ఒక అంకం ముగిసింది మరో అంకానికి తెరలేచింది. ముగిసిన అంకం రామజన్మభూమి. మొదలైన అంకం కాశీ విశ్వనాధ ఆలయం.
తురకల పాలనలో దాదాపు "36 వేల హిందూ ఆలయాలు ధ్వంసం" చేయబడ్డాయి.
వాటిలో ప్రముఖమైనవి -
- 🖝 సోమనాధ దేవాలయం,
- 🖝 మధుర కృష్ణ మందిరం,
- 🖝 కాశీ విశ్వనాధ మందిరం,
- 🖝 అయోధ్య రామ మందిరం.
వీటిలో సోమనాధ ఆలయాన్ని, నాటి గృహమంత్రి సర్ధార్ వల్లభాయ్ పఠేల్ ఆధ్వర్యంలో పునర్నిర్మిచబడింది. నేడు మోడీ, అమిత్ షాల ఆధ్వర్యంలో అయోధ్య రామమందిర నిర్మాణానికి అడ్డంకులు తొలగి, కమిటీ ఏర్పడి, నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు కాశీ విశ్వనాధ ఆలయం మొదలైంది.
చరిత్రలోకి వెళితే ఔరంగజేబు కాలంలో ఈ మందిరాన్ని సగం కూల్చి ఆ మందిర అవశేషాలతోనే జామా మసీదు నిర్మించాడు. దానినే ఇప్పుడు జ్ఞానవాపి మసీదుగా పిలుస్తారు. ఈ నాటికీ ఆ మసీదులో లోపల మందిరం తాలూకు స్థంబాలు గోడలు అలానే ఉన్నాయి. స్వయంభూ గా పిలుచుకునే కాశీ విశ్వనాధ శివలింగాన్ని అక్కడి బావిలో పడవేశారు. ఆ భావిని జ్ఞానవాపీ కువా(కువా అంటే హిందీలో బావి అని) పిలుస్తారు. కొన్ని మందిరాలను అలానే ఉంచి చుట్టూ గోడలు కట్టి పైన మసీదు రూపాన్ని తీసుకువచ్చారు. ఇప్పటికీ మీరు కాశీ వెళితే ఈ దారుణాన్ని చూడవచ్చు.
ఆ తరువాతి కాలంలో "రాణీ అహల్యా బాయ్ హోల్కర్" దానికి ఆనుకొని కొన్ని నిర్మాణాలు చేసి అక్కడ ఆమెకు గంగలో దొరికిన శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు జరిపించారు. ఇప్పుడు మనం పూజలు నిర్వహిస్తున్నది ఆ తల్లి ఏర్పాటు చేసిన శివలింగానికే, ఆ తల్లి దయవల్లే.
సెక్యులర్ గాళ్ళ నోరు ఎందుకు మూసేస్తున్నారు?
హిందు ముస్లీ భాయ్ భాయ్, గంగా జమునీ తహజీబ్, సెక్యులర్, అంటూ పాటలు పాడే కూహనా వాదుల కళ్ళు ఇక్కడ మూసుకుపోతాయి. హిందువులకే సెక్యులరిజం కానీ ముస్లీములకు అక్కరలేదనేది వీరి విరి విశాల భావన.
కొన్ని హిందూ సంఘాలు జ్ఞానవాపీ మసీదులో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) సర్వే చేయించమని కాశీవిశ్వనాధుని తరఫున కోర్టులో కేసు దాఖలు చేశాయి. సున్నీ వక్ఫ్ బోర్డు ఈ సర్వే జరగకుండా కోర్టును స్టే కోరాయి. కోర్టు 6 నెలలు స్టే ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ కాశీ విశ్వనాధుడి తరఫున మళ్ళీ రివ్యూ కు అభ్యర్ధన దాఖలు చేశాయి.
కోర్టుకు సంబంధించినంత వరకు కోర్టు ఒక సారి స్టే యిస్తే అది ఆరునెలలు అమలులో ఉంటుంది. తరువాత ఆ స్టే ని పొడిగించకపోతే అది అటోమ్యాటిక్ గా వెకేట్ అవుతుంది. మొదటి సారి స్టే ని పొడిగించమని ఈ కేసులో ప్రతివాదులైన సెంట్రల్ సున్నీవక్ఫ్ బోర్డు కానీ అంజుమన్ ఇంతేజామియా కానీ కోరలేదు. ఇప్పుడు మరలా కాశీ విశ్వనాధుని తరఫు లాయర్లు విశ్వనాధ్ ప్రతాప్ పాండే మొదలైనవారు సర్వే జరిపించమని పునరభ్యర్ధన దాఖలు చేశారు. ఇప్పుడు మరలా ప్రతివాదులు ఈ సర్వేని అడ్డుకోవడానికి అభ్యర్థిస్తే హై కోర్టు తిరస్కరించింది. ఫిబ్రవరి 17 నుండి సర్వే మొదలు పెట్టమని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇది మరో అంకం మొదలైన కథాక్రమం. హిందువులకు మంచిరోజులు (అచ్చేదిన్) వచ్చాయనిపిస్తుంది.
రచన: చిత్తూర్ హిందూ టైగర్