చతుర్వేదములు
వేదములు నాలుగు. అవి ఋగ్వేదము, యజుర్వేదము సామవేదము, అధర్వణవేదము. పూర్వము ఋషులు యజ్ఞ యాగాదులు నిర్వహించినపుడు వేదములలోని మంత్రములను, వినియోగించారు. వేదములు దైవవాక్కులు, పరమేశ్వర విశ్వాసములు.
ఋగ్వేదం
పాదబద్దములగు మంత్రమును 'ఋక్కు' అని అందురు. ఈ వేదమునందు ఇటువంటి మంత్రములే ఉండుట వలన దీనికి 'ఋగ్వేదము' అని పేరు. ఈ వేదమునకు 21 శాఖలు కలవు. ఆ 21 శాఖలలో శాకలశాఖ, బాష్కలశాఖ అనే రెండు శాఖలు మాత్రం ప్రస్తుతం లభించుచున్నవి.ఇందున:
- 🖝 వ్యవసాయ విధానం,
- 🖝 వ్యాపార విధానం,
- 🖝 ఓడలు విమానం,
- 🖝 రైలు తయారుచేయు విధానం,
- 🖝 టెలిగ్రాం,
- 🖝 వైర్లెస్ వంటి అనేక ఆధునిక శాస్త్రములు ఈ ఋగ్వేదమునందు గలవు.
యజుర్వేదము
యజుర్వేదములో కృష్ణయజుర్వేదము, శుక్లయజుర్వేదము అను రెండు విధములు కలవు.1. కృష్ణ యజుర్వేదము :- 'శైత్తిరి' అనుపేరు గల ఆచార్యుడు శిష్యప్రశిష్యులకు బోధించెను. అందుచే 'తైత్తిరీయ' మని పేరు వచ్చింది. ఈ తైత్తిరీయవేదములో సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము అను మూడు భాగములు ఉన్నవి. ఈ సంహితయందు అష్టకములు (కాండములు), 44 ప్రశ్నలు (ప్రపాఠకములు) అనువాకములు 1, 2196 పంచాశత్తులు (పనసలు) ఉన్నవి
ఇందులో కర్మలను తెలియజేసే శాస్త్రము, బ్రహ్మవిద్య, సృష్టివిద్య గణితవిద్య, శారీరక శాస్త్ర విద్య, అంతరిక్ష విద్య మొదలగునవి గలవు.
పనస: ప్రతి పనసయందు ఏభయి పదములు ఉన్నవి అనువాకాంతమునందున్న పనసలకును పదములు కొంచెము హెచ్చుతగ్గులు ఉండును. సంస్కృత భాషలో దీనిని 'పంచాశత్తు' అని అందురు.
2. శుక్లయజుర్వేదము : వాజసనేయ సంహిత అని దీనికి మరొక పేరు. ప్రస్తుతం ఈ వేదమునందు మాధ్యందిన శాఖ, కాణ్వశాఖ అని రెండు శాఖలు కలవు. ఈ రెండు శాఖల వారిని తెలుగునాథ ప్రథమశాఖ' అంటారు. శుక్లయజుర్వేదములో 40 అధ్యాయములు కలవు. ఈ వేదమునకు 'శతపథ బ్రాహ్మణము' అని పేరు. ఈ వేదమంత్రములతో 'అధ్వర్యుడు' అను ఋత్విక్కు యజ్ఞమునందు హోమాది ప్రధాన కృత్యములను ఆచరించును. సకల కర్మలు ఆపస్తంబ మహర్షి చేసిన కల్ప సూత్రమును అనుసరించి దీనిని నిర్వహిస్తారు
అధర్వణవేదము
భౌతిక విజ్ఞానము తెలుపు శాస్త్రం ఇది. ఇందులో కూ బ్రహ్మవిద్య, సృష్టి విద్య ఉపాసనాది విధి, భగవత్ర్రార బ్రహ్మచర్యవిధి, పంచయజ్ఞవిధి వంటి విషయములు గలవు. ఈ వేదమును 20 కాండములుగా విభజించిరి ఒకప్పుడు ఈ వేదమునకు తొమ్మిది శాఖలు ఉండేవి.ఇప్పుడు ఒక శాఖ మాత్రమే లభించుచున్నది. బత్విక్కు బ్అశ్యము తెలుసుకొనవలసిన విధి ఈ వేదము నందు కలదు. అందుచేత దీనిని బ్రహ్మవేదము అని కూడా అందురు. ఇతర వేదములకంటే శాంతికి, పౌష్టిక కర్మలు ఈ వేదమునందు అధికముగా ఉన్నవి. దీనికి 'గోపథ బ్రాహ్మణము' అని మరొక పేరు గూడ కలదు.
