ప్రకృతి ఆ తల్లి స్వరూపం ఆ ప్రకృతిలో నే విషపూరితసమైన వ్యాధి ప్రాణాంతకంగా మారింది. దేవతల కాలం నుంచి కూడా సృష్టి కి హాని కలిగి ప్రాణ నష్టం జరిగినప్పుడు దేవతలు సైతం ఆరాధించి నది అమ్మవారిని. ఇప్పుడు సమాజ శ్రేయస్సు కోసం ప్రభుత్వం సాటిల్లెట్ ద్వారా ఔషధం పంపుతున్నారు మనవంతు ప్రయత్నం గా మనము కూడా ఆ తల్లి ఈ స్త్రోత్రం తో ఆమె సాహసాన్ని గుర్తు చేస్తూ రక్షణ చేయమని కోరుకోవాలి. అందరూ ఈ స్త్రోత్రం పారాయణ చేద్దాము.
శ్రీ మహిషాసుర మర్ధిని స్తోత్రం
దశావతారాలు
|
---|
అయి గిరినందిని నందితమేదిని విశ్వ-వినోదిని నందనుతే; గిరివర వింధ్య-శిరోஉధి-నివాసిని విష్ణు-విలాసిని జిష్ణునుతే |
భగవతి హే శితికంఠ-కుటుంబిణి భూరికుటుంబిణి భూరికృతే; జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 1 ||
సురవర-హర్షిణి దుర్ధర-ధర్షిణి దుర్ముఖ-మర్షిణి హర్షరతే; త్రిభువన-పోషిణి శంకర-తోషిణి కల్మష-మోషిణి ఘోషరతే |
దనుజ-నిరోషిణి దితిసుత-రోషిణి దుర్మద-శోషిణి సింధుసుతే; జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 2 ||
అయి జగదంబ మదంబ కదంబవన-ప్రియవాసిని హాసరతే; శిఖరి-శిరోమణి తుఙ-హిమాలయ-శృంగనిజాలయ-మధ్యగతే |
మధుమధురే మధు-కైతభ-గంజిని కైతభ-భంజిని రాసరతే; జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 3 ||
అయి శతఖండ-విఖండిత-రుండ-వితుండిత-శుండ-గజాధిపతే; రిపు-గజ-గండ-విదారణ-చండపరాక్రమ-శౌండ-మృగాధిపతే |
నిజ-భుజదండ-నిపాటిత-చండ-నిపాటిత-ముండ-భటాధిపతే; జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 4 ||
అయి రణదుర్మద-శత్రు-వధోదిత-దుర్ధర-నిర్జర-శక్తి-భృతే; చతుర-విచార-ధురీణ-మహాశయ-దూత-కృత-ప్రమథాధిపతే |
దురిత-దురీహ-దురాశయ-దుర్మతి-దానవ-దూత-కృతాంతమతే; జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 5 ||
అయి నిజ హుంకృతిమాత్ర-నిరాకృత-ధూమ్రవిలోచన-ధూమ్రశతే; సమర-విశోషిత-శోణితబీజ-సముద్భవశోణిత-బీజ-లతే |
శివ-శివ-శుంభనిశుంభ-మహాహవ-తర్పిత-భూతపిశాచ-పతే; జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 6 ||
ధనురనుసంగరణ-క్షణ-సంగ-పరిస్ఫురదంగ-నటత్కటకే; కనక-పిశంగ-పృషత్క-నిషంగ-రసద్భట-శృంగ-హతావటుకే |
కృత-చతురంగ-బలక్షితి-రంగ-ఘటద్-బహురంగ-రటద్-బటుకే; జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 7 ||
అయి శరణాగత-వైరివధూ-వరవీరవరాభయ-దాయికరే; త్రిభువనమస్తక-శూల-విరోధి-శిరోధి-కృతాஉమల-శూలకరే |
దుమి-దుమి-తామర-దుందుభినాదమహో-ముఖరీకృత-దిఙ్నికరే;జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||8 ||
సురలలనా-తతథేయి-తథేయి-తథాభినయోదర-నృత్య-రతే; హాసవిలాస-హులాస-మయిప్రణ-తార్తజనేమిత-ప్రేమభరే |
ధిమికిట-ధిక్కట-ధిక్కట-ధిమిధ్వని-ఘోరమృదంగ-నినాదరతే; జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 9 ||
జయ-జయ-జప్య-జయే-జయ-శబ్ద-పరస్తుతి-తత్పర-విశ్వనుతే; ఝణఝణ-ఝింఝిమి-ఝింకృత-నూపుర-శింజిత-మోహితభూతపతే |
