహ స్వామికి పాలు ఇచ్చి వచ్చేవి. దాని కారణంగా రంగ నాయకులు శ్రీమంతుడు అయ్యాడని భక్తుల కథనం. చివరకు ఒకరోజు స్వామి రంగనాయకులకు కలలో కనిపించి తాను స్వయంభువుగా వెలిశానని చెప్పాడు తన విగ్రహానికి గుడి కట్టించమని ఆదేశించాడని తత్ఫలితంగా రంగనాయకులు గుడి నిర్మించాడని ప్రతీతి. అయితే ఆనాటి మూలవిరాట్టు కాలగతిలో అదృశ్యమైంది. బుక్కరాయల కాలంలో ఆ తర్వాత హరిహరరాయల కాలంలో చివరిగా శ్రీ కృష్ణదేవరాయల కాలంలో ఈ గుడి సంపూర్ణ నిర్మాణం పూర్తి చేసుకున్నట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
భృగు మహర్షి తపోస్థలం..
విష్ణువు అనుగ్రహం కోసం భృగు మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేశాడు. ఈ తపస్సుకు మెచ్చిన విష్ణువు తాను కోనేటిలో వెలిసి ఉన్నానని, తన విగ్రహాలను వెల్లడి చేసి పూజాదికాలు నిర్వహించమని కోరినట్టు కథనం. భృగువు కోనేరు నుంచి నారసింహుని విగ్రహాలను బయటకు వెల్లడి చేసింది వసంత మాసంలో కనుక ఈ స్వామిని వసంత వల్లభుడు అని కూడా అంటారు. విగ్రహాలు వెల్లడైన కోనేటిని 'భృగు తీర్థం' అని పిలుస్తున్నారు. ప్రస్తుతం భృగు మహర్షి కాలం నాటి ఈ విగ్రహాలను ఉత్సవ విగ్రహాలుగా ఉపయోగిస్తున్నారు. ఇవి దివ్యతేజస్టసుతో వెలుగొందుతున్నాయి. ఇలా ఉత్సవ విగ్రహాలు ఇంత తేజస్సుతో ఉండటం దేశంలోని వేరే ఏ ఇతర ఆలయంలోనూ చూడలేదని భక్తులు అంటారు.
కంభాల రాయుడు, కాటమరాయుడు:
దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు సగంమనిషి, సగం సింహంగా, నరసింహావ తారంలో భీకర రౌద్ర స్వరూపంతో అవతరించాడు. హిరణ్య కశిపుడి సభామంటపంలోని స్తంభం (కంబం) నుంచి స్వామి ఆవిర్భవించాడు. కనుక శ్రీవారిని కంబాలరాయుడని భక్తులు పిలుచుకుంటారు. అలాగే ఈ స్వామికి కాటమరాయుడు, భేట్రాయస్వామి. అనే పేర్లు కూడా ఉన్నాయి. అన్నమాచార్యులు తన కీర్తనల్లో సైతం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కాటమరాయుడా.. అని కీర్తించారు. కాటమరాయుడు అనే పేరు ఎలా వచ్చిందంటే కదిరి పరిధిలోని గాండ్లపెంట మండలం గొడ్డువెలగల సమీపంలోని కొండపై చంద్రవృక్షపు కొయ్య స్తంభం నుంచి నరసింహ స్వామి వెలసినట్లు భక్తుల విశ్వాసం. ఆ కొండను ఆనుకొని 'కాటం' అనే కుగ్రామం ఉండటంతో స్వామిని కాటమరాయుడిగా పిలుస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పాలేగాళ్లు పాలించారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో పాలేగాళ్ల వారసులు పాల్గొంటారు. పాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు ఉపవాసంతో గొడ్డువెలగల నుండి నృసింహాలయానికి ఆనవాయితీగా ఇప్పటికీ జ్యోతిని తీసుకొస్తున్నారు.
బేట్రాయి స్వామి దేవుడా:
కదిరి శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయానికి తెలుగు ప్రాంతం కంటే కర్ణాటక ప్రాంత భక్తులు విశేష సంఖ్యలో తరలి వస్తుంటారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా స్వామి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో 'పారు వేట' ఒక ముఖ్య కార్యక్రమం. శ్రీదేవి, భూదేవిలతో వసంతవల్లభుడు క్రూరమృగాలను వేటాడటానికి కదిరి కొండకు వస్తాడనడానికి సంకేతంగా అర్చకులు ఈ 'పారువేట'ను నిర్వహిస్తారు. ఈ పారువేట వల్ల 'వేట రాయడు' కాస్త కన్నడభాష వల్ల 'బేట్రాయుడు' అయ్యాడు. మృగాల నుంచి ప్రజలను రక్షించడం పాలకుడి ధర్మం. మనసులో సంచరించే దుష్ట ఆలోచనలనే క్రూరమృగాలను స్వామి సంహరిస్తాడన్న దానికి సంకేతంగా కూడా పారు వేటను చెప్పుకోవచ్చు.
