పాద నమస్కారము |
ఒకప్పుడు ఉదయం నిద్రలేచిన తర్వాత, అలాగే రాత్రి పడుకునే ముందు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించేవాళ్లు. అలాగే ఎక్కడికైనా వెళ్లే ముందు, దూరప్రాంతాలకు వెళ్లి వచ్చిన తర్వాత ఇంట్లో పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీగా ఉండేది. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని అరకొరగా పాటించేవాళ్లే కనిపిస్తున్నారు. ఏదైనా పుట్టినరోజునో.. పెళ్లిరోజునే పెద్దల కాళ్లకు దండం పెట్టుకుని వారి దీవెనలు తీసుకుంటున్నారు.
అసలు సనాతన వైదిక సంప్రదాయాన్ని ఎందుకు పాటిస్తారంటే?
పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించండం ముఖ్యమైన సంప్రదాయం అని.. మహాభారతం, అధర్వణ వేదంలో వివరించారు.మహాభారతంలో యుధిష్ఠిరుడు పాదాలకు నమస్కరించే సంప్రదాయాన్ని ప్రారంభించారట. పెద్దలకు నమస్కరించడం శక్తివంతమైన గొప్ప అనుభూతి కలుగుతుంది.
మానవ శరీరంలో అనుకూల, వ్యతిరేక శక్తి ఉంటుంది. ఎప్పుడైతే పెద్దవాళ్ల పాదాలు తాకుతారో ..అప్పుడు వారిలోని అనుకూల శక్తి వాళ్ల పాదాలు, చేతుల ద్వారా నమస్కరించే వాళ్లకు అందుతుంది. పెద్దవాళ్లు ఎవరైతే మన తలపై చేయి పెట్టి ఆశీర్వదించినప్పుడు వాళ్ల ద్వారా అనుకూల శక్తి మనలో ప్రవహిస్తుంది.
అనువాదము: కోటి మాధవ్ బాలు చౌదరి