వేదాలలోని ఆరోగ్య మంత్రాలతో తిరుమలలో ఘనంగా శ్రీనివాస వేదమంత్ర ఆరోగ్య జపయజ్ఞం
తిరుమల, 2020 మార్చి 22: తిరుమలలో జరుగుతున్న శ్రీనివాస వేదమంత్ర ఆరోగ్య జపయజ్ఞం ఆదివారం 7వ రోజుకు చేరుకుంది. శుక్రవారం నుండి ఈ జపయజ్ఞాన్ని ఉదయం, సాయంత్రం శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపంలో నిర్వహిస్తున్న విషయం విదితమే.
ప్రపంచ మానవాళికి అశాంతిని, ఆనారోగ్యాన్ని దూరం చేసి సర్వతోముఖాభివృద్ధిని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ జపయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. వేద పండితులు రుగ్వేదంలోని మహా సౌరోహిత్య మంత్రాలు, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదంలోని సౌరవం, అరుణం, సామవేదంలోని ప్రాణాయణం, జౌతువం వంటి మంత్రాలు పరమాత్మాలోని దివ్య శబ్ధన్ని వినిపిస్తాయి. అధర్వణ వేదాలలో ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్య మంత్రాలు, మానసిక అందోళనలు తొలగించే మంత్రాలను పఠించడం వలన విశ్వంలోని ప్రాణకోటికి హానికలిగించేవి నశిస్తాయి. దీనివల్ల పాతాలలోకం, భూమిమీద, అంతరిక్షంలోని సకల జీవరాశులకు సంపూర్ణ ఆరోగ్యం, పుష్టి, సుఖశాంతులు చేకూరుతాయని వేదపండితులు తెలిపారు. అదేవిధంగా రాబోవు వసంత ఋతువు నేపథ్యంలో జీవులందరికి తాపత్రాయాలు తొలగి సర్వతో ముఖాభివృద్ధికి వేదపారాయణం, జపం నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ, కర్ణాటక రాష్ట్ర టిటిడి వేదపారాయణ పర్యవేక్షకులు బ్రహ్మశ్రీ హరి వీరభద్ర ఘణపాటి, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 30 మంది వేద పండితులు పాల్గొన్నారు.
Tirumala, 22 March 2020: The ongoing Srinivasa Veda Mantra Arogya Japa Yagnam organised by the SV Higher Vedic Studies Institute of TTD for getting relief to humanity from clutches of pandemic diseases entered seventh day on Sunday.
The Maha Yajnam with Arogya mantras is being conducted from March 16 by the TTD to protect the humanity and also to ensure all round development in a peaceful and healthy environment.
Vedic exponents are chanting maha pourohitya mantra from Rigveda, and Saurava, Aruna mantras from Sukla Yajurveda, Krishna Yajurveda Pranayanam and Raouthuvam mantras from Sama Veda creating a holy vacuum causing demolition of viruses, disease causing germs etc.
Similarly the chanting of Arogya mantras of Atharvana Veda warding off of psychological scares and panic is expected to go a long way in healing the pandemic and blossoming of life in all living beings were also recited by pundits. It is anticipated that in the ensuing spring all life bearing atoms and cells will be rejuvenated without harmful virus impact through Veda parayanams and Japam organised by the TTD.
Project officer Dr Akella Vibhishana Sharma, Karnataka State TTD Veda Parayanams co-ordinator Brahmarshi Virabhadra Ghanapathi, 30 Vedic Pundits from Andhra, Telangana, Karnataka and Tamil Nadu participated.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మూలము: తి.తి.దే