వేదమునందు సంహిత అనియు, బ్రాహ్మణము అనియు ప్రధాన భాగములు కలవు. సంహిత అనగా మంత్రములు మాత్రము గల భాగము. అనగా అర్థగాంభీర్యం గల మంత్రముల అర్థములను వివరించు నట్టి గాని మంత్రములను వల్లించుచూ చేయవలసిన పనిని గాని తెలియజేయునట్టి గ్రంథము.
ప్రస్తుతము వ్యవహారములో ఉన్న విశేషములు
- 1) ఋగ్వేదమునకు ఆశ్వలాయన సాంఖ్యాయన సూత్రములను;
- 2) కృష్ణ యజుర్వేదమునకు ఆపస్తంబ, బోధాయనన సత్యాషాఢ, హిరణ్య కేశీయ, మానవ, వైఖానస సూత్రములును; శుక్ల యజుర్వేదమునకు పారస్కర, కాత్యాయన సూత్రములు.
- 3) సామవేదమునకు గోబిల ద్రాహ్యాయణాది సూత్రములు;
- 4) అధర్వణ వేదమునకు కౌశిక సూత్రములును వ్యవహారమున కలవు. ఆది నుండియు ఏదో ఒక వేదమునకు చేరియుందురు. ఆ విధంగానే ఉండవలెను గాని మన ఇష్టానుసారము వేదమును సూత్రమును మార్చుకొన వీలులేదు. ఇది సంప్రదాయం దీనిని మరువకూడదు.
ఉప వేదములు
- 1. ఆయుర్వేదము (వైద్యశాస్త్రము).
- 2. ధనుర్వేదము (శప్తాస్రవిద్య మరియు రాజ ధర్మతాస్త్రం).
- 3. గాంధర్వేదము (గానశాస్త్రము),
- 4. అర్థవేదము (కళలు, రాజకీయ, ఆర్థిక, వ్యవసాయ, గోరక్ష, వ్యాపార విషయాల శాస్త్రము).
వేదాంగములు
వేదాంగములు ఆరు, ఇవి వేదమునకు అంగములు, వేదార్ధములు నేదారములు తెలుసుకొనుటకు ఇవి మిక్కిలి ఉపయోగపడును.- 1. శిక్షా శాస్త్రము: వేదములందలి అక్షరములను, స్వరములను ఉచ్చరించు రీతిని వివరించి చెప్పును. దీనిని పాణిని రచించెను.
- 2. వ్యాకరణ శాస్త్రము: సుశబ్ద, అపశబ్దములను బోధించును. దీనిని గూడ పాణినియే రచించెను. ఇది ఆధునిక భాషా శాస్త్రములకు మూలము. ఇందు 8 అధ్యాయములు కలవు.
- 3. ఛందస్సు : ఇది ఛందోవిచితి అనబడు 8 అధద్యాయముల గల ఛందోశాస్త్రము. దీనిని పింగళుడు రచించెను. మంత్రము లందుగల వృత్తివిశేషములు బోధించును.
- 4. నిరుక్త శాస్త్రము : వేదమంత్రాలలోగల కఠినపదముల భావమును బోధించును. దీనిని యాస్కుడు రచించెను.
- 5. జ్యోతిష్య శాస్త్రము : ఇది కాలనియమమును బోధించు శాస్త్రము. ఇది ఆయా కాలములందు చేయవలసిన యజ్ఞ యాగాది విధులకు సంబంధించిన కాలవిశేషములను కూడా బోధించును. లగధుడు, గర్జుడు మొదలగువారు రచించిరి.
