- 卍 అంబిక: విచిత్ర వీర్యుని భార్య. దృతరాష్ట్ర పాండు రాజులకు తల్లులు.
- 卍 అంబాలిక: విచిత్ర వీర్యుని ఇద్దరు భార్యలలో మరోకరు.
- 卍 అక్రూరుడు: శ్రీకౄష్ణుని మేనమామ.
- 卍 అకర్కారుడు: కద్రువ కొడుకు. ఒక సర్పం.
- 卍 అక్షసూత్ర ఆపస్తంభుడి భార్య. ఈమె కూమారుడు కర్కి.
- అగజాత: పార్వతి పరమేశ్వరుని భార్య.అగస్త్యకూటం: అగస్త్యుడ్ తపస్సు చేసిన ప్రదేశము.
- 卍 అగ్నిదేష్యుడు: ద్రోణాచార్యుడు ఇతని వల్లనే ధనుర్వీధ్యాపారంగతుడైనాడు.
- 卍 అగ్నిశౌచం: కర్కోటకుడు నలునికి ఇచ్చిన మాయా వస్త్రము.
- 卍 అఘుడు: రాక్షసులైన, పూతన, బకాసురుల సోదరుడు. కంసుడి అనుచరుడు.
- 卍 అగ్ని: వేదములలో పేర్కొన్న ఓక దేవత. అతని భార్య స్వాహాదేవి.
- 卍 అచల: కుమారస్వామి మాతౄగణములోని ఓక స్త్రీమూర్తి.
- 卍 అంజన: కుంజరుడి కుమార్తె వానర స్త్రీ. కేసరి భార్య. వాయుదేవునితో సంగమము వల్ల అంజనేయుని కన్నది.
- 卍 అనంత విజయం: ధర్మరాజు శంఖం.
- 卍 అనంత: స్వయంభువుని భార్య. ప్రియవత, ఉత్తానపాదుల తల్లి.
- 卍 అనసూయ: అత్రిమహాముని భార్య. దెవహూతి కర్దముల కుమారై. త్రిమూర్తులను శిశువులుగా మార్చిన ప్రతివ్రత.
- 卍 అనాదౄష్యుడు: గాంధారి దౄతరాష్టౄల కూమారుడు.
- 卍 అలకవంద: దేవలోకములోని గంగానది. పితౄలోకాలలో ప్రవహించేటప్పుడు దీనిని వైతరణి అంటారు.
- 卍 అతికాయుడు: రావణుని కుమారుడు. లక్ష్మణునిచే చంపబడతాడు.
- 卍 అత్రి: బ్రహ్మమానసపుత్రులో ఒకడు. అనసూయ ఈయన భార్య.
- 卍 అనిరుద్దుడు: శ్రీ కౄష్ణుని మనుమడు. ప్రద్యుమ్నుని కొడుకు. బాణాసురుని కుమార్తె ఉషకు భర్త.
- 卍 అభిమన్యుడు: అర్జునుడు – సుభద్రల కుమారుడు. కురుక్షేత్ర సంగ్రామంలో పద్మవ్యుహం లోపలకు వెళ్ళీ బయటకు రావడం తెలియక మరణించాడు.
- 卍 అర్జునుడు: పాండవ మధ్యముడు. పాండురాజు భార్య కుంతికి దేవేంద్ర ప్రసాదమున జన్మించిన కుమారుడు. ఫల్గునుడు, పార్ధుడు, కిరీటి, విజయుడు, సవ్యసాచి, ధనంజయుడు, శ్వేత వాహనుడు వంటి పేర్లు కలవాడు.
- 卍 అర్ధనారీశ్వరుడు: శివుని సగం శరీరం ఆక్రమించిన ఈశ్వరి. పార్వతీ పరమేశ్వరులు.
- 卍 అశ్వద్ధామ: ద్రోణుని కుమారుడు. కౄపి ఇతని తల్లి. ఇతడు చిరంజీవి. పాండవద్వేషి.
- 卍 అష్టావక్రుడు: ఏకపాదుడు – సుజాతల పుత్రుడ్.
- 卍 అహల్య: గౌతముని భార్య.