నటిత-నటార్ధ-నటీనట-నాయక-నాటకనాటిత-నాట్యరతే; జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 10 ||
అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే; శ్రితరజనీరజ-నీరజ-నీరజనీ-రజనీకర-వక్త్రవృతే |
సునయనవిభ్రమ-రభ్ర-మర-భ్రమర-భ్రమ-రభ్రమరాధిపతే; జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 11 ||
మహిత-మహాహవ-మల్లమతల్లిక-మల్లిత-రల్లక-మల్ల-రతే; విరచితవల్లిక-పల్లిక-మల్లిక-ఝిల్లిక-భిల్లిక-వర్గవృతే |
సిత-కృతఫుల్ల-సముల్లసితాஉరుణ-తల్లజ-పల్లవ-సల్లలితే; జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 12 ||
అవిరళ-గండగళన్-మద-మేదుర-మత్త-మతంగజరాజ-పతే; త్రిభువన-భూషణభూత-కళానిధిరూప-పయోనిధిరాజసుతే |
అయి సుదతీజన-లాలస-మానస-మోహన-మన్మధరాజ-సుతే; జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 13 ||
కమలదళామల-కోమల-కాంతి-కలాకలితాஉమల-భాలతలే; సకల-విలాసకళా-నిలయక్రమ-కేళికలత్-కలహంసకులే |
అలికుల-సంకుల-కువలయమండల-మౌళిమిలద్-వకులాలికులే;జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||14 ||
కర-మురళీ-రవ-వీజిత-కూజిత-లజ్జిత-కోకిల-మంజురుతే; మిలిత-మిలింద-మనోహర-గుంజిత-రంజిత-శైలనికుంజ-గతే |
నిజగణభూత-మహాశబరీగణ-రంగణ-సంభృత-కేళితతే; జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 15 ||
కటితట-పీత-దుకూల-విచిత్ర-మయూఖ-తిరస్కృత-చంద్రరుచే; ప్రణతసురాసుర-మౌళిమణిస్ఫురద్-అంశులసన్-నఖసాంద్రరుచే |
జిత-కనకాచలమౌళి-మదోర్జిత-నిర్జరకుంజర-కుంభ-కుచే; జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 16 ||
విజిత-సహస్రకరైక-సహస్రకరైక-సహస్రకరైకనుతే; కృత-సురతారక-సంగర-తారక సంగర-తారకసూను-సుతే |
సురథ-సమాధి-సమాన-సమాధి-సమాధిసమాధి-సుజాత-రతే; జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 17 ||
పదకమలం కరుణానిలయే వరివస్యతి యోஉనుదినం న శివే; అయి కమలే కమలానిలయే కమలానిలయః స కథం న భవేత్ |
తవ పదమేవ పరంపద-మిత్యనుశీలయతో మమ కిం న శివే; జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 18 ||
కనకలసత్కల-సింధుజలైరనుషింజతి తె గుణరంగభువం; భజతి స కిం ను శచీకుచకుంభత-తటీపరి-రంభ-సుఖానుభవమ్ |
తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాశి శివం; జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 19 ||
తవ విమలేஉందుకలం వదనేందుమలం సకలం నను కూలయతే; కిము పురుహూత-పురీందుముఖీ-సుముఖీభిరసౌ-విముఖీ-క్రియతే |
మమ తు మతం శివనామ-ధనే భవతీ-కృపయా కిముత క్రియతే;జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||20 ||
అయి మయి దీనదయాళుతయా కరుణాపరయా భవితవ్యముమే; అయి జగతో జననీ కృపయాసి యథాసి తథానుమితాసి రమే |
యదుచితమత్ర భవత్యురరీ కురుతా-దురుతాపమపా-కురుతే; జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 21 ||
|
ఓం శ్రీ మాత్రే నమః
సంకలనం: భానుమతి అక్కిశెట్టి