- 6. కల్ప శాస్త్రము : ఇది ఆయా మంత్రములు పఠించుచూ చేయవలసిన కార్యములను బోధించును. అశ్వలా యనుడు సాంభ్యాయనుడు మున్నగువారీ శాస్త్రమును రచించిరి.
ఉపాంగములు
భగవంతునికి సంబంధించిన ధర్మములను తెల్పు శాస్త్రములు 6. వీటినే షద్దర్మములందురు.సాంఖ్యశాస్త్రము : ప్రకృతియే విశ్వసృష్టికి మూలము. ప్రకృతిలో చేయుపనులన్ని సత్వరజతమోగుణముల గూడిన పని, ఆ చేష్టలతో సంసారమున జీవుడు బంధింపబడుచున్నా డని ఈ ప్రకృతి, పురుషుల భేదము గ్రహించి ప్రకృతిని విడచుటే మోక్షమని సాంఖ్యశాస్త్రము బోధించుచున్నది.
యోగశాస్త్రము : దీనిని పతంజలి మహర్షి రచించాడు మనోనిగ్రహమునకు విధానములు బోధింపబడినవి.
- 1. యమము,
- 2. నియమము,
- 3. ఆసనము,
- 4. ప్రాణాయామము
- 5. ప్రత్యాహారము,
- 6. ధ్యానము,
- 7. ధారణ,
- 8. సమాధి
న్యాయవైశేషిక శాస్త్రం: న్యాయ దర్శనము గౌతముడు వైశేషికమును కణాద మహర్షి ప్రవర్తింపజేసిరి. విశ్వమును సృష్టించువాడు ఈశ్వరుడు. జీవులు ఒగవంతుని కొరకు కర్మలు నిర్వహించి మోక్షమొందుదురనీ, వారికి సుఖదుఃఖ ములుండవని ఈ దర్శనములు బోధించుచున్నవి
పూర్వమీ మాంస శాస్త్రం : దీని దర్శనకర్త జైమిని. ఇది యజ్ఞయాగాది కర్మల ప్రాముఖ్యతను తెల్పుచున్నది.
ఉత్తర మీమాంస శాస్త్రం : ఉపనిషత్తుల నుండి ఉద్భవిందనది. ఇందులో జీవాత్మ పరమాత్మ సంబంధం వివరింపబడింది. వీనినే వేదాంత దర్శనమనియు బ్రహ్మ సూత్రము లనియు వ్యవహరింతురు. ఈ వేదాంతముపై భిన్నాభిప్రాయముల వలన అద్వైతము, విశిష్టాద్వైతము ద్వైతము మొదలగు శాఖా భేదము లేర్పడినవి.
స్పృతులు - మొత్తము సృతులు పదునెనిమిది - 18:
|
---|
1. మనుస్మృతి; 2. పరాశరస్మృతి; 3. వశిష్టస్మృతి; 4. శంఖస్మృతి; 5. లిఖితస్మృతి; 6. అత్రిస్మృతి: 7. విష్ణుస్మృతి: 8. హారీతస్మృతి; 9. యమస్మృతి: 10. అంగీరస స్మృతి; 11. ఉశనస్మృతి; 12. సంవర్తనస్మృతి; 13. బృహస్పతి స్మృతి: 14. కాత్యాయనస్మృతి; 15. దక్షస్మృతి; 16. వ్యాస స్మృతి; 17. యాజ్ఞవల్క్యస్మృతి; 18. శాతాతపస్కృతి వీటన్నిటిలో మనుస్మృతి ముఖ్యమైనది. |
వేదాంతములు - ఉపనిషత్తులు
ఉపనిషత్తులకు మరొక పేరు వేదాంతములు. ఒకప్పుడు మహాఋషులు, ఋషిపుత్రులును ఒక్కచోట చేరి:- ఆత్మ అంటే ఏమి? జీవుడంటె ఎవరు?
- జీవేశ్వరుల సంబంరం ఏమిటి మనము ఎచ్చటి నుండి వచ్చితిమి?
- ఎచ్చటకు పోయెదము? అను ప్రశ్నల గురించి చర్చలు జరపగా ఫలించిన జవాబులే ఉపనిషత్తులు.
