వనవాసుల, గిరివాసుల ఆత్మగౌరవానికి హారతి పట్టే పండగ మేడారం "శ్రీసమ్మక్క: సారలమ్మ" జాతర. భక్తి పారవశ్యం, జీవన విశ్వాసాల శిఖరం మేడారం. భారతదేశంలో జరిగే జాతరలలో విశిష్టమైన గుర్తింపు కలిగిన సంబరం. రెండేళ్లకొకసారి, మూడురోజులపాటు జరిగే ఈ జాతరకు లక్షలాదిగా వనవాసులు, గిరివాసులతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల నగరవాసులు, గ్రామీణులు కూడా హాజరవుతారు. ఈ ఉత్సవంలో ఒక శోభ ఉంది. భక్తి, శక్తి కలగసిన ఆకర్షణ ఉంది.
తెలంగాణ, మహారాష్ట్ర, ఒరిస్సా, బస్తర్చ త్తీస్ఫడ్, ఝార్జండ్ ప్రాంత వనవాసులు గిరివాసులు ఎడ్లబండ్లు కట్టుకొని కుటుంబమంతా జాతరకు చేరుకుంటారు. జాతర మూడురోజులు. మేడారంలోనే బసచేస్తారు. నగరవాసులు తమ తమ స్వంత వాహనాలలోను, మరికొంతమంది ఆర్టిసి బస్సులలో మేడారం చేరుకుంటారు. అందరూ మొక్కులు చెల్లించి 'వెళ్తుంటారు వరంగల్ జిల్లా కేంద్రానికి 110 కి.మీ దూరంలో తాడ్వాయి మండలం లో (ప్రస్తుతం ఈ మండలాన్ని సమ్మక్క- సారలమ్మ మండలంగా ప్రభుత్వం ప్రకటించింది). ఈ జాతర వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు మేడారం జాతర జరుగనున్నది.
మాఘశుద్ధ పౌర్ణమి నాడు ప్రధాన జాతరకు పెద్ద ఎత్తున ప్రజలంతా హాజరై మొక్కులు తీర్చుకుంటారు జాతరలోని మూడురోజులు కీలకమైనవి. మొదటి రోజు సారలమ్మ తల్లిని గద్దెకు తెస్తారు, రెండవరోజు రాత్రి సమ్మక్క తల్లిని గద్దెకు తెస్తారు. మూడవరోజు సమ్మక్క - సారలమ్మ తల్లులకు భక్తులు మొక్కులు సమర్పిస్తారు. నాలుగవ రోజు ఉదయమే దేవతలను వనప్రవేశం చేయిస్తారు. ఈ తంతుతో జాతర ముగుస్తుంది శ్రీ సమ్మక్క- సారలమ్మలను గిరిజనులు తమ ప్రధాన కులదేవతలుగా నమ్ముతూ కొలుస్తున్నారు.
మన పురాణగ్రంథాలను పరిశీలిస్తే 'దేవీ భాగవతం' వంటి గ్రంథం చదివితే, శ్రీ నమ్మక్క తల్లి, శ్రీవనదుర్గయేనని తెలుస్తోంది. గిరిజనులను ఉద్దరించేందుకు శ్రీ సమ్మక్కగా (శిశువుగా) రూపు
దాల్చి కోయవారి మధ్యలోనికి చేరినదని మరో నమ్మకం. ఆదిశక్తి అవతారాలలో శ్రీ వనదుర్గ అవతారం ఒకటన్నది మరువరాని సత్యం
మేడారం జాతరపై అనేక కథనాలున్నాయి. కోయదొరలు, కోయ పూజారుల మౌఖిక కథే ఎక్కువ ప్రాచుర్యంలో వుంది. క్రీ.శ. 1290 నుండి 1323 వరకు ఓరుగల్లు కేంద్రంగా చేసుకొని కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పాలించాడు. ఆ కాలంలో కరినగరాన్ని (నేటి కరీంనగర్) మేడరాజు పాలిస్తుండేవాడు. ఆయన మేనల్లుడు పగిడిద్ద రాజు మేడారాన్ని పాలించేవాడు. దట్టమైన కీకారణ్యంలో కోయప్రజలతో ఈ రాజ్యం సుభిక్షంగా వుండేది ఒకరోజు కోయలు అరణ్యంలో వేటకు వెళ్ళినపుడు పొదలలో ఏడుస్తున్న ఒక చిన్నారి ఆడబిడ్డ వారి కంటబడింది. ఆ ఆడబిడ్డను