ఉగాది |
ఉగాది పండుగకు స్వాగతం
మాసానాం మార్గ శీర్షోహం ఋతునాం కుసుమాకరః అని భగవద్గీత విభూతి యోగంలో శ్రీకృష్ణులు సెలవిచ్చారు మన పండుగలన్నీ ఋతువులపైనే ఆధారపడి ఉన్నాయి.
- ۞ ఉగాది వసంత ఋతువులో వస్తుంది ఈ రోజులలో ప్రకృతి అత్యంత రమణీయంగా
- ۞ ఉంటుంది. తరు శాఖలు కొత్త చిగురులతో కళగా ఉంటాయి.కోకిలలు మామి చిగుళ్ళను ఆస్వాదిస్తూ పంచమ స్వరాన్ని ఆలపిస్తూ ఉంటాయి.
- ۞ సర్వత్రా పక్షుల కిలకిలారావాలతో మారుమ్రోగుతుండగా ఉగాది కోలాహలంగా మన ముందుకొస్తుంది.
- ۞ భారతీయ కాల గణన ప్రకారం ఉగాది ముహూర్తం అన్ని శుభ కార్యాలను ప్రారంభించడానికి సరైనది.
- ۞ బ్రహ్మ సృష్టి ఆరంభించిన అధ్యాయాన్ని బ్రహ్మ కల్పమని, కల్ప ప్రారంభాన్ని కల్పాది అని
- ۞ ప్రతి కల్పంలో మొదట వచ్చే యుగ ఆది సమయమే ఉగాది అయ్యింది. అలాగే కీ/శ 79 వ సం.లో
శాలివాహన చక్రవర్తి ఉగాది నాడే పట్టాభిషిక్తు డయ్యాడు,అందుకే శాలివాహన శకంగా పేర్కొంటున్నాం.
- ۞ కృతయుగం 17,28,000
- ۞ త్రేతాయుగం 12,96,000
- ۞ ద్వాపరయుగం8,64,000
- ۞ కలియుగం 4,32,000
- ۞ ఒక మహాయుగం43,20.000
- ۞ 71 మహాయుగాలు ఒక మన్వంతరం
శ్రీరాముని పట్టాభిషేకం ఉగాది. శ్రీరామ జన్మోత్సవాలు జరుపుకునే నవ రాత్రులు ఉగాది తోనే ప్రారంభం.
ప్రపంచంలో ఎక్కువ పుష్పాలు వికసించేది వసంతం లోనే కాబట్టి విజ్ఞులు దీనిని మధు హావదం అన్నారు.ప్రకృతిని చూసి పరవసిస్తూ ఛైత్ర శుద్ధ పాడ్యమి గున్నమామి గుబుర్లు, మల్లెల ఘుమ, ఘుమలు, చిగురులెత్తే లేత కొమ్మలు,మలయ సమీరాలు వీటితో పుడమికి పచ్చని చీరను కట్టే చైత్రమాసం ఉగాదిని స్వాగతిస్తుంది.
స్నానం ప్రత్యేకం:
ఉగాది నాడు సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన(తలంటు) స్నానం చేయాలి.
ఒళ్ళంతా నువ్వుల నూనెతో మర్ధనా,సున్నిపిండితో రుద్దుకుని,కుంకుడు కాయ రసంతో తలంటు కోవాలి.
దైవానికి పుష్పార్చన, అర్ఘ్యం, ధూప దీపాదులను సమర్పించి వేప పచ్చడిని స్వీకరించాలి.
పచ్చడి స్వీకరించే ముందు ఎలాంటి ఆహార పదార్ధాలను తినకూడదు.
పచ్చడి ప్రాధాన్యం:
- ❉ ఆరోగ్య పరంగా వేప క్రిమి సంహారిణి,కుష్ఠు, మధుమేహం,క్షయ,దగ్గు సంబంధ వ్యాధులు తగ్గుతాయి.
- ❉ మామిడి రసం గొంతు వ్యాధుల్ని,చిగుళ్ళ వాపు,నోటిపూత నాశనం చేస్తుంది.
- ❉ చింతపండు వాత రోగాల్ని,మూత్ర పిండంలోని రాళ్ళను కరిగిస్తుంది.
- ❉ బెల్లం ధాతువృద్ధిని అందిస్తుంది.
- ❉ పచ్చి మిరప వాతాన్ని దూరం చేస్తుంది.
- ❉ ఉప్పు అజీర్ణాన్ని పోగొడుతుంది.
తాత్వికంగా ఆలోచిస్తే
మానవుడు మంచి చెడులను రెండింటిని స్వీకరించాలి. బంధు మిత్రులతో కలసి భోజనం చేయాలి ఆనందంగా.
పంచాంగ శ్రవణం
కవి సమ్మేళనం,.సంకల్పం మొ/లైన వివరాలు.
ఉగాది ప్రాసిస్త్యం " బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు" గారి ప్రవచనం వినండి:
ఉగాది ప్రాసిస్త్యం " బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు" గారి ప్రవచనం వినండి:
సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి