- అయన తొలి తెలుగు ప్రజాకవి
- అయన పద్యం ఒకటైనా రాని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు
- అయన ఒక యోగి
- అయన ఒక సంఘ సంస్కర్త
- తన పద్యాల ద్వారా సమాజంలో మార్పు తేవాలని చూశారు
- ఆయనే వేమన.
వేమన పద్యాలు తెలుగువారి ఆస్తి.
వేమన పుట్టిన సమయం, తేదీ ఖచితంగా తెలియడం లేదు. చాలా మంది చరిత్రకారుల అభిప్రాయం మేరకు వేమన కడప జిల్లా వాసి. వేమన పెరుతో కడప జిల్లలో ఒక విశ్వవిద్యాలయమే ఏర్పాటయ్యింది (యోగి వేమన విశ్వవిద్యాలయం). ట్యాంక్ బండ్ పై ఏర్పాటుచేసిన తెలుగు మహనీయుల విగ్రహాలలో యోగి వేమన విగ్రహం కూడా ఉంటుంది
యోగివేమన పద్యాలను సేకరించి, అనువదించి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ 'వేమన పద్యాలు' (The Verses of Vemana) పేరిట గ్రంథస్తం చేశారు. వేమన ప్రభావం తెలుగునేలపై ముఖ్యంగా రాయలసీమలో గణనీయంగా ఉంది. వారి శిష్యపరంపరలో గుర్రాలపై ఊరూరూ సంచరించే యామయ్యలను ఇప్పటికీ సీమలో చూడవచ్చు
యోగి వేమన తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు, పక్క రాష్ట్రం కర్ణాటకను చాలా ప్రభావితం చేసినవారు. 2017 నుండి కర్ణాటక రాష్ట్రం అధికారికంగా వేమన జయంత్యుత్సవాలు నిర్వహిస్తుండగా అయన పుట్టిన గడ్డ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఎటువంటి జయంతి ఉత్సవాలకు నోచుకోలేకపోయారు.
వేమన సమాధి అనంతపురం జిల్లా గండ్లపెంట మండలం కటారుపల్లిలో ఉన్నది.
ఇప్పటికైనా పాలకులు, అధికారులు వేమన జయంతి ఉత్సవాలను ఏటా అధికారికంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలి. వేమన సాహిత్యాన్ని విద్యార్థులలో మరింత ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
__రాయలసీమ