దేశంలోనే 3వ అతి పెద్ద తేరు:
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీనార సింహుడు బ్రహ్మరథంపై దర్శనమిస్తాడు ఈ రథం సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు ఉంది, రథంలోని పీఠం వెడల్పు 16 అడుగులు ఉంది. 130 ఏళ్ల క్రితం తయారు చేసిన ఈ బ్రహ్మ రథం చక్రాలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరమ్మతులు చేయించారు. రథంపై సుమారు 256 శిల్ప కళాకృతులను టేకుతో అందంగా తీర్చిదిద్దారు. తమిళనాడులోని అండాల్అమ్మవారి శ్రీవల్లి పుత్తూరు రథం, తంజావూరు జిల్లాలోని తిరువార్ రథం తర్వాత 3వ అతిపెద్దది ఈ భాద్రీ నృసింహుని రథం.
ఎక్కడా లేని విధంగా ఇక్కడ రథోత్సవం సమయంలో భక్తులు రథంపై దవణం., పండ్లు, ముఖ్యంగా మిరియాలు చల్లుతారు, క్రింద పడిన వీటిని ప్రసాదంగా భావిస్తారు. వీటిని ఏరుకొని తింటే సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం.
బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు పాల్గుణ బహుళ పౌర్ణమిని కదిరి పున్నమిగా జరుపుతారు. ఈ రోజు భక్తులు ఉపవాసం ఉంటారు ప్రతి ఏటా కదిరి అలయంలో నృసింహ జయంతిని వైశాఖ శుద్ధ చతుర్దశి, మల్లెపూల తిరుణాళ్లను వైశాఖ శుద్ధ పౌర్ణమి, చింతపూల తిరుణాళ్లను, అషాడ పౌరణమి, ఉట్ల తిరుణాళ్లను, శ్రావణ బహుళ నవమి,.| దసరా వేడుకల్ని, వైకుంఠ ఏకాదశి రోజుల్లో జరుపుతారు.
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై తన భక్తుడైన ప్రహ్లదుని కాపాడేందుకు అవతరించిన ఉగ్రమూర్తి నరసింహుడు. ఆయన భక్తుల పాలిట కరుణామయుడు. కదిరిలో వెలసి కాటమరాయుడుగా కంభాల రాయుడు, బేట్రాయి స్వామి దేవుడు వసంతవల్లభుడు, ప్రహ్లాదవరద లక్ష్మీనరసింహుడిగా పూజలందుకుంటున్నాడు.
అంటూ నృసింహస్వామి మంత్రాన్ని పరిస్తే చాలు మృత్యువు సైతం ఆమడదూరంలో నిలిచిపోతుందని నమ్మకం. అది నమ్మకం కాదు వాస్తవం అంటూ లక్షలాది ప్రజలు స్వామివారిని ప్రతి ఏటా దర్శించు కొంటున్నారు. స్వామివారిని భక్తి ప్రవత్తులో పూజిస్తున్నారు.
తిరుపతి నుండి మదనపల్లి మీదుగా రావచ్చు పరిసర ప్రాంతాల్లో చూడదగ్గ ప్రదేశాలు: కదిరి లక్ష్మీ నారసింహుని దర్శించుకున్న తర్వాత కదిరి, రాయచోటి రోడ్డు మార్గంలో కేవలం 12 కి.మీ దూరంలో గాండ్లపెంట మండలం కటారుపల్లిలో యోగి వేమన సమాధిని చూడవచ్చు. తర్వాత అదే మార్గంలో మరో 15 కి.మీ దూరంలో ఎన్ పీ కుంట మండలం గూటిబైలు గ్రామంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిమ్మమ్మ మర్రిమాను సందర్శించ వచ్చు. ఇది ఏడున్నర ఎకరాల స్థలంలో విస్తరించి, 1100 ఊడలతో ఉంది. దీని వయస్సు సుమారు ఆరు వందల సంవత్సరాలు ఉంటుందని నమ్మకం. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్వ రల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించు కుంది. వీటిని చూసేందుకు కదిరి ఆర్టీసీ బస్టాండ్ నుండి బస్సు సౌకర్యం ఉంది. దగ్గరలోని శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం - పుట్టపర్తిని దర్శించుకోవచ్చు.
