కొబ్బరి కాయ కొట్టడమెందుకు దేవతలను పూజించే నమయంలో ఇతర శుభకార్యాలు, యజ్ఞాలు, వ్రతాలు చేసే సమయంలో కొబ్బరికాయను తప్పనిసరిగా కొడతారు. నైవేద్యము సమర్పిస్తారు. కొబ్బరికాయపైన ఉన్న పెంకు "ఆహంకారానికి" ప్రతీకగా చెప్పబడింది. పరమేశ్వరుని నిత్యం ధ్యానించడం లేదా పూజించడంవలన అహం నశిస్తుంది.
టెంకాయను కొట్టగానే అది పగిలి తెల్లని మనసువలె కొబ్బరి కనిపిస్తుంది. దాన్ని స్వయంగా దేవుడు ముందు నివేదిస్తాం. అందులో నుండి వచ్చే కొబ్బరినీరులా తమ జీవితాలను భగవంతుని దివ్యచరణాలకు అర్పించా మని తెలుపడమే కొబ్బరికాయ కొట్టడంలోని అర్థం.
కొబ్బరికాయ కొట్టడం |
రచన: జాగృతి