ఆ కోయలు తమ వెంట తెచ్చుకొని మార్గశిర పౌర్ణమి నాడు ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభిం చారు ఆ బాలిక పెరిగి పెద్దదవుతున్న కొద్ది మేడారంలో అనేక శుభపరిణామాలు జరగడం మొదలయ్యాయి కోయప్రజల కోరిన కోర్కెలు ఫలిస్తుండటంతో ఆమెను దేవతగా పూజించడం ప్రారంభించారు. ఆ బాలిక యుక్త వయస్సుకు రాగానే ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న పగిడిద్దరాజుకి చ్చి వివాహం జరిపించారు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ అనే ఇద్దరు ఆడపిల్లలు, జంపన్న అనే మగపిల్లవాడు జన్మించారు వారు కూడా పెరిగి పెద్దవారయ్యారు (సంతానంలేని మేడరాజుకే అడవిలో దైవదత్తంగా ఆడశిశు వులభించినట్లు మరో కథనంకూడా ఉంది)
బంగారపు ( బెల్లము ) మొక్కు తిర్చుకుంటున్న స్త్రీలు |
ఈ సమయంలోనే కాకతీయ సామ్రాజ్యంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. ప్రతాపరుద్ర చక్రవర్తి కప్పం కట్టాల్సిందిగా పగిడిద్దరాజును ఆజ్ఞాపించాడు. మేడారంలోకూడా తీవ్ర దుర్భిక్షం ఏర్పడటంతో కప్పం కట్టడానికి రాజు నిరాకరించి ముందూ, వెనుకలను ఆలోచించక తనకుతానుగా స్వతంత్రరాజుగా ప్రకటించుకున్నాడు.
గూఢచారుల ద్వారా ప్రతాప రుద్రునికి ఈ విషయం తెలిసి దీనిని రాజద్రోహంగా భావించాడు. ఈ తిరుగుబాటును కనుక ఉపేక్షిస్తే సామ్రాజ్యంలోని ఇతర సామంతరాజులు కూడా ఇదే ధిక్కార స్వరాన్ని విన్పిస్తారని దీంతో మహా సామ్రాజ్య నిర్మాణానికి కాకతీయ పాలకులు అంతవరకు చేసిన కృషి వృధా కాగలదని కాకతీయ పాలకులు భావించారు.
అప్పటికే ఢిల్లీ సుల్తానుల కన్ను కాకతీయ సామ్రాజ్యంపై పడటంతో ప్రతాపరుద్రుడు మంత్రులతో ఆలోచించి రాజ్యతంత్ర విశారదుడు ఔగంధరాయుని నేతృత్వంలో సైన్యాన్ని మేడారంపైకి పంపాడు. యుగంధరుడి నేతృత్వంలో కాకతీయ సైన్యం లక్నవరం సరస్సు వద్దకు చేరుకొని గుడారాలు వేసుకొని యుద్దానికి సన్నాహాలు చేసుకుంది.
ఈ వార్త మేడారం రాజు పగిడిద్ద రాజుకు చేరింది. సమ్మక్క తల్లి, పగిడిద్ద రాజులు స్వయంగా పరిస్థితిని సమీక్షించి యుద్ధ వ్యూహాన్ని రూపొందించుకున్నారు. పగిడిద్దరాజు తన కుమార్తె నాగులమ్మ, కుమారుడు జంపన్న, అల్లుడు గోవిందరాజులతో కలిసి కాకతీయ సైన్యాన్ని ఎదుర్కోవాలని సమ్మక్క యుద్ధ ప్రణాళిక రచించి వారిని యుద్ధానికి పంపింది భీకరయుద్ధంలో వారంతా వీరమరణం పొందారు. తీవ్రంగా గాయపడి కొనవూపిరితో వున్న జంపన్న సంపెంగవాగు దాటుతుండగా ఆ వాగులోనే తుదిశ్వాస విడిచాడు. ఆయన రక్తంతో ఎరుపురంగు దాల్చిన ఆ వాగు అప్పటి నుండి జంపన్నవాగుగా ప్రసిద్ధిగాంచింది. ఈ వాగులో జాతర సమయంలో వరం' పట్టే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతున్నది.
