భారతదేశంలో ఒక రాష్ట్రీయ (జాతీయ) జీవనాన్ని రుషులు తపస్సును ధారబోసి, విశ్వ కోసం వికసింపజేశారు.. (ఓం భద్రమిశ్చంతి ఋషయః I సర్విధః తపో దీక్షామ్ ముపనిషే దురాగ్రేమ్ | తధో రాష్ట్రమ్ బలమోజశ్చ జాతమ్ | తదస్మై దేవా ఉపసన్నమన్తు ||)
రాష్ట్రీయ అనే సంస్కృత శబ్దానికి తెలుగులో జాతీయ అనే పదం సమానార్థం కాదు అంతకంటే మించిన పదం లేదు కాబట్టి అదే వాడుతున్నాం. కానీ రుషులు మానవ కల్యాణం కోసం మాత్రమే కాకుండా చరాచర సృష్టిలోని ప్రాణికోటి సంక్షేమాన్ని కోరారు. అందుకనే ఇక్కడి జీవనం వికసించింది. ఇదే ఈ దేశపు రాష్టీయ జీవనం, హిందూ జీవనం. జాతీయత కూడా. అయితే గడచిన 2000 సంవత్సరాలలో ప్రపంచంలో జాతీయత పేరుతో అనేక దేశాలు శక్తిని పుంజుకొన్నాయి.
ప్రపంచాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేశాయి. ఊదాహరణకు హిట్లర్ నాజీయిజం, రష్యా, చైనాల కమ్యానిజం, యూరోప్ దేశాల క్యాపిటలిజం, ఇవన్ని కూడా తమ శక్తిని ఆధారం చేసుకొని, మరొక దేశాన్ని ఆక్రమించుకొన్నాయి. అక్కడ తమ రాజ్యాధికారాన్ని చెలాయించాయి. భారతదేశాన్ని ఆంగ్లేయులు ఆక్రమించి, రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నిర్మించారు. కాబట్టి జాతీయవాదం అనేది ఆ దేశం గొప్పతనం మాత్రమే కాకుండా ఆయా దేశాల శక్తి ద్వారా మిగతా దేశాన్ని కబళించడమో ఆక్రమించడమో, ఆధిపత్యం చెలాయించడం ద్వారానే గుర్తింపునకు వచ్చింది. ఇది చారిత్రక సత్యం కాబట్టి ప్రపంచంలో, అనేకమంది మేధావులలో కూడా జాతీయవాదం ప్రమాదకరమన్న ఆలోచన రూపుదిద్దుకుంది. అపోహ ఉంది అవగాహనా రాహిత్యం కూడా ఉంది, భారతదేశ పరిస్థితి అలాంటిది కాదు. ఈ భూమిలో ప్రారంభం నుంచి 'ఓం భద్రం' - విశ్వకల్యాణమనే ఆదర్శాన్ని స్వీకరించింది. ఇక్కడి జీవన విధానంతోనే ప్రజలు సుఖంగా, వైభవంగా జీవించాలన్నది ప్రధానం కావడం దీని ఫలితమే తమ కృషి. ప్రయత్నం, గుణగణాలు, వనరుల ద్వారా ప్రపంచ మానవాళికి, మిగతా చరాచర స్పష్టికి మేలు కలుగజేయాలి. కాబట్టి రాష్ట్రీయత అనే శబ్దం, రాష్ట్రీయ జీవనం, రాష్ట్రీయ పరంపర, రాష్ట్రీయ సంస్కృతి, రాష్ట్రీయ చరిత్ర అనేది ఈ దేశంలో వికసించింది.
అదే హిందూ రాష్ట్రీయత లేక భారత జాతీయత. లేక ఈ దేశ జాతీయత. ప్రాచీన మూలాలు అన్వేషించినప్పటికి వాటి గుర్తులు నేటికి కనిపిస్తున్నాయి. అమెరికాలో ఫినిక్స్ మహానగరం ఉంది. ఫినిక్స్ దగ్గరలో గ్రాండ్ కెనెన్స్ అనే మూడు పర్వతాలున్నాయి. అవి భూమి లోపల 500 కిలోమీటర్ల పొడవు, 50 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉన్నాయి. వాటిని దర్శనం చేసుకున్నాం. అక్కడి గైడ్ 'ఈ మూడు పర్వతాలను బ్రహ్మ, విష్ణు మహేశ్వరులుగా పిలుచుకుంటారు' అని చెప్పగానే ఆశ్చర్యపోయాం.