తంత్రములు
విగ్రహములను యంత్రములను పూజించుట, ఉపాసనలు మంత్రజపము మొదలగు విషయములు బోధించు వానిని తంత్రములంటారు.
పురుషార్థము
1. ధర్మము, 2. అర్ధము,
3. కామము,
4. మోక్షము అను ఈ నాలుగు చతుర్విధ పురుషార్థములు.
ఆగమములు
శైవాగమములు 28; వైష్ణవాగములు 2. దేవాలయ నిర్మాణము విగ్రహముల తయారీ ఆలయ ప్రతిష్ట పూజా విధానం మొదలగునవి ఆగమములలో నిరూపింపబడినది.
వర్గాశ్రమములు
వర్ణములు 4 : బ్రాహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులుఆశ్రమములు 4: బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము వానప్రస్థము, సన్యాసాశ్రమము
ఋత్విక్కులు
అధ్వర్యుడు : యజుర్వేదమునందు వివరించిన మంత్రములను పఠించుచు యజ్ఞనునందు చేయవలసిన హోమాది ప్రధాన కృత్యములను ఆచరించునట్టి ఋత్విక్కు.హోత : ఋగ్వేదమునందు వివరించిన మంత్రములతో హోమకాలమున ఆయా దేవతలను పిలుచునట్టి ఋత్విక్కు.
ఉద్గాత : హోమాది సమయములందు ఆయా దేవతలను సంతుష్టి పరచుటకు సామవేద మంత్రములతో గానము చేయునట్టి ఋత్విక్కు.
బ్రహ్మ : ఈ ఋత్విక్కులు చేయునట్టియు, యజమాని చేయునట్టి యు సకల కృత్యములను పర్యవేక్షించుచు సాక్షీభూతుడై అనుజ్జనిచ్చు ఋత్విక్కు.
అగ్నీధ్రుడు : దేవతలకు ఇచ్చునట్టి చరుపురోడాశాది హవిస్సుల చేయుటకుగాను, ఇతర పనులు చేయుటకు సహాయము చేయునట్టి ఋత్విక్కు.
అగ్నిష్టోమము మొదలగు గొప్ప గొప్ప యజ్ఞములందు పైన వివరించిన నలుగురు ఋత్విక్కులకు ఒక్కొక్కరికి ముగ్గురు వంతున సహాయ ఋత్విక్కులు ఉందురు. ఈ కర్మములందు సామ్రాన్యముగా చరుపురోడాశములు అనునవి ఆజ్యముతోబాటు దేవతలకు ప్రత్యేకముగా సమర్పించెదరు. చరుపు అనగా బియ్యముతో వండిన హోమ ద్రవ్యము. పురోడాశము అనగా బియ్యపు పిండితో కపాలమునందు అనగా నిప్పుమీద కొచ్చిన పెంకులమీద చక్కగా కాచి పక్వముగా చేసిన పిండిముద్ద.
- ఇష్టి : అహితాగ్ని అయినవాడు ప్రతి పాడ్యమి యందును చేయవలసిన పని.
- స్రుక్కు : ముఖ్యమైన హోమాలలో ఉపయోగించు యజ్ఞపాత్ర. దీనిని కొయ్యతో చేయుదురు.
- స్రువము : సామాన్యముగా ఈ పాత్రముతో ప్రాయశ్చిత్త హోమమును చేయుదురు
- ప్రాయశ్చిత్తము : ఒక పనిని చేయవలసిన కాలమునందు చేయకపోయినను, చేయదగని పనిని చేసినను కలుగు చున్న దోషమును పోగొట్టుకొనుటకై చేయునట్టి పని.
- అహితాగ్ని : గార్హపత్యము,అహవనీయము, దక్షిణాగ్ని అను మూడు అగ్నులను ఆధానము చేయు వ్యక్తి.
- పాకయాజి : ఔపానవైశ్వదేవది సప్తపాక యజ్ఞములను ఆచరించిన వ్యక్తి.
- హవిర్యాజి : హవిర్యజ్ఞములగు సప్త విర్యజ్ఞములను ఆచరించిన వ్యక్తి.
