CAA పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బెంగళూరులో జరిగిన సభలో 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాల విషయంలో దేశ ప్రజలంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది..
CAA-NRC-NPRలను వ్యతిరేకించేవారిలో అన్ని రకాల వారూ ఉన్నారు.. కాంగ్రెస్, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు.. ముస్లిం పార్టీలు, సంస్థలు.. వేర్పాటువాదులు.. వీరంతా భిన్న భావజాలం ఉన్నవారైనా బీజేపీని వ్యతిరేకించే విషయంలో ఒకటిగా నిలుస్తారు..
రాజకీయంగా బీజేపీని వ్యతిరేకించడంలో ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు.. కానీ దేశానికి మేలు చేసే నిర్ణయాల్లో ఒకటిగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇక్కడే వీరంతా లక్ష్మణ రేఖ తప్పుతున్నారు..
బెంగళూరు సభలో ఆ యువతి పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేయగానే ఎంపీ ఓవైసీతో పాటు మిగతావారంతా వారించి అడ్డుకోవడం అభినందనీయం.. కానీ రాజ్యాంగ పరిరక్షణ సభ పేరుతో తాము చేస్తున్న పని ఏమిటి? అనే విషయంలో వారికి విచక్షణ కూడా అవసరం.. గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఉన్నాయనే సాకు ఎందుకు?
అమూల్య లియోనా (క్రిస్టియన్ మహిళ) అనే ఈ 19 ఏళ్ల యువతితో తమకు ఎలాంటి సంబంధం లేదని సభ నిర్వాహకులు భుకాయిస్తున్నారు. మరి సంబంధం లేని వ్యక్తిని వేదికపైకి ఎలా రానిచ్చారు?.. తెలియకుండా పైకి వచ్చినా మైక్ ఎందుకు ఇచ్చారు? ఆమె ధరించిన గ్రీన్ బ్యాడ్జి ఎక్కడిది?.. ఎవరు పడితే వారు వేదిక ఎక్కి ఏది పడితే అది మాట్లాడితే, అనుకోని ఘటనలు జరిగితే ఎవరు బాధ్యత వహించాలి?
CAA-NRC-NPR వ్యతిరేక సభలు, ప్రదర్శనల ముసుగులో దేశ ద్రోహ శక్తులు చాప కింద నీరులా పని చేస్తున్నాయని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఏముంటుంది? ఈ టుకుడే టుకుడే గ్యాంగులను పెంచి పోషిస్తున్నది ఎవరు?
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా మరో పార్టీ అధికారంలో ఉన్నా భారత దేశం మన మాతృభూమి, ఈ దేశం, సరిహద్దులు, సార్వభౌమాధికారం భద్రంగా ఉండాలి అనే ఉన్నవారెవరూ ఇలాంటి పనులు చేయరు..
రచన: తెలుగు భారత్ యువ సమూహం Nationalist