రచన: వసంతాచార్యులు
వ్యాస మూలము: జాగృతి
ప్రతి నెలలో స్వాతినక్షత్రం రోజున మూలవిరాట్ కు అభిషేకం చేస్తారు. నిత్య వైభవంతో కళకళలాడే ఈ క్షేత్రం మార్చి నెలలో పక్షం రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలతో భక్తులతో కిటకిటలాడనుంది. జై నారసింహ ధ్వానాలతో మార్మోతుంది. బ్రహ్మగరుడ సేవ, అత్యంత ప్రధానంగా జరిగే బ్రహ్మ రథోత్సవం (తేరు) అతి వైభవంగా జరుగుతాయి. వీటిని దర్శించేందుకు కదిరి చుట్టుపక్కల జిల్లాల ప్రజలే కాక కర్ణాటక, తమిళనాడు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతారు.
తేరు రోజున కదిరి జనసంద్రంను తలపిస్తుంది. భక్త ప్రహ్లాదుని సహిత నారసింహుని క్షేత్రం భారత దేశంలో మరెక్కడా లేదు. ఒక్క కదిరిలోనే ఉంది. అధి తెలుగువారికే సొంతమైన మరో విశేషం. కదిరి మల్లెపూలు, కనకాంబరాలుకు ప్రసిద్ధిగాంచిది. కదిరి కుంకుమ అంధ్ర, కర్ణాటకలో విరివిగా ఉపయోగిస్తారు. వీటిని స్వామివారికి సమర్పించడం ఆనవాయితి.
శ్రీ మహావిష్ణువు దానవుడైన హిరణ్యకశిపుని శిక్షించేందుకు, భక్తుడైన ప్రహ్లాదుని రక్షణకు నరసింహుని అవతారంలో స్తంభం నుంచి ఉద్భవించాడు. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఆ ఉగ్రరూపంలోనే కదిరి సమీపంలోని కొండపై సంచరించసాగాడు. స్వామి అలాగే ఉండటం సరికాదని ఆయనను శాంతింప చేయాలని దేవతలు మహరులు భావించారు. దేవతలు ఆ కొండపైకి చేరి నరసింహుణ్ణి స్తోత్రిస్తూ నెమ్మదిగా శాంతింప చేశారు. అలా ఆ కొండకు 'సోత్రాద్రి' అని పేరు వచ్చింది. దీనికి గుర్తుగా ఆ కొండపై కదిరికొండ లక్ష్మి నరసింహ దేవస్థానం ఉంది. అదే కొండపై భక్తులకు విష్ణుపాదాలు కూడా కనిపిస్తాయి. 'ఖ' అంటే విష్ణు పాదమని, అద్రి అంటే కొండ అని విష్ణుపాదాలు ఉన్న కొండ కనుక ఈ ప్రాంతానికి భాద్రి అనే పేరు వచ్చిందని అంటారు.
శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుడి ఉత్సవ మూర్తి |
కదిరి పక్కన ఉన్న కొండపై పూర్వం ఖదిర వృక్షాలు (చంద్ర చెట్లు లేదా మడుగు దామర లేదా ఇండియన్ మల్బరీ) ఎక్కువగా ఉండేవి. ఈ చెట్ల దగ్గర ఉన్న పుట్టలోనే నారసింహస్వామి స్వయం భువుగా వెలిశాడు కనుక ఈ నారసింహుణ్ణి ఖాద్రి లక్ష్మీ నరసింహుడు అన్నారని మరో కథనం. స్వామి స్వయంభువుగా వెలిశాడనేదానికి గుర్తుగా అభిషేకం చేశాక హృదయ భాగం నుంచి స్వేద బిందువులు కనిపిస్తాయని ఇది స్వామి వారి మహిమ అని భక్తులు భావిస్తారు.
పాలెగాడి గోవులు..