- 卍 అక్షయపాత్ర: అరణ్యవాసం చేస్తున్న ధర్మరాజు తన వెంట బ్రాహ్మణుల భోజనార్ధం సూర్యుణ్ణీ ప్రార్ధించి ఒక పాత్ర సంపాదిస్తాడు. దాంట్లో కొంచెం వండినా ఐ అక్షయమౌతుంది. దాంతో ధర్మరాజు నిరతాన్నదానం చెయ్యగల్గుతుంది.
- 卍 ఆంజనేయుడు: అంజనాదేవి కుమారుడు. హనుమంతుడు, పవనుడు, మారుతి ఇతర పేర్లు. రామాయణంలో శ్రీరామునికి నమ్మిన బంటు. వీరాధివీరుడు చిరంజీవి.
- 卍 ఆయతి: మేరువు కుమార్తె దాత భార్య. ఈమె కొడుకు ప్రాణుడు.
- 卍 ఇంద్రుడు: స్వర్గానికి అధిపతి. తూర్పు దిక్కుకు పాలకుడు.
- 卍 ఇంద్రజిత్తు: రావణుడి పెద్దకొడుకు. మరోపేరు మేగనాధుడు. ఇంద్రున్ని జయించాడు కాబట్టి ఇంద్రజిత్తు అనే పేరు వచ్చినది. ఇతని భార్య సులోచన.
- 卍 అగజాత: పార్వతి పరమేశ్వరుని భార్య.
- 卍 అగస్త్యకూటం: అగస్త్యుడ్ తపస్సు చేసిన ప్రదేశము.
- 卍 అగ్నిదేష్యుడు: ద్రోణాచార్యుడు ఇతని వల్లనే ధనుర్వీధ్యాపారంగతుడైనాడు.
- 卍 అగ్నిశౌచం: కర్కోటకుడు నలునికి ఇచ్చిన మాయా వస్త్రము.
- 卍 అఘుడు: రాక్షసులైన, పూతన, బకాసురుల సోదరుడు. కంసుడి అనుచరుడు.
- 卍 అగ్ని: వేదములలో పేర్కొన్న ఓక దేవత. అతని భార్య స్వాహాదేవి.
- 卍 అచల: కుమారస్వామి మాతౄగణములోని ఓక స్త్రీమూర్తి.
- 卍 అంజన: కుంజరుడి కుమార్తె వానర స్త్రీ. కేసరి భార్య. వాయుదేవునితో సంగమము వల్ల అంజనేయుని కన్నది.
- 卍 అనంత విజయం: ధర్మరాజు శంఖం.
- 卍 అనంత: స్వయంభువుని భార్య. ప్రియవత, ఉత్తానపాదుల తల్లి.
- 卍 అనసూయ: అత్రిమహాముని భార్య. దెవహూతి కర్దముల కుమారై. త్రిమూర్తులను శిశువులుగా మార్చిన ప్రతివ్రత.
- 卍 అనాదౄష్యుడు: గాంధారి దౄతరాష్టౄల కూమారుడు.
- 卍 అలకవంద: దేవలోకములోని గంగానది. పితౄలోకాలలో ప్రవహించేటప్పుడు దీనిని వైతరణి అంటారు.
- 卍 అతికాయుడు: రావణుని కుమారుడు. లక్ష్మణునిచే చంపబడతాడు.
- 卍 అత్రి: బ్రహ్మమానసపుత్రులో ఒకడు. అనసూయ ఈయన భార్య.
- 卍 అనిరుద్దుడు: శ్రీ కౄష్ణుని మనుమడు. ప్రద్యుమ్నుని కొడుకు. బాణాసురుని కుమార్తె ఉషకు భర్త.
- 卍 అభిమన్యుడు: అర్జునుడు – సుభద్రల కుమారుడు. కురుక్షేత్ర సంగ్రామంలో పద్మవ్యుహం లోపలకు వెళ్ళీ బయటకు రావడం తెలియక మరణించాడు.
- 卍 అర్జునుడు: పాండవ మధ్యముడు. పాండురాజు భార్య కుంతికి దేవేంద్ర ప్రసాదమున జన్మించిన కుమారుడు. ఫల్గునుడు, పార్ధుడు, కిరీటి, విజయుడు, సవ్యసాచి, ధనంజయుడు, శ్వేత వాహనుడు వంటి పేర్లు కలవాడు.