వీరి మరణవార్త విన్న సమ్మక్క తన కుమార్తె సారలమ్మను తోడ్కొని మిగతా కోయసైన్యంతో యుద్ధరంగంలోకి దూకింది. ఆదిశక్తిగా విజృంభించింది. శ్రీ సమ్మక్క చేస్తున్న శత్రుసంహారం చూస్తున్న కోయలు విజయం తమనే వరిస్తుందని భావించారు. ఇంతలో కాకతీయ సైనికుడొకరు “కాకతీయ ఏకవీరాదేవికి జై” అంటూ సమ్మక్క తల్లి వీపువైపు చాటుగా దూరి ఆ తల్లిని, అమ్మను బల్లెంతో వీవులో పొడిచాడు.
వెంటనే ఆమె తానెక్కిన గుర్రాన్ని ఈశాన్య దిక్కునకు నడిపింది. చిలుకల గుట్టవైపు వెళ్లి *
కొండపైకి ఎక్కి అదృశ్యమైంది. ఆమెను అనుసరిస్తూ వెళ్లిన కోయ సైన్యానికి ఎక్కడా వెదికినా కన్పించలేదు. చివరకు నెమలినార వృక్షం క్రింద ఒక కుంకుమ భరిణే కనిపించింది. దానిని తెరిచి చూడగా పసుపూ కుంకుమ కన్పించింది. దానిని వారు 'సమ్మక్కతల్లి ప్రసాదించినదిగా భావించి భద్రపరుచుకున్నారు.
కోయదొరలు తిరిగి యుద్ధరంగానికి వెళ్లగా విగతజీవురాలై పడి వున్న సారలమ్మ కన్పించింది ఈ ఇరువురి ప్రాణత్యాగాలకు గుర్తుగా ఆ ప్రాంతంలో రెండు కర్ర స్తంభాలు పాతి వాటిని దేవతలుగా భావించి పూజిస్తూ జాతర చేయడం ప్రారంభించారు తన తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు ఆ తర్వాత మేడారం వెళ్లి సమ్మక్క- సారలమ్మల త్యాగానికి గుర్తుగా జాతర ప్రారంభించాడని మరో కథనం కూడా ప్రచారంలో వుంది.
యుద్ధానికి సంబంధించి మరికొన్ని కథనాలు ఉన్నాయి: ప్రజలను కన్న బిడ్డలుగా పాలించినవారు కాకతీయ ప్రభువులు. ఇది చరిత్ర సత్యం. అట్టి ప్రభువులలో చివరివాడయిన ప్రతారుద్రుడు నిర్ధాక్షిణ్యంగా మేడరాజ్యంపైకి సైన్యాలను పంపడం సమంజసమనిపించదు. స్వతంత్రాన్ని ప్రకటించుకుని యుద్దానికి సిద్ధమయ్యారన్నది కూడా సమంజసంగా లేదు.
ఇక్కడే చరిత్రకారులు చరిత్రను లోతుగా పరిశీలించారు. ఓరుగల్లుపై దాడికి సన్నద్ధమవుతున్నవి గోదావరి దాటగానే ఢిల్లీ సైన్యాల దాడి మొదట జరిగేది మేడరాజ్యంపైనే విషయం తెలిసిన పగిడిద్ద రాజు విషయాన్ని ప్రతాపరుద్రునికి చేరవేసి యుద్ధ సన్నద్ధమవుతాడు. వివిధ రకాలుగా తుగ్లక్ సైన్యాలను భయపెడుతుంటారు ఇక్కడ ఓరుగల్లుకు పగిడిద్దరాజు పంపిన వార్త చేరదు; కాని పగిడిద్దరాజు యుద్ధ సన్నద్ధం చేయటం విషయంపై అయనకు అపోహ ఏర్పడింది. స్వతంత్రం ప్రకటించుకొని కప్పం ఎగ్గొట్ట చూస్తూన్నారనే వార్త ప్రచారమవుతుంది. కాకతీయ సైన్యం మేడరాజ్యంపైకి దండెత్తి వెడలుతుంది.
