జంధ్యంను సంస్కృతం లో యజ్ఞోపవీతం అంటారు, చూడడానికి ఇది మూడు పోగులతో మామూలు దారంలా కనిపిస్తుంది. కానీ వైదిక ధర్మం అనుసరించే ధర్మాలలో ఇది ఒక పరమ ధర్మంగా ఉంది. దీనినే ఉపనయన సంస్కారం అంటారు.
ఇందులో మూడు దారాలు ఉంటాయి: అవి త్రిమూర్తులకు చిహ్నాలు:
1. దేవశరన్,
2. పితృ శరన్,
3.ఋషి శరన్ లకు ప్రతీకలు, సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీక, కుడిచేతి కింది యెడమ చేతి భుజం నుండి తాకేలా వేసుకుంటారు.
దీని ఒక్కో ఉపవీతంలో మూడేసి దారాలు ఉంటాయి, అంటే మొత్తం 9 (పోగులు) దారాలు అన్నమాట, వాటిని ఒక ముఖము, రెండు నాసిక రంధ్రాలు, రెంద కళ్ళ గ్రంధులు,రెండు చెవులకు,ఒక మలగ్రంధి,ఒక మూత్ర గ్రంధి మొత్తం నవరంధ్రాలకు ప్రతీకలు, అంటే ముఖం తో మంచివి చూసి,తిని, కళ్ళతో మంచిని చూసి, మంచిని వినడం ప్రతీక.
దీనిలోని 5 బ్రహ్మ ధర్మ, అధర్మ, కామ,మోక్షాలకు ప్రతీక, ఇవే పంచజ్ఞానేంద్రియాలకు, పంచకర్మలకు, పంచ యజ్ఞాలకు ప్రతీక.
ఈ జంధ్యం 96 అంగుళాలు ఉంటుంది, ఎందుకంటే ఇది వేసుకునే వారికి 64 కళలు,22 విద్యలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అంటే ఇది 8 సంవత్సరాల వయసు లో వేయడం సరి అయిన వయసుగా నిర్ణయించబడింది. ఆ తరువాతే శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ కాలంలో అలా కాకుండా పెళ్లిలో కూడా చేస్తున్నారు.
ఇక జంధ్యం వేసుకున్న తరువాత నియమాలు:
- 1) మల, మూత్ర విసర్జన సమయం లో యజ్ఞోపవీతాన్ని ఎడమ చెవి కి కట్టాలి,చేతులు కడుక్కున్నకే దానిని కిందికి దించాలి,ఎందుకంటే ఇది ఆ సమయంలో నడుము కు పైభాగంలో ఉండడం వలన అపవిత్రం కాకుండా ఉంటుంది.
- 2) ఏ పోగు అయినా తెగిపోయిన,6 నెలలు గడిచినా నూతన యజ్ఞోపవీతం వేసుకోవాలి.
- 3) తెగిన, విరిగిన వి పూజకు అనర్హం కనుక అది పాడైపోయిన కూడా వెంటనే మార్చాలి.
- 5) పుట్టుక పురుడు,చావు సూతకం తరువాత కూడా జంజం మార్చాలి.
- 6) ఏ స్త్రీ కి అయితే పిల్లలు పుట్టడం అవకాశం లేకపోతే వారు కూడా యగ్నిపవీత ధారణ చేయవచ్చు.
- 7) కానీ ఆ స్త్రీ ప్రతి నెల తన ఋతుక్రమం తరువాత కచ్చితంగా మార్చాలి.
- 8) దీన్ని శుభ్రం చేయడానికి కూడా బయటకు తీయకూడదు,కంఠం లో ఉంచే అటూ, ఇటూ తిప్పుతూ శుభ్రం చేయాలి.
- 9) పొరపాటున కిందికి పడిపోతే ఒక మాల జపం ప్రాయశ్చిత్థమ్ గా జపం చేసి మళ్లీ నూతన యజ్ఞోపవీతం వేసుకోవాలి.
ఇక సైన్స్ శాస్త్రీయ పరంగా ఉపయోగాలు:
- 1) ఎవరైతే దీనిని వేసుకుంటారో,నియమాలు పాటిస్తారో,మల,మూత్ర సమయం లో నియమంగా ఉంటారో వారు ఆ ఉపవీతాన్ని చెవికి పెట్టుకోవడం వలన,ఆ అలవాటు తో నోరు మూసుకొని ఉండడం వలన క్రిమి,కీటకాల నుండి తమను తాము రక్షించుకుంటారు.
- 2) చెవికి పెట్టుకోవడం వలన ఆ సమయంలో చెవికి దెగ్గరలో తిరిగే క్రిమి కీటకాల పైన వత్తిడి పెరిగి దెగ్గరకు రాకుండా ఉంటుంది.
- 3) సైన్స్ ప్రకారం కూడా ఇది నిరూపితమైంది ఏంటంటే,ఇది ధరించేవాళ్ళు మిగతా వారికంటే రక్తపోటు మిగతా రోగాల విషయం లో కాస్త బాగా వుంటారు అని నిరూపితమైంది.
రచన: రేణుకా పరశురామ్