- 卍 అర్ధనారీశ్వరుడు: శివుని సగం శరీరం ఆక్రమించిన ఈశ్వరి. పార్వతీ పరమేశ్వరులు.
- 卍 అశ్వద్ధామ: ద్రోణుని కుమారుడు. కౄపి ఇతని తల్లి. ఇతడు చిరంజీవి. పాండవద్వేషి.
- 卍 అష్టావక్రుడు: ఏకపాదుడు – సుజాతల పుత్రుడ్.
- 卍 అహల్య: గౌతముని భార్య.
- 卍 అక్షయపాత్ర: అరణ్యవాసం చేస్తున్న ధర్మరాజు తన వెంట బ్రాహ్మణుల భోజనార్ధం సూర్యుణ్ణీ ప్రార్ధించి ఒక పాత్ర సంపాదిస్తాడు. దాంట్లో కొంచెం వండినా ఐ అక్షయమౌతుంది. దాంతో ధర్మరాజు నిరతాన్నదానం చెయ్యగల్గుతుంది.
- 卍 ఆంజనేయుడు: అంజనాదేవి కుమారుడు. హనుమంతుడు, పవనుడు, మారుతి ఇతర పేర్లు. రామాయణంలో శ్రీరామునికి నమ్మిన బంటు. వీరాధివీరుడు చిరంజీవి.
- 卍 ఆయతి: మేరువు కుమార్తె దాత భార్య. ఈమె కొడుకు ప్రాణుడు.
- 卍 ఇంద్రుడు: స్వర్గానికి అధిపతి. తూర్పు దిక్కుకు పాలకుడు.
- 卍 ఇంద్రజిత్తు: రావణుడి పెద్దకొడుకు. మరోపేరు మేగనాధుడు. ఇంద్రున్ని జయించాడు కాబట్టి ఇంద్రజిత్తు అనే పేరు వచ్చినది. ఇతని భార్య సులోచన.
- 卍 ఇంద్రమాల: ఒక కమలమాలిక ఎన్నడూ వాడనిది. మాల ధరించినవారిని ఏ అస్త్రమైన ఏమి చేయలేదు.
- 卍 ఉశన: భౄగువు భార్య. శుక్రుడి తల్లి.
- 卍 ఉచ్చైశ్రవము: ఇంద్రుని గుర్రము.
- 卍 ఉలూచి: నాగకన్య. వాసుకి కూతురు. అర్ణునుడు ఈమె యందు ఇలావంతుని కన్నాడు.
- 卍 ఉగ్రకుడు: ఒక సర్పం, కద్రువ కుమారుడు.
- 卍 ఉష: బాణాసురుని కూతురు. అనిరుద్ధుని మోహించి చిత్రలేఖ సహాయంతో పెళ్ళాడింది.
- 卍 ఉత్తరుడు: విరాటరాజు కొడుకు.
- 卍 ఊర్మిళ: లక్ష్మణుని భార్య. జనకమహారాజు జ్యేష్ట పుత్రిక. భర్త లక్ష్మణుడు అన్న రాముని వెంట అరణ్యాలకు పోయినప్పుడు ఈమె నిద్రించుచూనే ఉండెనట. (ఊర్మిళాదేవి నిద్ర)
- 卍 ఊర్వశి: ఒక అప్సరస, మోహగాంగి (ఇంద్రుని సభలోణి నర్తకి)
- 卍 ౠష్యశౄంగుడు: విభాండక ౠషి కుమారుడు.
- 卍 ఏతశం: సూర్యుని గుర్రాలలో ఒకదాని పేరు.
- 卍 ఏకలవ్యుడు: ద్రోణాచార్యుని గురువుగా భావించి అతని బొమ్మ పెట్టుకొని ధరుర్విద్య నేర్చుకున్న బోయవాడు.
- 卍 కంక: ఉగ్రసేనుడి కూతురు, వసుదేవుడి భార్య.
- 卍 కంసుడు: ఉగ్రసేనుని కూమారుడు. శ్రీకౄష్ణుని మేనమామ.
- 卍 కణ్వుడు: ఒక ౠషి, శకుంతలను పెంచిన తండ్రి.
