అయితే అది ప్రభుత్వ నిర్ణయం కాదు,కొన్ని ప్రైవేటు పాఠశాల యాజమాన్యం తీసుకున్న నిర్ణయం అని తరువాత తెలిసింది ! ఏదైతేనేం ప్రైవేటు పాఠశాలల్లో అయినా భగవద్గీతను విధ్యార్థుల జీవితాల్లోకి తేవడం చాలా గొప్ప విషయం!
ఇదే విధంగా మన దేశంలోని కొన్ని ప్రైవేటు స్కూల్లల్లో అయినా కనీసం తొమ్మిదవ తరగతిలో 9 అధ్యాయాలు,10 వ తరగతిలో 9 అధ్యాయాలు ఒక ఉపవాచకం మాదిరిగా గీతా క్లాసులు ప్రారంభిస్తే విధ్యార్థులు ఎలాంటి పరిస్థితుల్లో అయినా స్థితప్రజ్ఞతతో ఉంటారు! వారిలో ఆత్మవిశ్వాసం,మానసికస్థైర్యం పెరుగుతుంది!పరిక్షల్లో ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కాదు కదా దాని ఊహ కూడా రాదు!మన పిల్లలు నిఖార్సయిన భావి పౌరులుగా,వజ్రసంకల్పం ఉన్నవారిలా తయారవుతారు!
హరేకృష్ణ!