తమకు సాయంగానే కాకతీయ సైన్యం విచ్చేస్తున్నదని తెలిసి పగిడిద్దరాజు- కోయ సైన్యాలు తలపడటానికి శంఖనాదాలు పూరిస్తారు.
తుగ్లక్ సైన్యాలతో బాటు వెనక నుండి కాకతీయ సైన్యాలు కోయ సైన్యాన్ని ముట్టడిస్తారు. తర్వాత కథ అందరూ చెప్పేదే. కోయవీరుల వీర మరణం.. ఇక్కడే మరో కథనమూ ఉంది. సమ్మక్క అంతర్ధానమయ్యే ముందు మంత్రి (సేనాపతి) యుగంధరునికి చిలకలగుట్టపై కనిపించి కాకతీయ సైన్యాలు చేసిన తప్పిదానికి కాకతీయ సామ్రాజ్యం సర్వనాశనమవుతుందని సమ్మక్క తల్లి శాపం పెడుతుంది.
ఈ విషయం యుగంధరుడు ప్రతాపరుద్రునికి తెలుపగా ఆయన పశ్చాత్తాపం చెందుతాడు. రాత్రి నిద్రబట్టదు సమ్మక్క తల్లి - కాకతి అమ్మవారిగా కనిపించి ఆగ్రహించగా తన రాజ్యం నాశన మయినట్లు కలగంటాడు. తెల్ల వారి మేడారానికి వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకుని సమ్మక్క- సారక్క సంస్మరణ ఉత్సవాన్ని జరుపుతాడు.
ఆ ఉత్సవమే మేడారం జాతరగా మారిందని మరో కథనం ఉంది. తుగ్లక్ సైన్యాలకు - కోయ సైన్యాలకు మధ్యన మాత్రమే జరిగింది.

అందులో సాయంగా రావలసిన కాకతీయ సైన్యాలు సకాలానికి రావు; కాకతీయ సైన్యంలోని ద్రోహులు కొందరు మేడరాజ్యం చేరకుండా సైన్యాన్ని దారి మళ్లిస్తారు. ఫలితంగా యుద్ధంలో కోయవీరు లందరి వీరమరణం గాయాలతో సమ్మక్కతల్లి అంతర్జానం. ఆ తర్వాత తన సైన్యాలు దారితప్పిన కారణంగా మేడరాజ్యం పతనం, కోయవీరుల మరణం తెలిసిన ప్రతాప రుద్రుడు స్వయంగా వచ్చి సమ్మక్కతల్లితో సహా కోయ వీరుందరి అంత్యేష్ఠిని నిర్వహిస్తాడు.
ప్రతాపరుద్రుడే స్వయంగా సమ్మక్క - సారలమ్మ గద్దెల్ని ప్రతిష్ఠించి పూజిస్తాడు అంటూ మరో కథనమూ ఉంది. సుప్రసిద్ధ చారిత్రక నవలా రచయితలు ఆచార్య ముదిగొండ శివప్రసాదు, నోరి నరసింహశాస్త్రి, లల్లాదేవీ, డా॥ దివిటి అంజలీదేవి రచనలలో సమ్మక్క చరిత్ర కనిపిస్తుంది. నిజమైన చరిత్రను ప్రజలముందుం చడం చరిత్ర పరిశోధకుల కర్తవ్యం. ఏది ఏమైనా సమ్మక్కతల్లి అమ్మవారి అవతారమన్నది నిర్వివాదాంశము.
శ్రీ సమ్మక్క- సారలమ్మ జాతర ప్రారంభానికి ముందు కోయ వడ్డెలు (పూజారులు) చిలుకల గుట్టపై భాగానికి వెళ్లి పసుపు, కుంకుమ ఉన్న భరిణెను వెదురు గడను పూజాదికాలు నిర్వహించి గద్దెల వద్దకు తెస్తారు. దీనినే సమ్మక్క గద్దెకు వచ్చుటగా భావించి భక్తులు మొక్కులు అప్పజెప్తారు. మేడారం-జాతరపై మరింత చారిత్రక పరిశోధన జరగాల్సిన అవసరం వుంది. వాస్తవ సంఘటనలు బయటపడాలంటే ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో ఈ ప్రాంతంలో త్రవ్వకాలు జరిపితే ద్వారకలో శ్రీకృష్ణ సామ్రాజ్యం బయటపడినట్లు మేడారంలో కోయ సామ్రాజ్యం ఆనవాళ్లు బయలుపడే అవకాశం వుంది.