అప్పుడు గైడ్ 'మీరెందుకు త్చర్యపోతున్నారు సార్! కొద్ది నిమిషాల తర్వాత మధ్యాహ్నం వేళ అమెరికా ప్రభుత్వం ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రదర్శిస్తోంది. అది 20 నిమిషాలు ఉంటుంది. అది చూడండి' అన్నాడు. ఆ ఫిల్మ్‌లో అమెరికన్ ప్రభుత్వం చూపించింది. 'Long back some people were came to here. They taught culture and civilization. They called the three mountains as Brahma, Vishnu and Maheswara' ) Jogas. నించింది. ఇప్పుడు ఎవరైనా వెళ్లి చూడవచ్చు వినవచ్చు. దీనికి కారణం - నేటి భారత ప్రభుత్వం కానీ, రాజకీయ నాయకులు కానీ కాదు.
మన పూర్వులు, రుషులు, మేధావులు, విద్యావేత్తలు అక్కడికి వెళ్లారు. అమెరికాలోని మూల నివాస ప్రజలకి స్నేహం, సేవలు అందించారు. కనుకనే పర్వతాలరూపంలో నేటికి బ్రహ్మ, విష్ణు మహేశ్వరులుగా గౌరవించుకుంటున్నారు.
అంటే వేలాది సంవత్సరాలుగా భారతీయులు ఈ దేశం నుంచి అనేక దేశాలకు వెళుతున్నారు ముఖ్యంగా దక్షిణ, పూర్వ ఈశాన్య దేశాలకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మంగోలియా లాంటి దేశాల్లో భారతీయుల అడుగుజాడలు కనిపిస్తున్నాయి. అయితే ఆయా దేశాల్లో ఎక్కడా విధ్వంసం సృష్టించినట్లు, ప్రజల ఆస్తులను ధ్వంసం చేసినట్లు కనిపించదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇప్పటికీ గణపతి విగ్రహాలు, భారతీయ సంస్కృతి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
అందుకే రాష్ట్రీయత అనే భావన భారతదేశంలో రాజకీయపరమైంది కాదన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఇక్కడ రాజ్యాలుండేవి. రాజులు ఉండేవారు ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పటికీ ప్రభుత్వం ఉంది. 'ఇజం' ఒక రాజకీయమైన దృష్టి, మేము మాత్రమే గొప్పవారమనే అధిపత్యం చెలాయించే గుణం నిష్క్రియాత్మక ధోరణి (Passive tendency) ఇతరులను కబళించాలనే ఆలోచన, ఇతరుల రాజ్యాలను ఆక్రమించాలనే కోరిక అందులో కనిపిస్తాయి. వ్యవహార సరళి కూడా అందుకు తగ్గట్టే ఉంటుంది. నేడు అనేక దేశాలు సైన్యంతో మనది జాతీయతే ఆక్రమిస్తాయి. అలా కాకపోయినా భిన్న పద్దతులు ఆర్థికసంస్థల ద్వారా ఆయా దేశాల మీద ఆధిపత్యం ప్రదర్శించడం గమనించవచ్చు. అయితే ప్రపంచ ధోరణి ఇలాగే ఉంటుంది. కాబట్టి మనం చెప్పే విషయం అర్థం కావడం కష్టమే అనిపించవచ్చు.