పదవ శతాబ్దంలో రంగనాయకులు అనే పాలెగాడి గోవులు రోజూ కదిరి కొండపైకి వెళ్లి అక్కడ ఖాద్రీ వృక్షాల కింద గల పుట్టలో ఉన్న నరసింహ స్వామికి పాలు ఇచ్చి వచ్చేవి. దాని కారణంగా రంగ నాయకులు శ్రీమంతుడు అయ్యాడని భక్తుల కథనం. చివరకు ఒకరోజు స్వామి రంగనాయకులకు కలలో కనిపించి తాను స్వయంభువుగా వెలిశానని చెప్పాడు తన విగ్రహానికి గుడి కట్టించమని ఆదేశించాడని తత్ఫలితంగా రంగనాయకులు గుడి నిర్మించాడని ప్రతీతి. అయితే ఆనాటి మూలవిరాట్టు కాలగతిలో అదృశ్యమైంది. బుక్కరాయల కాలంలో ఆ తర్వాత హరిహరరాయల కాలంలో చివరిగా శ్రీ కృష్ణదేవరాయల కాలంలో ఈ గుడి సంపూర్ణ నిర్మాణం పూర్తి చేసుకున్నట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుడి ఆలయ ద్వారం |
విష్ణువు అనుగ్రహం కోసం భృగు మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేశాడు. ఈ తపస్సుకు మెచ్చిన విష్ణువు తాను కోనేటిలో వెలిసి ఉన్నానని, తన విగ్రహాలను వెల్లడి చేసి పూజాదికాలు నిర్వహించమని కోరినట్టు కథనం. భృగువు కోనేరు నుంచి నారసింహుని విగ్రహాలను బయటకు వెల్లడి చేసింది వసంత మాసంలో కనుక ఈ స్వామిని వసంత వల్లభుడు అని కూడా అంటారు. విగ్రహాలు వెల్లడైన కోనేటిని 'భృగు తీర్థం' అని పిలుస్తున్నారు. ప్రస్తుతం భృగు మహర్షి కాలం నాటి ఈ విగ్రహాలను ఉత్సవ విగ్రహాలుగా ఉపయోగిస్తున్నారు. ఇవి దివ్యతేజస్టసుతో వెలుగొందుతున్నాయి. ఇలా ఉత్సవ విగ్రహాలు ఇంత తేజస్సుతో ఉండటం దేశంలోని వేరే ఏ ఇతర ఆలయంలోనూ చూడలేదని భక్తులు అంటారు.
కంభాల రాయుడు, కాటమరాయుడు:
దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు సగంమనిషి, సగం సింహంగా, నరసింహావ తారంలో భీకర రౌద్ర స్వరూపంతో అవతరించాడు. హిరణ్య కశిపుడి సభామంటపంలోని స్తంభం (కంబం) నుంచి స్వామి ఆవిర్భవించాడు. కనుక శ్రీవారిని కంబాలరాయుడని భక్తులు పిలుచుకుంటారు. అలాగే ఈ స్వామికి కాటమరాయుడు, భేట్రాయస్వామి. అనే పేర్లు కూడా ఉన్నాయి. అన్నమాచార్యులు తన కీర్తనల్లో సైతం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కాటమరాయుడా.. అని కీర్తించారు. కాటమరాయుడు అనే పేరు ఎలా వచ్చిందంటే కదిరి పరిధిలోని గాండ్లపెంట మండలం గొడ్డువెలగల సమీపంలోని కొండపై చంద్రవృక్షపు కొయ్య స్తంభం నుంచి నరసింహ స్వామి వెలసినట్లు భక్తుల విశ్వాసం. ఆ కొండను ఆనుకొని 'కాటం' అనే కుగ్రామం ఉండటంతో స్వామిని కాటమరాయుడిగా పిలుస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పాలేగాళ్లు పాలించారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో పాలేగాళ్ల వారసులు పాల్గొంటారు. పాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు ఉపవాసంతో గొడ్డువెలగల నుండి నృసింహాలయానికి ఆనవాయితీగా ఇప్పటికీ జ్యోతిని తీసుకొస్తున్నారు.
బేట్రాయి స్వామి దేవుడా:
కదిరి శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయానికి తెలుగు ప్రాంతం కంటే కర్ణాటక ప్రాంత భక్తులు విశేష సంఖ్యలో తరలి వస్తుంటారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా స్వామి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో 'పారు వేట' ఒక ముఖ్య కార్యక్రమం. శ్రీదేవి, భూదేవిలతో వసంతవల్లభుడు క్రూరమృగాలను వేటాడటానికి కదిరి కొండకు వస్తాడనడానికి సంకేతంగా అర్చకులు ఈ 'పారువేట'ను నిర్వహిస్తారు. ఈ పారువేట వల్ల 'వేట రాయడు' కాస్త కన్నడభాష వల్ల 'బేట్రాయుడు' అయ్యాడు. మృగాల నుంచి ప్రజలను రక్షించడం పాలకుడి ధర్మం. మనసులో సంచరించే దుష్ట ఆలోచనలనే క్రూరమృగాలను స్వామి సంహరిస్తాడన్న దానికి సంకేతంగా కూడా పారు వేటను చెప్పుకోవచ్చు.
