ఈ లాక్డౌన్ సమయంలో చాలా ఖాళీ సమయం చాలా వుంది. ఈ సమయంలో మన ధర్మాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం మీరు చేయవచ్చు. ఎందరో మహానుభావులు మన సనాతనధర్మం గురించి ప్రవచనాలు ఇచ్చారు. ఎవరినీ తక్కువ చేయడం కాదు, కానీ అందులో ముఖ్యమైనవారి పేర్లు.
మీరు తెలుగు వారైతే మీరు వినాల్సిన ప్రవచనకారులు :
భక్తి, రామాయణము, ఆర్షధర్మము, వాఞ్జ్మయము, ఉపాసన, గురుభక్తి, పురాణాలు, స్మృతులు వంటి అంశాలకు -
అసలు మనకు అన్యమతాలకు మధ్య వ్యత్యాసం ఏమిటి?
మన ధర్మాన్ని, దేశాన్ని రక్షించుకోవడం ఎలా అనే అంశాలను శ్రీ రాజీవ్ మల్హోత్రా గారు చాలా అద్భుతంగా చెప్తారు. వారి ప్రవచనాలు, పుస్తకాలు అధ్యయనం చేస్తే అసలు మన ధర్మం ఏంటో బాగా అర్ధమవుతుంది. వారి ప్రసంగాలు కొన్ని హిందీలో కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే డా. సుబ్రమణియం స్వామి గారు హిందూత్వము, మన పూర్వచరిత్ర మొదలుకొని అనేక అంశాల మీద అనేక ప్రవచనాలు ఇచ్చారు. అవి ఆంగ్లభాషలో అంతర్జాలంలో అందుబాటులో ఉన్నాయి.
భారతదేశ పూర్వచరిత్ర, వైభవం, ఆయుర్వేదం, ఆరోగ్యకర జీవనం, గోమాత గురించి హిందీ భాషలో శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు ఎన్నో ప్రసంగాలిచ్చారు.
ఇవి గాక, కంచి పరమాచార్య స్వామి వారి బోధలు పుస్తకరూపంలో దొరుకుతున్నాయి. అవేగాక శృంగేరీ పీఠం వారి సాహిత్యం కూడా అంబాటులో ఉంది. భక్తి గురించి తెలుసుకోవాలంటే శ్రీ రామకృష్ణమిషన్ వారు ముద్రించిన శ్రీ రామకృష్ణ కథామృతం చదవచ్చు. కర్మ, జ్ఞాన, రాజ, భక్తియోగాల కొరకు, చక్కని ప్రేరణ కొరకు స్వామి వివేకానంద గారి సాహిత్యం ఆన్లైన్లోనూ, పుస్తకరూపంలోను అందుబాటులో ఉన్నాయి.
ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎందరో ఉన్నారు. ఇలాంటి మహానుభావులు మన కొరకు వండి, వడ్డించి పెడితే, తినటానికి మనకే బద్ధకము. పిచ్చి పిచ్చి పుస్తకాలు చదివి, బుర్ర పాడు చేసుకోకుండా, ఇలాంటి గొప్ప వ్యక్తులు చెప్పిన విషయాలను చదివి, విని, తెలుసుకుని, మీకూ, దేశానికీ ఉపయోగపడిండి.

- ॐ - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు
- ॐ - బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు
- ॐ - బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు
- ॐ - టి.కె.వి.రాఘవన్ గారు
- ॐ - బ్రహ్మశ్రీ మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు
- ॐ - పూజ్యశ్రీ ఆచార్య ప్రేం సిద్ధార్థ్ గారు
- ॐ - బ్రహ్మశ్రీ దేవిశెట్టి చలపతి రావు గారు
- ॐ - శ్రీ పరిపూర్ణానంద స్వామి గారు మొదలగు ఎందరో ....
- ఇందులో ఉపాసనా రహస్యాలకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు;
- పురాణల కొరకు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు, టి.కె.ఎస్.రాఘవన్ గారు;
- కుటుంబ విలువలు, రామాయణం, భక్తి అంశాల మీద బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు;
- భాగవత ప్రవచనం కోసం బ్రహ్మశ్రీ మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు;
- అద్వైత, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి సిద్ధాంతపరంగా మన ధర్మంలోని ప్రతి సూక్ష్మమైన అంశాన్ని నిశీతంగా తెలుసుకొనుటకు పూజ్యశ్రీ ఆచార్య ప్రేం సిద్ధార్థ్ గారు;
- కర్మసిద్ధాంతం, వివేకచూడామణి, భగవద్గీత మొదలైన అనేక విషయాల కొరకు బ్రహ్మశ్రీ దేవిశెట్టి చలపతి రావు గారు;
- తెలుగు సాహిత్యం, అందులోని గొప్పతనం కోసం బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గార్ల ప్రవచనాలు వినవచ్చు.
- భాగవత ఇత్యాది బోధనలు శ్రీ పరిపూర్ణానంద స్వామి వారు..
అసలు మనకు అన్యమతాలకు మధ్య వ్యత్యాసం ఏమిటి?
మన ధర్మాన్ని, దేశాన్ని రక్షించుకోవడం ఎలా అనే అంశాలను శ్రీ రాజీవ్ మల్హోత్రా గారు చాలా అద్భుతంగా చెప్తారు. వారి ప్రవచనాలు, పుస్తకాలు అధ్యయనం చేస్తే అసలు మన ధర్మం ఏంటో బాగా అర్ధమవుతుంది. వారి ప్రసంగాలు కొన్ని హిందీలో కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే డా. సుబ్రమణియం స్వామి గారు హిందూత్వము, మన పూర్వచరిత్ర మొదలుకొని అనేక అంశాల మీద అనేక ప్రవచనాలు ఇచ్చారు. అవి ఆంగ్లభాషలో అంతర్జాలంలో అందుబాటులో ఉన్నాయి.
భారతదేశ పూర్వచరిత్ర, వైభవం, ఆయుర్వేదం, ఆరోగ్యకర జీవనం, గోమాత గురించి హిందీ భాషలో శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు ఎన్నో ప్రసంగాలిచ్చారు.
ఇవి గాక, కంచి పరమాచార్య స్వామి వారి బోధలు పుస్తకరూపంలో దొరుకుతున్నాయి. అవేగాక శృంగేరీ పీఠం వారి సాహిత్యం కూడా అంబాటులో ఉంది. భక్తి గురించి తెలుసుకోవాలంటే శ్రీ రామకృష్ణమిషన్ వారు ముద్రించిన శ్రీ రామకృష్ణ కథామృతం చదవచ్చు. కర్మ, జ్ఞాన, రాజ, భక్తియోగాల కొరకు, చక్కని ప్రేరణ కొరకు స్వామి వివేకానంద గారి సాహిత్యం ఆన్లైన్లోనూ, పుస్తకరూపంలోను అందుబాటులో ఉన్నాయి.
ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎందరో ఉన్నారు. ఇలాంటి మహానుభావులు మన కొరకు వండి, వడ్డించి పెడితే, తినటానికి మనకే బద్ధకము. పిచ్చి పిచ్చి పుస్తకాలు చదివి, బుర్ర పాడు చేసుకోకుండా, ఇలాంటి గొప్ప వ్యక్తులు చెప్పిన విషయాలను చదివి, విని, తెలుసుకుని, మీకూ, దేశానికీ ఉపయోగపడిండి.
సంకలనం: గౌరీ గణేష్