కాబట్టి ఇక్కడి జాతీయత (రాష్ట్రీయత) రాజకీయపరమైనది కాదు. సాంస్కృతిక పరమైనది. ప్రజావళిని కలిపి ఉంచేది. సంస్కృతిని ఒకటిగా నిలిపేది. ఏకాత్మతను నిర్మాణం చేసేది. రాజకీయ శక్తులలో ఆధిపత్యం, దురాక్రమణలున్నాయి. కానీ, రాష్ట్రీయతలో ప్రేమ, కరుణ, త్యాగం, సేవ సమన్వయాలు ఉన్నాయి. అలాగే హిందూ రాష్ట్రం, భారతరాష్ట్రం, హిందూ రాష్ట్రీయ భావన, హిందూ రాష్ట్రీయత, అనేవి సరైనవి. రాష్ట్రీయవాదం జాతీయవాదం అనేవి సకారాత్మకమైన భావనను కలిగించే పదాలు కాలేవు. వాదానికి ఇక్కడ అవకాశమే లేదు. ఇదొక జీవన విధానం. ఇదొక జీవనదృష్టి కాబట్టి భారతదేశంలో వేదకాలం నుండి వికసించిన జీవన విధానం ప్రపంచానికి కొన్ని జీవన విలువలను ఇచ్చింది. ఈ సృష్టి ఒకే పరమేశ్వర తత్వం నుంచి జనించింది. పరమేశ్వరుని అంగీకరించిన వ్యక్తులు ఒకే తత్వం, ఒకే పదార్థం అని నమ్ముతారు. రసాయనశాస్త్రంలో పదార్థం మార్పు చెందుతుంది తప్పితే విధ్వంసం కాదు అందుకని ఒకే పదార్థం నుండి ఆవిష్కరించినది.
కాబట్టి సృష్టి అంతటా ఒకే పదార్థం, ఒకే దైవత్వముంది అన్నప్పుడు సృష్టిమొత్తంలో ఏకాత్మత ఉంటుంది. ఏకాత్మతను దర్శించటమే హిందూత్వం, హిందూ రాష్ట్రీయత, హిందూ జీవన విధానం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో వైవిధ్యం ఉంది. భాషల్లో వైవిధ్యం ఉంది. కొన్ని పదార్థాల్లో వైవిధ్యం ఉంది. కాబట్టి అదే కళ్లద్దాలతో చూస్తున్న కారణంగా వేరే వాళ్లకు అర్థం కాదు. వైవిధ్యమనేది సృష్టి సౌందర్యం. Diversity the beauty of nature. అందుకని వైవిధ్యంలో ఏకాత్మతను దర్శించడమే భారతీయ సంస్కృతి, రాష్ట్రీయ జీవనం.
హిందూ రాష్ట్రీయ జీవనం అన్నప్పుడు వైవిధ్యంలో అనేక భాషలున్నాయి. విశ్వంలోని ప్రతి భాషను గౌరవించాలి. ప్రతి భాష వికసించేందుకు అవకాశం ఇవ్వాలి. ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల జీవన పద్ధతులున్నాయి. భోజన పద్దతులున్నాయి. ఆయా మతాలను బట్టి వేషధారణ ఉంది. వాటన్నిటిని గౌరవిస్తూ, వాటి పోషణకు అవకాశం ఇవ్వాలి. ఇతరుల జీవన విధానానికి, మరొక జీవన పద్ధతికి, సమాజ శ్రేయస్సుకు, సృష్టి శ్రేయస్సుకు గాని విఘాతం కలిగించనంత వరకు ప్రతీది గౌరవింప తగినదే.
అలాగే ప్రపంచంలో భగవంతుడిని ఎన్నో పేర్లతో పీలుస్తున్నారు. భగవంతుడు ఒక్కడే. పేర్లు వేర్వేరు. ఆ భగవంతుని చేరడం కోసం పద్దతులు, మార్గాలు అనేకం. ప్రతి మార్గాన్ని గౌరవించవలసిందే. అయితే దైవం పేరుతో మతోన్మాదం, దురహంకారం, తమ మతాన్ని ఇతరులపై రుద్దటం, మతం పేరుతో సామ్రాజ్యాన్ని నిర్మించాలని అనుకోవడం, మత మార్పిడి వంటివి భారతీయ రాష్ట్రీయ జీవనంలో పొసగదు. ఇది మానవాళికి మంచిది కాదు కూడా.
