భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో అత్యంత దురదృష్టమైన, హేయమైన సంఘటనగా జలియన్ వాలాబాగ్ ఉదంతం నిలిచిపోయింది. నాటి బ్రిటిష్ పాలకుల దుశ్చర్యకు వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మహిళలు, చిన్న పిల్లలు సైతం ఉన్నారు.
ఇదే సమయంలో జనరల్ రెజినాల్డ్ డయ్యర్ సారథ్యంలోని బ్రిటిష్ సైన్యం ఈ తోటలోకి చొరబడి నిరాయుధులైన జనంపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. మొత్తం 50 మంది సైనికులు పది నిమిషాలు పాటు 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. ప్రవేశ మార్గాలను మూసివేసి, గుమిగూడిన జనంపై గుళ్లవర్షం కురిపించారు. నాటి ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఈ ఘటనలో 1000కి పైగా మరణించగా, 2000 మందికి పైగా గాయపడ్డారు. ఈ హఠత్పారిణామానికి నిశ్చేష్ఠులైన ప్రజలు బయటకు వెళ్లడానికి వీల్లేని పరిస్థితుల్లో నెత్తురోడుతున్నా పార్కు గోడలపైకి ఎక్కేందుకు విఫలయత్నం చేశారు. కొందరు అక్కడే ఉన్న నూతిలోకి దూకేశారు.
జలియన్‌వాలాబాగ్ మారణకాండ బ్రిటిష్ ఇండియన్ చరిత్రలోనే సిగ్గుచేటుగా బ్రిటిష్ ప్రధాని థెరిసా మే వ్యాఖ్యానించారు. అయితే ఆమె అధికారికంగా ఎలాంటి క్షమాపణ చెప్పలేదు. నాటి అమానుషత్వానికి వందేళ్లయిన సందర్భంగా ఓ ప్రకటన చేశారు. 1997లో జలియన్‌వాలాబాగ్‌ను సందర్శించే ముందు.. రాణి ఎలిజబెత్-2 భారత్‌తో తమ గత చరిత్రలో ఈ దురాగతం ఓ బాధాకరమైన ఉదాహరణగా పేర్కొన్న విషయాన్ని థెరిసా మే ఆ ప్రకటనలో ప్రస్తావించారు. అక్కడ బావిలోంచి 120 శవాలను బయటకు తీశారు. నగరంలో కర్ఫ్యూ ఉన్నందున గాయపడినవారని ఆసుపత్రులకు తీసికొని వెళ్ళడం సాధ్యం కాలేదు.
అమృత్‌సర్‌లో 1919 ఏప్రిల్ 13 న జరిగిన జలియన్ వాలా బాగ్ ఉదంతానికి ప్రధాని థెరెసా మే క్షమాపణలు చెప్పాలని కోరుతూ భారత సంతతి ఎంపీ వీరేంద్ర శర్మ బ్రిటన్ పార్లమెంట్లో 2017 అక్టోబరు 19న తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి మద్దతుగా ఐదుగురు ఎంపీల సంతకాలను కూడా వీరేంద్ర శర్మ సేకరించారు. భారత స్వాతంత్ర్య పోరాటాన్ని మలుపు తిప్పిన జలియన్ వాలా బాగ్ ఘటనను బ్రిటన్ ప్రభుత్వం గుర్తించాలని ఆయన ఈ తీర్మానంలో పేర్కొన్నారు. జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగి 2020కి 101 సంవత్సరాలు పూర్తి కావొస్తున్న సందర్భంగా బ్రిటన్ ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాట్లు తెలుస్తుంది. బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కేమెరూన్ భారత్ పర్యటనకు వచ్చినపుడు జలియన్ వాలా బాగ్ ఉదంతాన్ని బ్రిటీషర్లు చేసిన ఓ సిగ్గులేని చర్యగా అభివర్ణించారు.
జలియన్ వాలా బాగ్ ఉదంతానికి నేటి తో 101 సంవత్సరాలు పూర్తి.( భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో భారతీయులపై వూచకోత జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన.)జలియన్ వాలాబాగ్ అనేది అమృత్సర్ పట్టణంలోని ఓ తోట. పంజాబీలకు అత్యంత ముఖ్యమైన వైశాఖీ ఉత్సవం సందర్భంగా వేలాది మంది 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్‌కు చేరుకున్నారు. అయితే, ఇదే ఉత్సవాల్లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చి రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జాతీయోద్యమకారులు సైతం ఇందులో పాల్గొన్నారు. ప్రజలను అణగదొక్కే ప్రయత్నంలో భాగంగానే రౌలత్ చట్టాన్ని బ్రిటిషర్లు తీసుకురావడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇందులో భాగంగా సత్యాపాల్‌ను అరెస్ట్ చేసి, దేశ బహిష్కరణ విధించడాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు. జలియన్ వాలాబాగ్‌లోనూ వారి అరెస్టులను ఖండిస్తూ సంఘీభావం తెలిపారు.
బ్రిటిషు ఉన్మాది జనరల్ రెజినాల్డ్ డయ్యర్ - General Reginald Dyer |
జలియన్ వాలాబాగ్ నుయ్యి |
అమృత్‌సర్‌లో 1919 ఏప్రిల్ 13 న జరిగిన జలియన్ వాలా బాగ్ ఉదంతానికి ప్రధాని థెరెసా మే క్షమాపణలు చెప్పాలని కోరుతూ భారత సంతతి ఎంపీ వీరేంద్ర శర్మ బ్రిటన్ పార్లమెంట్లో 2017 అక్టోబరు 19న తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి మద్దతుగా ఐదుగురు ఎంపీల సంతకాలను కూడా వీరేంద్ర శర్మ సేకరించారు. భారత స్వాతంత్ర్య పోరాటాన్ని మలుపు తిప్పిన జలియన్ వాలా బాగ్ ఘటనను బ్రిటన్ ప్రభుత్వం గుర్తించాలని ఆయన ఈ తీర్మానంలో పేర్కొన్నారు. జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగి 2020కి 101 సంవత్సరాలు పూర్తి కావొస్తున్న సందర్భంగా బ్రిటన్ ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాట్లు తెలుస్తుంది. బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కేమెరూన్ భారత్ పర్యటనకు వచ్చినపుడు జలియన్ వాలా బాగ్ ఉదంతాన్ని బ్రిటీషర్లు చేసిన ఓ సిగ్గులేని చర్యగా అభివర్ణించారు.
జలియన్ వాలా బాగ్ లో వందేళ్ల క్రితం అసువులు బాసిన మన దేశ ప్రజలను గుర్తు చేసుకుందాం.. వారి ప్రాణ త్యాగాలకు ఘనంగా నివాళి అర్పిద్దాం..
జైహింద్