- 卍 కబంధుడు: దండకారణ్యంలో నివసించే రాక్షసుడు. రామలక్ష్మణులు ఈతని చేతులు నరికివేశారు.
- 卍 కర్కోటకుడు: వాసుకి తమ్ముడు. అతిక్రూరుడు.
- 卍 కల్పవృక్షం: (కల్పవల్లి) కోరిన కోర్కెలు తీర్చే చెట్టు. క్షీరసాగర మథన సమయంలో హాలహలం తర్వాత వెలువడినది.
- 卍 కశ్యపుడు: ఒక ప్రజాపతి. కళ మరీచిలకు పుట్టినవాడు.
- 卍 కాళి: పార్వతి అవతారాలలో ఒకటి. ఉమ, కాత్యాయిని, గౌరి, ఈశ్వరి, భావాని దుర్గ, సర్వమంగళ, చాముండి – ఇతర పేర్లు.
- 卍 కామధేనుడు: కోరిన కోరికల్ని తీర్చేదివ్య శక్తులు గలగోవు. మరొక పేరు సురభి.
- 卍 కుంతి: మహాభారతంలోని ధర్మరాజు. భీముడు, అర్జునులకు తల్లి, కర్ణునికి కూడా తల్లి.
- 卍 కుమారస్వామి: శివుని కుమారుడు సుబ్రహ్మణ్యస్వామి. తారకజిత్తు. పార్వతీ నందనుడు ఇతర పేర్లు. దేవతలకు సేనానాయకుడు. వాహనం నెమలి. అయుధం శక్తి.
- 卍 కౄష్ణుడు: దేవకి వసుదేవుల పుత్రుడు. కౄష్ణుడు కారాగారంలో పుట్టాడు. కంసునికి మేనల్లుడు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు మొరాయించగా ‘గీతోపదేశం’ చేస్తాడు. శిశుపాలుణ్ణీ కంసుణ్ణీ వధిస్తాడు. ఈయనకు ఎనిమిదిమంది భార్యలు అందులో రుక్మిణి సత్యభామ ప్రముఖులు.
- 卍 కృష్ణద్వెపాయనుడు: వ్యాసునికి మరొక పేరు.
- 卍 కేదారేశ్వరుడు: శివునికి మరొక పేరు.
- 卍 కైకేయి: దశరథుని మూడవ భార్య. భరతుని తల్లి.
- 卍 కైలాస పర్వతం: శివుని నివాసము. హిమాలయాల వెనుకనున్న కొండ.
- 卍 కౌరవులు: కురువంశ రాజులు, మహాభారతంలో దుర్Yఓధనాదులు నూరు మంది.
- 卍 కౌశికుడు: ధర్మవ్యాధుని వల్ల ధర్మ విశేషాలను తెలుసు కున్నవాడు.
- 卍 ఖాండవం: ఇంద్రుని వనం. అగ్ని దేవుడు ప్రార్థింపగా కౄష్ణార్జునులు దానిని అతనికి అహారంగా సమర్పించారు.
- 卍 గాండీవం: అర్జునుని ధనస్సు. దీనిని అగ్నిదేవుడు ఖాండవ దహనమప్పుడు అర్జునునికి ఇచ్చాడు.
- 卍 గాంధారి: ధౄతరాష్ట్రుని భార్య. మహపతివ్రత. భర్త అంధుడు కనుక తానును పరుపురుష దర్శనం చేయకూడదను నియమముచే తాను ఎల్లప్పుడూ కళ్ళకు గంతలు కట్టుకొని ఉండును.
- 卍 గోదాదేవి: శ్రీ విల్లిపుత్తురులోని విష్ణుచిత్తుని తులసి వనంలో ఆమె లభించగా పెరియాళ్వార్ పెంపకంలో పెరిగి చూడికొడుత్తళ్ ఆళ్వారు అయింది.
- 卍 గోవింద భగవత్పాదులు: శంకరాచార్యులు వారి గురువు. గౌడపాదాచార్యుల శిష్యులు.
- 卍 గౌతమ సూత్రాలు: గౌతమ మహర్షి ప్రోక్తమైన ధర్మశాస్త్రం.