ప్రపంచ వ్యాప్తంగా హిందూ రాష్ట్రీయ జీవనంలోనే ఉపాసన పద్ధతికి స్వాతంత్య్రం ఉంది. ఏ దేవుని పట్ల విశ్వాసం లేనివారికి కూడా స్వాతంత్య్రం ఉంది, అటువంటి వారికీ గౌరవం లభిస్తోంది. ఒక్క హిందూ రాష్ట్రీయ జీవనంలో అందరూ కలిసి జీవించే అవకాశం ఉంటుంది. ఇజం అన్నప్పుడు మళ్లీ ' వెంటనే వేరేవాళ్లమీద తమ భావాలను రుద్దే దృష్టి ఏర్పడుతుంది.
హిందూ రాష్ట్రీయ భావన (రాష్ట్రీయత)లో ప్రకృతి అనేది మనిషి భోగం కోసం కాదు. మనిషి కూడా ప్రకృతిలో ఒక అంగం మాత్రమే. ప్రకృతి అంటే మనిషి కోసమే అనే ఆలోచన తప్పు. నేడు మనిషి తన అవసరాల కోసం ప్రకృతిని కొల్లగొడుతున్నాడు ఫలితంగా పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటున్నది వాతావరణం కలుషితమవుతోంది. ప్రపంచంలో వనరులన్నీ ఖాళీ అయిపోతాయని అందరు భయపడుతున్నారు. ఆ దృష్ట్యా హిందూ రాష్ట్రియ జీవనంలో ఉపనిషత్తులో బోధించినట్లుగా. గాంధీజీ చెప్పినట్లుగా, ప్రకృతి మనిషి అవసరాలను తీర్చుతుంది గాని, దురాశను తీర్చలేదు. అందుకనే మనిషి కోరికలను సంయమనం చేసుకోవటమే రాష్ట్రీయత. అదే సంస్కృతి.
మనిషి సుఖంగా గౌరవంగా జీవించాలి. మనిషి తన సుఖం కోసం భోగవిలాసాల కోసం ప్రకృతిని ధ్వంసం చేయడం సంస్కృతికి భిన్నమైనది. పర్యావరణ సంతులనం జరిగి అన్ని ప్రాణులను సంరక్షించేందుకు దోహద పడేదీ, ప్రకృతికి, మనిషికి మధ్య ఉండే సంబంధం తెలిపేదే హిందూ రాష్ట్ర జీవనం. నేడు ప్రపంచంలో అందరు కోరుకునేది 'పర్యావరణ పరిరక్షణ'. ఇది కూడా హిందూ రాష్ట్రీయ జీవనంతోనే సాధ్యమవుతుంది. అందుకే మానవుడికి- ప్రకృతికి మధ్య ఉండే సంబంధం, మానవ- మానవ సమాజానికి ఉండే సంబంధం.. దేశానికి - దేశానికి ఉండే సంబంధం. వీటన్నిటిని సమన్వయం చేసేదే హిందూ రాష్ట్రీయ జీవనం.
అయితే ఇటీవలకాలంలో వచ్చిన ఇజం కారణంగా హిందూ రాష్ట్ర జీవవ విధానాన్ని కూడా జాతీయవాదం అని కొందరు వాడుతున్నారు. ఈ కారణంగా ఒక రాజకీయమైన దృష్టి ఏర్పడింది అందువల్ల అనేక అనుమానాలకు, భ్రమలకు దారితీస్తున్నది. అవన్నీ పటాపంచలై ప్రజలందరూ కలిసి ఉండే వాతావరణం నేడు కావాలి.
