మహా భారతం ప్రాంతాలు - నాడు, నేడు
మహాభారతం.. పురాణమే కాదు ఒకనాటి చరిత్ర కూడా. మహాభారతంలోని ప్రాంతాలు నేడు ఏఏ నామాలతో ఉన్నాయో తెలుసుకుని తరించండి. ఈ ప్రాంతాల్లో పర్యాటక యాత్ర చేస్తే అదో అలౌక ఆధ్యాత్మిక యాత్ర కాగలదు.
- ⭄ మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్
- ⭄ నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం,ఆంధ్రప్రదేశ్
- ⭄ జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్.
- ⭄ దుర్యోధనుని చంపిన చోటు - కురుక్షేత్ర, హర్యానా
- ⭄ వ్యాస మహర్షి పుట్టిన స్థలం - ధమౌలి, నేపాల్
- ⭄ ప్రతిష్టానపురం (పురూరవుని రాజధాని) - ఝున్సి,అలహాబాద్.
- ⭄ సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం) - కురుక్షేత్ర దగ్గర
- ⭄ హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్
- ⭄ మధుపురం / మధువనం (కంసుని రాజధాని) - మధుర, ఉత్తర్ ప్రదేశ్
- ⭄ వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర
- ⭄ కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్.
- ⭄ మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) - పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్.
- ⭄ ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం) - డెహ్రాడూన్
- ⭄ కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం - కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్)
- ⭄ పాండవుల లాక్షగృహ దహనం - వర్నాల్, హస్తినాపూర్.
- ⭄ శ్రీకృష్ణ, బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్.
- ⭄ ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర
- ⭄ కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్.
- ⭄ పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్, సహజహంపూర్, ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్
- ⭄ మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) - ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం, రాజస్థాన్
- ⭄ విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్
- ⭄ నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం - ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్
- ⭄ జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్
అనువాదము: శ్రీ