- 卍 ఘటోత్కచుడు: భీముడు – హిడింబల పుత్రుడు.
- 卍 ఘౄతాచి: ఒక అప్సరస. భరద్వాజ మహర్షి ఈమెను చూచినప్పుడు వీర్య స్ఖలనమైంది. ద్రోణుడు పుట్టాడు.
- 卍 జ్ణ్జాన ప్రసూనాంబ: పరాశక్తి అవతారం. కాళహస్తీశ్వరుని భార్య.
- 卍 చంద్రమతి: యమలోకంలో పాప పుణ్యాలను లెక్కకట్టే వాడు.
- 卍 చిత్రరేఖ: బాణాసురుని కూతురు ఉషకు చెలికత్తె.
- 卍 చిత్రాంగద: అర్జునుని భార్య. చిత్రవాహనుని కూమార్తె. ఈమె కుమారుడు బభ్రువాహనుడు.
- 卍 జంబుమాలి: ప్రహస్తుని కుమారుడు. రావణుని సేనాధిపతుల్లో ఒకడు అశోకవన భంగ సమయంలో హనుమంతుడు రావణుడు చంపాడు.
- 卍 జటాయువు: సంపాతి తమ్ముడు. సీతాపహరణ్ సమయాన రావణుడు చంపాడు.
- 卍 జనమేజయుడు: పరీక్షిత్తుని కుమారుడు.
- 卍 జమదగ్ని: పరశురాముని తండ్రి.
- 卍 జయవిజయులు: వైకుంఠంలో శ్రీ మహా విష్ణువు ద్వార పాలకులు. భాగవత పురాణంలోని పాత్రలు. హిరాణ్యాక్ష్య హిరణ్య కసిపులు. రావణ కుంభ కర్ణులు, శిశుపాలుడు దంతవ్రక్తులుగా అవతార మెత్తుతారు.
- 卍 జరాసంధుడు: బౄహద్రధుని పుత్రుడు జరాయువు రాక్షసిచే సంధింపబడినవాడు. భీముడు ఇతడి చంపాడు.
- 卍 జాంబవంతుడు: సుగ్రీవుని మంత్రి. రామ, రావణ యుద్ధంలో రామునికి సాయపడ్డాడు.
- 卍 జాంబవతి: జాంబవంతుని కూతురు. శ్రీకౄష్ణుని అష్ట భార్యలలో ఒకరు.
- 卍 ఢాకిని: మంత్రాల ద్వార లీలలు అద్భుతాలు చేసే ఒక స్త్రీ.
- 卍 తపతి: సూర్యుని కుమారై. ఈమె నర్మదా నదిగా మారినది.
- 卍 తాటక: మారీచ సుబాహుల తల్లి. అతి క్రూరురాలు రాక్షశి.
- 卍 తార: తారుని కుమార్తె వాలి భార్య. అంగదుని తల్లి. వాలి మరణానంతరం వాలి సోదరుడు సుగ్రీవుడు ఈమెను పెండ్లాడాడు.
- 卍 త్రిశుంకుస్వర్గం: సత్యవంతునికై విశ్వామిత్రుడు సౄష్టించినది.
- 卍 దత్తాత్రేయుడు: అత్రిమహర్షి, అనసూయ దంపతుల కుమారుడు.
- 卍 దమయంతి: నలమహారాజు భార్య. పతి యందు అత్యంత అనురాగం గలది.
- 卍 దశరథుడు: అయోధ్య మహారజు. శ్రీరాముని తండ్రి. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఈయన భార్యలు.
- 卍 దామోదరుడు: కౄష్ణుడు. బాల్యమున తల్లి యశోద ఇతని నడుమున తాడువేసి రోటికి కట్టుటచే ఈ పేరు వచ్చినది.
- 卍 ధుర్యొధనుడు: ధౄతరాష్ట్రునకు గాంధారికి కలిగిన నూరుగురు కుమారులలో (కౌరవ) జ్యేష్టుడు.
- 卍 దుర్వాసుడు: అత్రి మహర్షి అనసూయలకు పుట్టినవాడు. మహాకోపిష్టి. ఇతడు శపించి నట్టు ఇతివౄత్తం గల కథలు అనేకం ఉన్నాయి.