మనదేశంలో వైవిధ్యం ఉంది. అనేక ప్రాంతాలు, భాషలు, గిరిజన తెగలు, ప్రకృతి ఆరాధకులు, ఏ దేవుడినీ పూజించని వాళ్లు ఉన్నారు ముస్లింలు, క్రైస్తవులు ఉన్నారు. పార్సీలు, బౌద్ధులు సిక్కులు జీవిస్తున్నారు. వీళ్లందరూ హిందూ సంస్కృతి రాష్ట్రీయత ఆధారంగా కలిసి జీవించగలరు. తమ మతాలను అవలంబిస్తునే అందరూ ఒకే పరమేశ్వర అంశ అనే భావన ఉన్నప్పుడు రాష్ట్రీయ జీవనంలో కలిసి జీవించగలరు. గిరిజన, గ్రామీణ, నగర అనే తేడాలు లేకుండా, ఏ రకమైన తెగలు, భాషా భేదాలు లేకుండా, పూజా పద్ధతులు వేర్వేరు అయినప్పటికి అందరు కలిసి ఈ భూమిలో జీవించగలరు, అందుకు ఆధారం సంస్కృతియే.
ఇక్కడ రాష్ట్రీయ జీవనానికి, రాష్ట్రీయతకు ఆధారం సంస్కృతి తప్ప రాజకీయం కాదు. దేశాన్ని, పాలించేందుకు ప్రభుత్వం అవసరం. రాజ్యాంగం కావల్సిందే. చట్టాలు రూపొందించవలసిందే. వాటిని అందరూ గౌరవించాలి. ఆచరించాలి. అనుసరించాలి కానీ రాజ్యాంగంతో పాటుగా ఈ సంస్కృతిని కూడా అనుసరించాలి. అందుకే రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసే సమయంలో డా|| అంబేడ్కర్ కూడా ఈ దేశ ప్రజల అందరూ కలిసే జీవించాలి అనే ఉద్దేశంతో రాజ్యాంగ నిర్మాణం చేశారు. కనుకనే మత వివక్ష, మత దురాహంకారం, మతం పేరుతో సంతుష్టీకరణ ఈ దేశంలో లేవు. నేడు సామాజిక, రాజకీయ జీవితంలో సంతుష్టీకరణ కారణంగానే భేదాభిప్రాయాలు, హింస దౌర్జన్యాలు చెలరేగుతున్నాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం, హింస కనబడుతున్నాయి వైషమ్యాలు చోటు చేసుకుంటున్నాయి. అసంతృప్తి నిరాశ, నిస్పృహలు కనిపిస్తున్నాయి. అందుకు కారణం ఇజమే.
రెండు ప్రపంచ యుద్దాలు జరిగాయి. మూడవ వ్రవంచ యుద్దం వస్తుందనిపిస్తుంది. వాస్తవానికి మూడవ ప్రపంచ యుద్ధం కొనసాగు తున్నట్లే ఉంది. కనుకనే అందరూ విచారంగా, అసంతృప్తిగా ఉన్నారు. ఏదో ఒక పేరుతో అశాంతి రగులుతోంది. హింసా, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఒకరు మరొకరిని కబళించాలనే దృష్టితో ఉన్నారు. వీటి ప్రతిబింబమే నేటి పరిస్థితి ఇందుకు ఉగ్రవాదం అవసరం లేదు. ఉగ్రవాదాన్ని హింసను ప్రేరేపించి ఏదో ఒక జాతి పేరుతో ప్రాంతం పేరుతో రెచ్చగొట్టి, అబద్దాలు ప్రచారం చేసి, ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి హింసను రెచ్చగొడుతున్నారు. దానికి ఇజమే కారణం.
ప్రాచీన, మధ్య యుగాలలో గానీ, నేడు గానీ వ్యక్తిగత జీవితానికి, కుటుంబ జీవితానికి, సామాజిక జీవితానికి ప్రపంచంలో అన్ని దేశాలు కలిసి ఉండడానికి ఉపకరించే రాష్ట్రీయ భావన సాంస్కృతిక పరమైనది. దానికి మనం, అంటే భారతీయులం ప్రతినిధులం. అలాగే ఈ సమాజం వ్యవహరించాలి హిందూ రాష్ట్రీయతలో, భారత జాతీయతలో జాతీయవాదం అనేది సరైంది కాదు. ఇందులో ఏ రకమైన ఇజం లేదు. ఇది ఏ రకమైన రాజకీయ దురాహంకారం కాదు. అది సాంస్కృతిక, ఏకాత్మత పరమైంది, విశ్వకల్యాణం కోరుకునేది.