కోయలతో ముడిపడిన జాతర:

జంపన్న వాగు |
శ్రీ సమ్మక్క- సారలమ్మ జాతరను నిర్వహించేది కోయతెగకు చెందిన గిరిజనులు.
ఈ తెగలో 12 రకాలవారున్నారు:
ఈ తెగలో 12 రకాలవారున్నారు:
- 1. రాచకోయ,
- 2. గంపకోయ,
- 3. గొత్తికోయ,
- 4. పూసకోయ,
- 5. గొట్టెకోయ,
- 6. చెంచుకోయ,
- 7. పారటాకులకోయ,
- 8. గీతకోయ,
- 9. భాషకోయ,
- 10. కొండ కోయ,
- 11. వెదురుకోయ,
- 12. అమ్ములకోయ అని వారినిఅంటారు.
ఈ కోయల్లోని రాచకోయలే మేడారం జాతరను నిర్వహిస్తుంటారు. వీరే దీనికి హక్కు దారులు. పూజారులు.
వీరిని వడ్డెలు అని కూడా అంటారు. కాగా, కోయ తెగలో గోత్రాలుంటాయి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క దేవత ఇలవేల్పుగా ఉంటుంది.
ఆ గోత్రాలు ఇవి:
3వ గోత్రం,
4వ గోత్రం,
6వ గోత్రం,
7వ గోత్రం,
సమ్మక్క 3వ గోత్రం,
5వ గోత్రం వారికి ఇలవేల్పు.
సమ్మక్కకు పూజారులు (వడ్డెలు) సిద్దబోయిన, కక్కెర అనే ఇంటి పేరు గలవాళ్లు. సారలమ్మ 4వ గోత్రం వారికి ఇలవేల్పు, "కాక” అనే ఇంటిపేరు గలవారు సారలమ్మకు పూజారులు (వడ్డెలు). 'పెనక' ఇంటిపేరు గలవాళ్లు పగిడిద్ద రాజుకు, 'దబ్బగట్ల' ఇంటి పేరుగల వారు గోవిందరాజుకు పూజారులు (వడ్డెలుగా) వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా ఈ జాతరతో వనవాసులకు, గిరివానులకు విడదీయరాని సంబంధం వుంది.
ఇంతటి ప్రాశస్త్యం కల్గిన ఈ జాతర పూర్వం నుండి మేడారం గ్రామ కోయ కులపెద్దల ఆధ్వర్యంలోనే నడుస్తున్నది. ఇది మొదట గ్రామ (కోయగూడెం) సామూహిక పండుగ. ఆ తర్వాత దూరప్రాంత ప్రజలు రాకతో పండుగ జాతరగా సంతరించుకున్నది. దీంతో 1947లో ఈ జాతరను రెవెన్యూ విభాగం స్వాధీనంలోకి తీసుకుంది. ఆ తర్వాత 1962లో దేవాదాయ శాఖ స్వాధీనంలోకి జాతర వెళ్లడంతో ఈ ప్రాంత కోయ (వడ్డెలు) పూజారులు జాతరపై తమకు హక్కులు కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. 1968లో కోయ వడ్డెలకు (పూజారులకు) 1/3వ వంతు జాతర ఆదాయం ఇవ్వాలని తీర్పు వచ్చింది. అప్పటి నుండి జాతర దినదిన ప్రవర్ధనామవుతూ “స్టేట్ ఫెస్టివల్'గా మారింది.