- సోమయాజి : సప్తసోమ సంస్థలను ఆచరించిన వ్యక్తి
- సోమిదమ్మ : సోమయాజి ఖార్య
హోమద్రవ్యములు
చరుపు : బియ్యముతో వండిన హోమద్రవ్యము.పురోడాశ : బియ్యపు పిండిని పెంకు మీద పెట్టి కాచి పక్వము చేసిన పిండి ముద్ద.
అద్వైతము
దీనిని ప్రవర్తింపజేసినది శ్రీ ఆదిశంకరాచార్యులు. జీవునకు బ్రహ్మమునకు భేదము లేదు. బ్రహ్మ మొక్కటే సత్యము తక్కిన దంతా మిథ్య. జీవుడు ఆత్మ జ్ఞానము పొందినపుడు బ్రహ్మమును పొందును అదియే మోక్షము.
విశిష్టాద్వైతము
దీని ప్రవక్త శ్రీరామానుజాచార్యులు. దీనిలో జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు ఈ, మూడు సత్య ములే అని ఈశ్వరుడు కానిదే జీవుడు, ప్రకృతి ఉండజాలవు. శరీరములో జీవుడు వున్నట్లే ఈశ్వరుడున్నాడని అతనిని భక్తిప్రత్తులతో అనుష్ఠించిన మోక్షము పొందుదుమని ఈ సిద్ధాంతము బోధించుచున్నది.
ద్వైతము
దీనిని శ్రీమధ్వాచార్యులు ప్రవర్తింపజేసెను. దేవునకు, జీవునకు గల సంబంధము యజమానునకు, దాసునకు గల సంబంధమువంటి దని, భగవత్సేవ చేయుటే జీవిత పరి మార్ధమని ఈ మతము బోధించుచున్నది.
ఇతిహాసిములు
వేదవిహిత ధర్మములు ప్రబోధించుటకు కథల రూపములోనున్నవి. రామాయణము, మహాభారతము మొదలగునవి.- రామాయణం : ఇది సంస్కృతభాషలో 24000 శ్లోకములతో) సీతారాముల చరిత్ర చెప్పిన మహాకావ్యం. తండ్రీ కొడుకులు భార్యాభర్తలు, సోదరులు, యజమాని సేవకుడు, రాజు ప్రజలు అనుసరించవలసిన తీరు తెన్నులకు ఇది ప్రమాణం. దీనిని వాల్మీకి రచించాడు.
- మహాభారతం : శ్రీవేదవ్యాస విరచితం. 18 పర్వములు లక్షశ్లోకములతో పంచమ వేదముగా భాసించినది. నీతి శాస్త్రము, భగవద్గీత విష్ణుసహస్రనామము లౌకిక, అలౌకిక విషయములు యిందలి ముఖ్యాంశములు.
కర్మలు
వైదిక సంప్రదాయ ప్రకారం చేయవలసిన కర్మలు రెండు విధాలు 1) గృహ్యకర్మము 2) శ్రౌతకర్మము.- గృహ్యకర్మములు: గృహ్యసూత్రము నందు వివరించిన విధముగా చేయవలెను.
- సాధారణంగా ఇవి గర్భాదానాది షోడశకర్మలు. ఇక నితృయకర్మల అనగా స్నానము, సంధ్యా వందనము, ఔపాసనము, బ్రహ్మ యజ్ఞము, వైశ్వదేవము, దేవతార్చనము, అతిధిపూజ
- శ్రౌతకర్మలు: అనగా దర్శపూర్ణమాసలు, ఆధానము, అగ్నిష్టోమిలు పశుయాగము, అగ్నిష్టోమము మొదలగు వేద విహితములగు కర్మలు. అయితే ఈ శ్రాత కర్మములు చేయునప్పుడు మానునకు ప్రధానముగా అధ్వర్యుడు, హోత, ఉద్గాత, బ్రహ్మ అను నలుగురు ఋత్విక్కులు సహాయులుగా ఉండవలెను.
మహా పురాణములు
మానవులు పాటించవలసిన ధర్మములు, చేయవలసిన కృత్యములు , దర్శించవలసిన క్షేత్రములు గురించి తెలుపునవి పురాణములు. ఇవి కథల రూపంలో వుండును. ముఖ్యమైన పురాణములు - 18రచన: గాజుల సత్యనారాయణ గారు