ప్రపంచంలో నేడు భారతీయులు ఎక్కడికి వెళ్లినా అక్కడి వారు గౌరవిన్తున్నారు. ఎందుకంటే భారతీయులు స్థానిక జాతీయ జీవనంలో, అక్కడి ప్రజల జీవనంతో మమేకమైతున్నారు. సమాజ వికాసం కోసం కృషిచేస్తున్నారు. వారితో కలసి వనిచేస్తున్నారు. ఎక్కడా కబళించేందుకు యత్నించడం లేదు. ఇది నేడు ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అందుకే వసుధైక కుటుంబకం విశ్వకల్యాణం లాంటివి మనం కోరుకుంటున్నాం. కృణ్యంతో విశ్వమార్యం అనే శబ్దంలో కూడా ఆర్య అనేది జాతి వాచకం కాదు. సంస్కార వాచకం మాత్రమే. అట్లాగే సర్వేభవంతు సుఖినః అంటున్నామే కాని, భారతీయ భవంతు సుఖినః, పాకిస్తాన్ భవంతు సుఖినః అని చెప్పడం లేదు. ఈ దృష్టికోణంలో విశ్వకల్యాణం, సమిష్టి కల్యాణం, చరాచర సృష్టి కల్యాణం కనిపిస్తోంది.
కలసి మెలసి జీవించే అవకాశం ఇచ్చింది మన సంస్కృతి. ఇక్కడ రాష్ట్రం అంటే భూమి. ఆ భూఖండం మీద నివసించే సమాజం. ఆ సమాజ జీవనంతో- వికసించే సంస్కృతి, పరంపర. ఆ సమాజంలో జీవించిన మహాపురుషులు, వారి జీవన విలువలు ఆ సమాజ జీవనలక్ష్యం. ఈ మొత్తం కలిస్తేనే రాష్ట్రం రాష్ట్రీయ జీవనం, రాష్ట్రీయత ఏర్పడతాయి. అందుకనే దీనదయాళ్ జీ భారత- హిందూ - రాష్ట్ర జీవన పరంపర, రాష్ట్రీయ సంస్కృతి, రాష్ట్రీయ చరిత్ర రాష్ట్రీయ మహాపురుషులు, రాష్ట్రీయ జీవన లక్ష్యం వంటి అంశాల గురించి ఒక పుస్తకమే రాశారు అందులో వ్యక్తి నుండి, కుటుంబం, సమాజం, దేశం దేశంలో ఉండే సంస్కృతి తద్వారా ప్రపంచంలోని అన్ని దేశాలనే విషయం విపులంగా వివరించారు వీటిని సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు. రాష్ట్రీయత అంటే ఏమిటో తెలుస్తుంది
వ్యాసకర్త : ఆర్ఎస్ఎస్ సహ సర్కార్యవాహ - పి. భాగయ్య
మూలము: జాగృతి వార పత్రిక
సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి
రాష్ట్రీయ అనే సంస్కృత శబ్దానికి తెలుగులో జాతీయ అనే పదం సమానార్థం కాదు అంతకంటే మించిన పదం లేదు కాబట్టి అదే వాడుతున్నాం. కానీ రుషులు మానవ కల్యాణం కోసం మాత్రమే కాకుండా చరాచర సృష్టిలోని ప్రాణికోటి సంక్షేమాన్ని కోరారు. అందుకనే ఇక్కడి జీవనం వికసించింది. ఇదే ఈ దేశపు రాష్టీయ జీవనం, హిందూ జీవనం. జాతీయత కూడా. అయితే గడచిన 2000 సంవత్సరాలలో ప్రపంచంలో జాతీయత పేరుతో అనేక దేశాలు శక్తిని పుంజుకొన్నాయి.
ప్రపంచాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేసిన కమ్మూనిస్టులు |
హిందూ రాష్ట్రీయత |