ఖాద్రీ లక్ష్మీనార సింహుడు బ్రహ్మరథం |
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీనార సింహుడు బ్రహ్మరథంపై దర్శనమిస్తాడు ఈ రథం సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు ఉంది, రథంలోని పీఠం వెడల్పు 16 అడుగులు ఉంది. 130 ఏళ్ల క్రితం తయారు చేసిన ఈ బ్రహ్మ రథం చక్రాలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరమ్మతులు చేయించారు. రథంపై సుమారు 256 శిల్ప కళాకృతులను టేకుతో అందంగా తీర్చిదిద్దారు. తమిళనాడులోని అండాల్అమ్మవారి శ్రీవల్లి పుత్తూరు రథం, తంజావూరు జిల్లాలోని తిరువార్ రథం తర్వాత 3వ అతిపెద్దది ఈ భాద్రీ నృసింహుని రథం.
ఎక్కడా లేని విధంగా ఇక్కడ రథోత్సవం సమయంలో భక్తులు రథంపై దవణం., పండ్లు, ముఖ్యంగా మిరియాలు చల్లుతారు, క్రింద పడిన వీటిని ప్రసాదంగా భావిస్తారు. వీటిని ఏరుకొని తింటే సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం.
బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు పాల్గుణ బహుళ పౌర్ణమిని కదిరి పున్నమిగా జరుపుతారు. ఈ రోజు భక్తులు ఉపవాసం ఉంటారు ప్రతి ఏటా కదిరి అలయంలో నృసింహ జయంతిని వైశాఖ శుద్ధ చతుర్దశి, మల్లెపూల తిరుణాళ్లను వైశాఖ శుద్ధ పౌర్ణమి, చింతపూల తిరుణాళ్లను, అషాడ పౌరణమి, ఉట్ల తిరుణాళ్లను, శ్రావణ బహుళ నవమి,.| దసరా వేడుకల్ని, వైకుంఠ ఏకాదశి రోజుల్లో జరుపుతారు.
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై తన భక్తుడైన ప్రహ్లదుని కాపాడేందుకు అవతరించిన ఉగ్రమూర్తి నరసింహుడు. ఆయన భక్తుల పాలిట కరుణామయుడు. కదిరిలో వెలసి కాటమరాయుడుగా కంభాల రాయుడు, బేట్రాయి స్వామి దేవుడు వసంతవల్లభుడు, ప్రహ్లాదవరద లక్ష్మీనరసింహుడిగా పూజలందుకుంటున్నాడు.
ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్
నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుం నమామ్యహం ||
అంటూ నృసింహస్వామి మంత్రాన్ని పరిస్తే చాలు మృత్యువు సైతం ఆమడదూరంలో నిలిచిపోతుందని నమ్మకం. అది నమ్మకం కాదు వాస్తవం అంటూ లక్షలాది ప్రజలు స్వామివారిని ప్రతి ఏటా దర్శించు కొంటున్నారు. స్వామివారిని భక్తి ప్రవత్తులో పూజిస్తున్నారు.
కదిరికి ఇలా చేరుకోవాలి
ఖాద్రీ క్షేత్రాన్ని చేరుకోవడానికి అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ నుండి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉంది. అక్కడి నుంచి ఈ క్షేత్రం 90 కి.మీ పుట్టపర్తి నుంచి కేవలం 40 కి. మీ దూరం. అక్కడి నుండి గోరంట్ల మీదుగా లేదంటే నల్లమాడ మీదుగా రోడ్డుమార్గం ద్వారా చేరుకోవచ్చు.తిరుపతి నుండి మదనపల్లి మీదుగా రావచ్చు పరిసర ప్రాంతాల్లో చూడదగ్గ ప్రదేశాలు: కదిరి లక్ష్మీ నారసింహుని దర్శించుకున్న తర్వాత కదిరి, రాయచోటి రోడ్డు మార్గంలో కేవలం 12 కి.మీ దూరంలో గాండ్లపెంట మండలం కటారుపల్లిలో యోగి వేమన సమాధిని చూడవచ్చు. తర్వాత అదే మార్గంలో మరో 15 కి.మీ దూరంలో ఎన్ పీ కుంట మండలం గూటిబైలు గ్రామంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిమ్మమ్మ మర్రిమాను సందర్శించ వచ్చు. ఇది ఏడున్నర ఎకరాల స్థలంలో విస్తరించి, 1100 ఊడలతో ఉంది. దీని వయస్సు సుమారు ఆరు వందల సంవత్సరాలు ఉంటుందని నమ్మకం. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్వ రల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించు కుంది. వీటిని చూసేందుకు కదిరి ఆర్టీసీ బస్టాండ్ నుండి బస్సు సౌకర్యం ఉంది. దగ్గరలోని శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం - పుట్టపర్తిని దర్శించుకోవచ్చు.
రచన: వసంతాచార్యులు
వ్యాస మూలము: జాగృతి