మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బైబిలులో స్త్రీల పట్ల వివక్ష గురించి పూర్తిగా చదవండి.
- 🖝 స్త్రీని పురుషుడు ముట్టకుండుట మేలు. కానీ మనసు నియంత్రించుకోలేకపోతున్నప్పుడు పెళ్లి చేసుకోవటం మంచిది. ఎందుకంటే పురుషుడు స్త్రీని ముట్టడం ద్వారా పాపాత్ముడు అవుతాడని పౌలు బలంగా నమ్మేవాడు. 1 కొరింథీయులు 7:1
- 🖝 స్త్రీకి శిరస్సు తన భర్త, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తునకు శిరస్సు దేవుడు. ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో ఆ స్త్రీ తన తలను అవమానపరచినట్లు అంటే తన భర్తను అవమానించినట్లు, అటువంటి స్త్రీ తలవెంట్రుకలు కత్తిరించుకోవాలి. పురుషుడు దేవుని ప్రతిరూపం మరియు దేవునికి కీర్తి కలిగించేవాడు. కనుక అతడు తన తల కప్పుకొనకూడదు. కాని స్త్రీ వల్ల పురుషునికి కీర్తి కలుగుతుంది. ఎందుకంటే పురుషుడు స్త్రీ నుండి సృష్టింపబడలేదు. స్త్రీ పురుషుని నుండి సృష్టింపబడింది. అంతేకాక పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు స్త్రీ పురుషుని కొరకు సృష్టింపబడింది. 1 కొరింథీయులు 11:2-10
- 🖝 సంఘం( church) క్రీస్తుకు లోబడి ఉన్నట్లే భార్య కూడా తన భర్తకు అన్ని విషయాల్లో లోబడి ఉండాలి. ఎఫెసీయులు 5: 24
- 🖝 స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి అధికారం లేదు. ఈ విషయాన్ని ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. కనుక ఒకవేళ స్త్రీ ఏదైనా విషయాన్ని గురించి తెలుసుకోదలిస్తే, తమ ఇండ్లలో తమ భర్తల్ని అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే స్త్రీలు సంఘంలో మాట్లాడటం అవమానకరం. 1 కొరింథీయులు 14:34-35
- 🖝 స్త్రీలు మౌనంగా ఉంటూ పూర్తిగా లోబడి ఏదైనా నేర్చుకోవాలి. స్త్రీలు బోధించడానికి, పురుషులపై అధికారం చెలాయించడానికి హక్కు లేదు. మరియు స్త్రీలు ఎక్కువగా మాట్లాడకూడదు. దేవుడు ఆదామును మొదట సృష్టించాడు. ఆ తర్వాత హవ్వను సృష్టించాడు. స్త్రీ మోసపోయి పాపియైనది కానీ మోసపోయింది ఆదాము కాదు. దేవుని పట్ల విశ్వాసము, ప్రేమ కలిగివుండి, పవిత్రంగా ఉండి బిడ్డలను కనడం ద్వారా ఆమె రక్షించబడుతుంది. 1 తిమోతి 2:11-15
- 🖝 స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి. ఇది మన ప్రభువుకు నచ్చుతుంది. అలాగే పురుషులు తమ భార్యలను ప్రేమించాలి. వాళ్ళతో కఠినంగా ప్రవర్తించరాదు. కొలొస్సయులు 3:18-19
- 🖝 స్త్రీ సంపర్కం వలన పురుషులు మలినపడుతారు. ప్రకటన గ్రంథం 14:3-4.
చరవాణి: 9515767777.