ఈ విధంగా చూస్తే భారతదేశంలో పుట్టి పెరిగిన ధర్మాలన్నీ హిందూధర్మాలే అవుతాయి. జైన, బౌద్ధ, సిక్కు ధర్మాలు కూడా హిందూధర్మపు వివిధ శాఖలే అవుతాయి. కాని నిజంగా చూస్తే వేదాలను ఆలంబనగా చేసుకుని ఆర్యులు అనుష్ఠించిన హిందూధర్మమని పిల్లవటం సబబు.
హిందూమతం అసలు పేరు 'సనాతన ధర్మం', అంటే అతి ప్రాచీనమైన, శాశ్వత విలువలు కలిగిన ధర్మమని అర్థం.ధర్మం అంటే ఈ ప్రపంచాన్ని ధరించే శక్తి, నిలిపే శక్తి: దీనినే పరమాత్మ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరమాత్మను అనుభూతి చెందడం సాధ్యమే. అటువంటి పరమాత్మానుభవాన్ని లభింపజేసే సాధనామార్గాలను కూడ ధర్మమని పిలువవచ్చు. అత్యంత ప్రాచీనకాలం నుండీ, తరతరాలుగా, శ్రద్ధాభక్తులతో అనుష్ఠించిన వారందరికీ హిందూధర్మపు వివిధ ఉపాసనామార్గాలు భగవదనుభూతిని కలిగిస్తున్నాయి.
ధర్మం అంటే ఈ ప్రపంచాన్ని ధరించే శక్తి, నిలిపే శక్తి: దీనినే పరమాత్మ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరమాత్మను అనుభూతి చెందడం సాధ్యమే. అటువంటి పరమాత్మానుభవాన్ని లభింపజేసే సాధనామార్గాలను కూడ ధర్మమని పిలువవచ్చు. అత్యంత ప్రాచీనకాలం నుండీ, తరతరాలుగా, శ్రద్ధాభక్తులతో అనుష్ఠించిన వారందరికీ హిందూధర్మపు వివిధ ఉపాసనామార్గాలు భగవదనుభూతిని కలిగిస్తున్నాయి.
ఈ మార్గాలను అనుసరించి ఒకరిద్దరు కాక అసంఖ్యాకులైన సాధకులు భగవత్సాక్షాత్కారాన్న పొందారు. భగవంతుణ్ణి చేరుకోవటానికి విధివిధానాలను సూచించే ఈ ధర్మాలు అనాదికాలంగా వస్తున్నందుచేత, పైగా అవి శాశ్వతమైన ధర్మాలు కావటంచేత హిందూమతానికి మరొక పేరు "సనాతన ధర్మం".
రచన: స్వామీ హర్షానంద,
అనువాదము: శ్రీ దయాత్మానంద స్వామి
ప్రచురణ: రామకృష్ణ మఠం
ఈ మార్గాలను అనుసరించి ఒకరిద్దరు కాక అసంఖ్యాకులైన సాధకులు భగవత్సాక్షాత్కారాన్న పొందారు. భగవంతుణ్ణి చేరుకోవటానికి విధివిధానాలను సూచించే ఈ ధర్మాలు అనాదికాలంగా వస్తున్నందుచేత, పైగా అవి శాశ్వతమైన ధర్మాలు కావటంచేత హిందూమతానికి మరొక పేరు "సనాతన ధర్మం".
రచన: స్వామీ హర్షానంద,
అనువాదము: శ్రీ దయాత్మానంద స్వామి
ప్రచురణ: రామకృష్ణ మఠం