అన్యమతస్తులను తరిమిన కోయలు:
'కుంభమేళా'కు హాజరయ్యే విధంగా ప్రజలు ఈ జాతరకు పోటెత్తుతుండటంతో విధర్మీయుల కండ్లు ఈ జాతరపై పడ్డాయి. జాతర ప్రాశస్త్యాన్ని తగ్గించడానికి మేడారంలో నాలుగేళ్ల క్రితం చర్చి నిర్మించారు. అమాయక కోయలను మాయమాటలతో మతమార్పిడి చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన స్థానిక కోయ, గిరిజన సంఘాలపెద్దలు, యువకులు ఏకత్రిత మై ఆ చర్చిని వారితోటే మూయించివేసారు.
తమ ప్రయత్నాలను మానకుండా క్రైస్తవులు ప్రతీసారి. జాతరలో యేసు ప్రభువు చిత్రపటాలు, శిలువ బొమ్మలు ఉచితంగా పంపిణీ చేస్తూ ఉద్రిక్తతలను సృష్టిస్తుంటారు. వీరి ఆగడాలకు 'వనవాసీ కళ్యాణ పరిషత్', విశ్వహిందూపరిషత్ గత కొంతకాలంగా అడ్డుకట్ట వేస్తున్నవి. వనవాసీ కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో మూడుచోట్ల.. ఉచిత ఆరోగ్య శిబిరాలు మూడు మొబైల్ వ్యాన్లు, ఐదుగురు డాక్టర్ల బృందం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వనవాసీ గిరివాసీ, నగరవాసీలకు సహకారాన్ని అందజేస్తున్నది.

సమ్మక్క-సారలమ్మ పాట:
వచనం
అది గద నయనా, సాంబశివ మహరాజు తండ్రి తూర్పు దేశాన వాయుబండ పట్నంలో పుట్టిండు గదనయనా, రాయ బండరాజు గదనయనా, ఆ రాయబండ రాజు సంతానం ఎంతమందో, కొడుకులు బిడ్డలు ఎంతమందో ఈ లోకానికి తెల్సదు గద నయనా..
బృందం: ఓ రేల రేరేలా రేరేలయ్యో రేరేలా రేరేల రేరేలా •
- పారెడు గట్టు రాజులే - అమ్మాలే
- అది పడమటి దేశం నున్నారో - యమ్మాలే
- శివమందాలి తల్లిలే
- వాళ్ళ కడుపున కలిగిరి
- వాళ్ళ సంతానం సూడులే - అయ్యాలే
- తొలుసతూరు కొడుకు గడి కామయ్య
- రెండవ వాడు కొడుకూలే
- అది గోవింద రాజులే - అయ్యాలే
- అది మూడవవాడు
- కొండాయీ
- మూడోవవాడు కొందాయో - అమ్మాలే
- నాలుగోవాడు పగిడిద్ద రాజులే - అయ్యాలే
- సిన్న కొడుకు ఉండేను ఓ - అయ్యాలే
- అది సిన్న కొడుకును సూడూలే
- సిన్న కొడుకును సూడులే - అమ్మాలే
- అది వివాహం కావాలే - అయ్యాలే
- తూర్పు, పడమర చూసేనా
- ఉత్తర దక్షిణం చూసేనా - అమ్మాలే
- ఏ దేశం బోదమా
- అన్నారా - యమ్మాలే
- ఏ దేశం పోదామో
- ఏ రాజ్యం పోదామో - అయ్యాలే
- .ఏ దేశం పోదామో - అయ్యాలే
- తూర్పు కాండం సూడులే
- తూర్పు కాండం సూడులే - అయ్యాలే
- రాయబండాని రాజులే అమ్మాలే
- రాయబండాని రాజులే వియ్యామో
- రాయబండాని వియ్యామో - అయ్యాలే
- మనకు గాని కావాలే - యమ్మాలే
- వీరుల పోరు గద్దె 'మేడారం
(సమ్మక్క సారాలమ్మలపై కోయడోలీల కథ) నుంచి
సంపాదకుడు - జయధీర్ తిరుమలరావు
ఈ పాటలో సమ్మక్క-సారలమ్మ కుటుంబ సభ్యుల వివరాలు ఉన్నాయి
రచన: ప్రొఫెసర్ రామ చంద్రమౌళి
మూలము, వ్యాస హక్కుదారులు: జాగృతి వారపత్రిక "సౌజన్యంతో"
మూలము, వ్యాస హక్కుదారులు: జాగృతి వారపత్రిక "సౌజన్యంతో"