జీవం ఎలా పుట్టింది? ఇది సైన్స్ కి ఈనాటికీ అంతుపట్టని ఒక మిస్టరీ. పదార్ధం నుండి కాలం గడిచే కొద్దీ కాకతాళీయంగా జీవ పదార్ధం ఏర్పడి ఉండచ్చని, ఆ తర్వాత క్రమ పరిణామం ద్వారా సంక్లిష్టమైన జీవ జాతులు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తల అంచనా.
నిర్జీవ పదార్ధం నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు జీవం పుడుతుందని చెప్పే సిద్ధాంతాన్ని 'అబియో జెనెసిస్' అంటారు. కానీ ఈ సిద్ధాంతానికి ఇప్పటి వరకూ ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ దొరకలేదు. ప్రస్తుతానికి ఇది ఒక ఊహా సిద్ధాంతం మాత్రమే. ప్రయోగశాలల్లో ఇంత వరకూ శాస్త్రవేత్తలు ఒక్క జీవకణాన్ని కూడా సృష్టించలేక పోయారు.
కాలిఫోర్నియా యూనివర్శిటీ భూమి మీద పరిశోధకులు |
పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతంలో అభించిన మాగ్మా శిలల నుండి ఏర్పడిన 10,000 లకు పైగా 'జిర్కాన్' లనే పదార్ధాలను అధ్యయనం చేయడం ద్వారా భూరసాయన శాస్త్రవేత్తలు ఈ అంశాలను నిర్ధారించారు.
జీవం |
ఇప్పటి వరకూ శాస్త్రవేత్తలు భూమి ఏర్పడిన తొలినాళ్ళలో భూమి మీద మీథేన్, అమ్మోనియా, నీటి ఆవిరి, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి వాటితో కూడిన, జీవం పుట్టుకకు అనుకూలం కాని క్షయకరమైన వాతావరణం ఉండేదని, ఆక్సిజన్ తక్కువగా ఉండేదని, వేడిగా ఉండే సంక్లిష్ట వాతావరణం ఉండేదని, ఇప్పటి భూవాతావరణానికి పూర్తిగా భిన్నమైన వాతావరణం ఉండేదని భావిస్తున్నారు.
జీవం పుట్టుకకు అనుకూలం కాని క్షయకరమైన వాతావరణం ఉన్న భూమి |
కానీ, భూమి ఏర్పడిన తొలినాళ్ళలో ఉన్న పరిస్థితుల పట్ల ఇప్పటివరకూ శాస్త్రవేత్తలకున్న భావనలకు సరైన ఆధారాలు లేవని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞుల బృందం నిరూపించింది.
జీవ పదార్ధం |
దాని ఆరంభ దశ కూడా అలాంటి సంకీర్ణ స్థితినే కలిగి ఉండాలి. అంటే జీవజాతులన్నీ ఏర్పడడానికి కావాల్సిన సంకీర్ణ వ్యవస్థ అనాదిగా ప్రకృతిలో ఎల్లప్పుడూ ఉండి తీరాల్సి ఉంటుంది. అప్పుడు క్రమ పరిణామమనే భావనకే అర్ధం లేకుండా పోతుంది.
కానీ కాలిఫోర్నియా యూనివర్శిటీ పరిశోధకులు ఆరంభదశలో భూమి దాదాపు ఇప్పుడు ఉన్నట్లు గానే ఉండేదని నిరూపిస్తున్నారు. మరి ఇలాంటి భూవాతావరణంలో సంక్లిష్టమైన జీవ పదార్ధం ఎలా ఏర్పడిందో శాస్త్రవేత్తలకు అంతు పట్టట్లేదు.
జీవ కణం |
- 🟔 ఫ్రాన్సిస్ క్రిక్ ఇలా అంటారు : “ఇంతటి సంక్లిష్ట నిర్మాణం గల జీవ కణం క్రమ పరిణామం ద్వారా కాకతాళీయంగా పుట్టి ఉండదు. ఇప్పటివరకూ ఉన్న విజ్ఞానం సహాయంతో నిజాయితీ గల మనిషిగా చెప్పాలంటే జీవావిర్భావం అనేది ఒక అద్భుతం (మిరాకిల్).”
