ఎడమ వైపు నిద్ర పోవడం
భోజనం చేసిన తర్వాత ఆహారాన్ని పచనం ( జీర్ణం ) చెయ్యటానికి జఠరాగ్ని ప్రదీప్తమవుతుంది . మెదటగా మెదడు లోని రక్తం , తర్వాత ఇతర అవయవాల్లోని రక్తమంతా తిన్న ఆహారాన్ని పచనం చేయడానికి పొట్ట భాగానికి చేరుతుంది . అపుడు మెదడు విశ్రాంతిని కోరుకుంటుంది . అందు వలన నిద్ర వస్తుంది . నిద్ర పోవడం మంచిది .ఉదయం లేక మధ్యాహ్న భోజనం తర్వాత 30 నుండి 40 నిమిషాల వరకు ఖచ్చితంగా నిద్ర పోవలెను . ఏ కారణం చేతనైనా విశ్రాంతి తీసుకునే అవకాశం లేని వారు కనీసం 10 నిమిషాల పాటు వజ్రాసనం వేయండి.
రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్ర పోకూడదు . కనీసం "2 గంటల" తర్వాత నిద్ర పోవాలి . మీరు వెంటనే నిద్ర పోవడం వలన "మధుమేహం - డయాబెటీస్" , "గుండె జబ్బులు - హార్ట్ ఎటాక్" వచ్చే ప్రమాదముంది .
పడుకునే విధానం:
- 🖝 ఎడమ ప్రక్కకు తిరిగి , ఎడమ చెయ్యి క్రిందకు వచ్చే విధంగా పడుకొని విశ్రమించాలి .
- 🖝 దీనిని *వామ కుక్షి* అవస్దలో విశ్రమించటం అంటారు .
- 🖝 మన శరీరంలో *సూర్యనాడి , చంద్ర నాడి మరియు మధ్యనాడి* అనే మూడు నాడులున్నాయి . సూర్యనాడి భోజనాన్ని జీర్ణం చెయ్యటానికి పనికొస్తుంది . ఈ సూర్య నాడి ఎడమ వైపు తిరిగి పడుకుంటే చక్కగా పని చేస్తుంది .
- 🖝 మీరు అలసత్వానికి గురైయినపుడు , ఇలా ఎడమ వైపున తిరిగి పడుకొనుట వలన అలసత్వం తొలగి పోతుంది . మిగతా రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకుంటారు .
- 1. గురక తగ్గి పోవును .
- 2. గర్బిణీ స్త్రీలకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది . గర్బాశయంకు , కడుపులోని పిండమునకు మరియు మూత్ర పిండాలకు చక్కని రక్త ప్రసరణ జరుగును . వెన్ను నొప్పి , వీపు నొప్పుల నుండి ఉపశమనం కలుగును .
- 3. భోజనం తర్వాత జరిగే జీర్ణక్రియలో సహాయ పడుతుంది .
- 4. వీపు , మెడ నొప్పులున్నవారు ఉపశమనం పొందెదరు .
- 5. శరీరంలో వున్న విషాలని , వ్యర్ద పదార్ధలని తొలగించే రసాయనాలకు తోడ్పడుతుంది .
- 6. తీవ్రమైన అనారోగ్యానికి కారణమైన విష పదార్ధాలు బయటికి నెట్టి వేయ బడును .
- 7. కాలేయం మరియు మూత్ర పిండాలు సక్రమంగా పని చేస్తాయి .
- 8. జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగును .
- 9. గుండెకు శ్రమ తగ్గి సక్రమంగా పని చేయును .
- 10. గుండెలోని మంటను నిరోధిస్తుంది . కడుపులోని ఆమ్లాలు శాంతిస్తాయి .
- 11. ఉదయం అలసట లేకుండా ఉత్సాహంగా వుంటారు .
- 12. కొవ్వు పదార్ధాలు సులభంగా జీర్ణం అవుతాయి .
- 13. మెదడు చురుకుగా పని చేస్తుంది .
- 14. పార్కిన్సన్ మరియు అల్జీమర్ వ్యాధులను కంట్రోలు చేస్తుంది .
- 15. ఆయుర్వేధం ప్రకారం *ఎడమ వైపున తిరిగి పడుకొనే విధానం చాలా ఉత్తమమైన పద్ధతి .
ఎడమ వైపు తిరిగి పడుకొనిన యెడల , మీ శరీరంలో కలిగే మార్పులను ప్రతి రోజు మీరు గమనించ వచ్చును. మీరు ఈ చిన్న మార్పుని చేసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి
గమనిక:
తల తూర్పు వైపు పెట్టి పడుకోవాలి . కుదరకపోతే దక్షిణం వైపు తలపెట్టి పడుకోవాలి. ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదు . చదువు కునేందుకు , ఏదైనా అభ్యాసానికి ఉత్తర దిశ మంచిది .
అనువాదము: కోటి మాధవ్ బాలు చౌదరి