పిత్రు దోషములు
జన్మకుండలిలో పంచమ భావములో శుక్రుడు, శని, రాహువు లేదా ఈ మూడు గ్రహాలలో ఏ రెండు గ్రహాలు అయినా ఉంటే, రవి పాపగ్రహముగా మారి, ఆ పైశాచిక ప్రభావములు జాతకునిపై చూపించబడతాయి.- జన్మకుండలిలో 4వ భావములో కేతువు ఉంటే, చంద్ర గ్రహం యొక్క పైశాచిక ప్రభావములు ఎదుర్కొంటాడు.
- బుధుడు (లేదా) కేతువు (లేదా) బుధ, కేతు కలసి లగ్నములో గాని, 8వ భావములో గాని ఉంటే, జాతకుడు కుజుడు యొక్క పైశాచిక ప్రభావముల ఫలితములు అనుభవిస్తాడు.
- జన్మకుండలిలో చంద్రుడు 3, 6వ భావములో ఉంటే, జాతకుడు బుధుని యొక్క పైశాచిక ప్రభావములు ఎదుర్కొంటాడు.
- శుక్రుడు, బుధుడు లేదా రాహువు ఈ 3 గ్రహములలో ఏ రెండు గ్రహాలు గాని, లేదా మూడు గ్రహాలు 2, 5 ,9,12వ భావములో ఉంటే ఆ జాతకుడు గురువు వలన తీవ్రమైన వ్యతిరేక ఫలితములు అనుభవిస్తాడు.
- జాతకములో రవి లేదా చంద్రుడు లేదా రాహువు లేదా ఏ రెండు గ్రహాలు లేదా ఈ మూడు గ్రహములు కలసి 7వ భావములో ఉన్నట్లైతే జాతకుడు శుక్రుడు కలిగించే వ్యతిరేక ఫలితాలను అనుభవిస్తాడు.
- రవి, చంద్ర లేదా కుజుడు లేదా వీటిలో ఏ రెడ్ను గ్రహములు లేదా ఈ మూడు గ్రహములు కలసి 10వ భావములో లేదా 11వ భావములో ఉంటే, ఆ జాతకుడు శని వలన విపరీతమైన చెడు ఫలితములు అనుభవిస్తాడు.
- రవి లేదా శుక్రుడు లేదా ఇద్దరు 12వ భావములో ఉంటే, జాతకుడు రాహువు యొక్క వ్యతిరేక ఫలితములను అనుభవిస్తాడు.
- చంద్రుడు లేదా కుజుడు 6వ భావములో ఉంటే, జాతకుడు కేతువు వలన చెడు ఫలితాలను అనుభవిస్తాడు.
సంప్రదించాల్సిన చరవాణి: +91-9866193557
చింతా గోపి శర్మ సిద్ధాంతి |