- 🟔 జేమ్స్ వాట్సన్ ఇలా అంటారు : " నీరు, గ్లూకోజ్ వంటి పదార్ధాల యొక్క అణువులను అర్ధం ఛేసుకున్నంతగా జీవ కణం యొక్క నిర్మాణాన్ని అర్ధం చేసుకోవడం ఎన్నటికీ సాధ్యం కాదని అంగీకరించక తప్పదు."
జీవకణంలో ఒక భాగమైన మైటోకాండ్రియా |
- 🟔 బ్రిటన్ కి చెందిన ప్రఖ్యాత గణిత - భౌతిక శాస్త్రవేత్త రోజర్ పెన్ రోజ్, జీవం ఏర్పడడానికి అవకాశం గల విశ్వం ఏర్పడడానికి ఎంత వరకూ అవకాశం ఉందో సంభావ్యత ( ప్రాబబిలిటీ ) ద్వారా లెక్కలు వేశాడు. దాని ప్రకారం ఒకటిని టెన్ టూ ది పవర్ ఆఫ్ టెన్ టూ ది పవర్ ఆఫ్ 123 చేత భాగిస్తే వచ్చే సంఖ్య ఎంతో అదే ఆ సంభావ్యత. అంటే దానిని సున్నా కింద లెక్క వేసుకోవచ్చు. కాబట్టి జీవం ఏర్పడడానికి అవకాశం ఉన్న విశ్వం ఏర్పడే అవకాశమే లేదు. 'చైతన్యం' లేక 'ఎరుక' గల ఒకానొక అతీత శక్తి వల్లే జీవం ఏర్పడి ఉండాలి.
దీనికన్నా ముందే డి.సింగ్ మరియు థామ్సన్ అనే గణిత శాస్త్రవేత్తలు ఒక జీవ కణం దానంతటదే ఏర్పడాలంటే ఎంతకాలం పడుతుందో లెక్కలు వేశారు. వీరి లెక్కల ప్రకారం 4.5 బిలియన్ సంవత్సరాలని 64 టూ ది పవర్ ఆఫ్ 80,000 చేత హెచ్చిస్తే ఎంత వస్తుందో అంత కాలానికి ఒక్క జీవ కణం ఏర్పడే అవకాశం ఉంది.. అంత కాలం లోపు ఈ సౌర కుటుంబం నశించి పోతుంది. అంటే ఒక్క జీవ కణం ఏర్పడడానికి కూడా అవకాశం లేదు.
కాబట్టి కాలగతిలో కాకతాళీయంగా జీవకణాలు వాటంతట అవే ఏర్పడే అవకాశం లేదు. మనకు అంతు పట్టని వేరొక శక్తేదో అందుకు కారణమై ఉండాలి. అయినప్పటికీ పాఠ్య గ్రంథాల ద్వారా విద్యార్ధినీ విద్యార్ధులకు అలాగే బోధించడం మౌఢ్యం. శాస్త్రజ్ఞులలో నిజాయితీ లోపించి విజ్ఞానం పేరిట అసత్య భావాలను ప్రచారం చేసి యువకుల మనస్సులను సత్యాన్వేషణ నుండి ప్రక్క దారి పట్టిస్తున్నారంటారు సింగ్ మరియు థామ్సన్.
ఒక జీవ కణంలో యల్ - త్రియోనైన్, యల్ - ఐసోల్యూసైన్ అనే పదార్ధాలు సంశ్లేషించబడడం వల్ల ఏర్పడాల్సిన పదార్ధాన్ని ఆ జీవ కణంలోకి కృత్రిమంగా ప్రవేశపెడితే ఆ సంశ్లేషణ ప్రక్రియ వెంటనే నిలిచి పోయి ఆ పదార్థాలు ఎక్కువ కాకుండా ఆ జీవ కణం చూసుకుంటుంది. అణుస్థాయిలో జరిగే ఇలాంటి సచేతన క్రియలకు కారణమేంటి? వాటిని వివరించగలిగే రసాయనిక సూత్రాలేమిటి? ఈ ప్రశ్నలకు సైన్స్ దగ్గర సమాధానాలు లేవు.
డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం "సహజ ఎన్నిక" లేదా "ప్రకృతి సిద్ధమైన ఎన్నిక" ద్వారా పరిణామ క్రమంలో అంతకంతకూ సంకీర్ణమైన జీవ జాతులు ఏర్పడ్డాయి.
జీవజాతి లక్షణాలు |
విశ్వంలో ఒక్క జీవకణమైనా ఏర్పడాలంటే, అలాంటి లక్ష్యం వైపు పదార్ధాన్ని పనిచేయించే చైతన్యం ఒకటి ఉండి ఉండాలి. జీవులలో కోట్ల సంవత్సరాల పాటు ఈ క్రమపరిణామం జరిగి మానవుడు ఉద్భవించాలన్నా దానిని ఆ దిశగా పయనింపచేసే 'చైతన్యం' లేక 'ఎరుక' అవసరం.
ఇలాంటి చైతన్యం పదార్ధానికే ఉందని భావిస్తే, అప్పుడు జీవం లేని జడ పదార్ధం నుండి చైతన్యం ఏర్పడిందని చెప్పడం సాధ్యం కాదు. చైతన్యము, పదార్ధము ఒకే మూలతత్వం యొక్క రెండు అంశాలని చెప్పాల్సి ఉంటుంది. క్వాంటం సిద్ధాంతం ప్రకారం పరమాణువుల్లోని అంశాలు కణాలుగాను, తరంగాలుగానూ ప్రవర్తించినట్లు ఈ విశ్వానికి ఆధారమైన తత్వం పదార్ధమే కాక చైతన్యం కూడానని చెప్పాల్సి ఉంటుంది.
అంటే మన ప్రాచీన ఆత్మవేత్తలు చెప్పిన " ప్రకృతి - పురుషుడు" అన్న భావననే మనం తిరిగి ఆధునిక సైన్స్ పరిభాషలో చెబుతున్నామన్న మాట. ఇక్కడే భగవద్గీత ఏం చెబుతోందో కొద్దిగా గుర్తు చేసుకుందాం.
- ⭄ "భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము - ఈ ఎనిమిదీ కలిసి భిన్నమైన నా భౌతిక శక్తి (అపరా ప్రకృతి - మాయా శక్తి) యొక్క రూపాలు." ( 7 - 4 )
- ⭄ "మహా బాహుడవైన ఓ అర్జునా! ఇవి కాక జీవ రూపమై ఈ జగత్తునంతటినీ ధరిస్తున్న నా మరో ప్రకృతి (ఉన్నత ప్రకృతి - పురుషతత్వం) ఇంకొకటి ఉందని తెలుసుకో." ( 7 – 5 )
- ⭄ "భౌతిక ప్రకృతి, పురుషుడు (జీవం) - రెండూ అనాది అని తెలుసుకోవాలి. సకల పరివర్తనములు, భౌతిక గుణములు భౌతిక ప్రకృతి నుండి పుట్టినవి." ( 13 – 20 )
- ⭄ "సృజించబడిన సర్వభూతములకు ఈ రెండు ప్రకృతులే కారణములై ఉన్నవి. సమస్త జగత్తుకు మూల కారణము, ప్రళయము రెండూ నేనే." ( 7 -6)
అంటే, భౌతిక ప్రకృతి (అపరా ప్రకృతి - పదార్ధము), సకల జీవుల రూపంలో ఉండే చైతన్యము ( ఉన్నత ప్రకృతి - పురుషుడు) - ఇవి ఒకే మూలతత్వమైన భగవంతుని యొక్క రెండు అంశాలు అని భగవద్గీత చెబుతుంది.
అట్టి చైతన్య శక్తే జీవం లేని జడ పదార్ధం నుండి జీవాన్ని, దాని నుండి మానవుణ్ణి ఉత్పన్నం చేసి ఆధ్యాత్మికానుభూతి వైపునకు క్రమ పరిణామాన్ని కొనసాగిస్తోందని అంగీకరించాల్సి ఉంటుంది.
సంకలనం: మణి కుమార్ వేమూరి