- 卍 దుష్యంతుడు: శకుంతల భర్త. భరతుని తండ్రి.
- 卍 దుస్సల: దౄతరాష్ట్రునకు గాంధారికి పుట్టిన ఏకైక కుమార్తె. ధుర్యొధునాదుల సోదరి.
- 卍 దేవకి: కౄష్ణుని కన్నతల్లి. వసుదేవుని భార్య.
- 卍 దేవదత్తం: అర్జునుడికి దేవేంద్రుడు ఇచ్చిన శంఖం.
- 卍 దేవాంతకుడు: రావణుని కూమారుడు. హనుమంతుడు ఇతనిని చంపాడు.
- 卍 ద్రుపదుడు: పాంచాలరాజు. ద్రౌపది తండ్రి. ఈయన కుమారులు ద్రుష్టద్యుమ్నుడు. శిఖండి.
- 卍 ద్రోణుడు: మహాభారతంలో కురువౄద్ధుడు. భరద్వాజ మహర్షి ఘౄతాచి అనే అప్సరసను చేస్తే వీర్యస్ఖలైంది. ఆ వీర్యాన్ని ఒక ద్రోణ (కుండ) లో ఉంచగా ద్రోణుడు పుట్టాడు. ధనుర్వద్యలో దిట్ట. కౄపాచార్యుని బావమరిది. అశ్వత్థామ పుత్రుడు. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ పక్షంలో పోరాడాడు.
- 卍 ద్రౌపతి: పాంచాల రాజైన ద్రుపదుని కూతురు. మహాభారతంలో ప్రముఖపాత్ర. అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టగా ఆమె పాండవులకు భార్య అయింది. ద్రౌపది మాహా పతివ్రత.
- 卍 ధన్వంతరి: క్షీరసాగర మథన సమయంలో పుట్తిన అనేకములలో ఒకటి. ఆయుర్వేదానికి అధిష్టాన దేవత.
- 卍 ధర్మరాజు: మహాభారతంలోని పంచపాండవులలో ప్రథముడు. యుధిష్ఠిరుడు మరోకపేరు. సద్గుణాలకు పేరొందినవాడు. జూదంలో ఓడిపోయి విరాట కొలువులో కంకుభట్టుగా ఉంటాడు.
- 卍 ధర్మవ్యాధుడు: మిథిలా నగరంలో ఉండే ఎరుకలవాడు. సమస్త ధర్మాల్ని చక్కగ తెలిసినవాడు.
- 卍 ధౄతరాష్ట్రుడు: కురువంశరాజు అయిన విచిత్రవీర్యుని కుమారుడు.పుత్తు గుడ్ది.గాందారి ఈయన భార్య. దుర్యోధనాది నలుగురు ఈయన పుత్రులు.వీరినే కౌరవులు అంటారు.
- 卍 నకులుడు: పంచపాండవులలో నాల్గవ వాడు.
- 卍 నటరాజు: తాందవ భంగిమలో ఉన్న శివుడు.సౄష్తి,స్థితి,లయ,త్రయూభవ(ఖ్యాతి) అనుగ్రహ (మోక్షతి) అను పంచ మహాకార్యాల్ని తందవం ద్వార పరమశివుదు ప్రదర్శిస్తాడు.
- 卍 నరలోకం : యముని కొలువు.పురానలను బట్టి 22 నరక లొకములు ఉన్నయి.
- 卍 నారదుడు: బ్రహ్మ కుమారుడు.హరి నారాయణ గాథలు గానం చేయువాడు.త్రిలోక సంచారి.కలహప్రియుడీగా ప్రతీతి.
- 卍 పంచవటి: రముడూ వనవాస సమయాన దండకారన్యం లోని ఆశ్రమం పేరు.
- 卍 పరశురాముడు:జమదగ్ని కుమారుడు.తల్లి రేణుక.అస్త్ర విద్య యందు ఆరి తేరిన వాడు.
- 卍 పరాశరుడు: శక్తి మహర్షి పుత్రుడు,వశిష్ట మహర్షి పౌత్రుడు.ఈయన సంపర్కం వల్లే మత్స్యగంధికి వ్యాసమహర్షి పుడతాడు.
- 卍 పరీక్షిత్తు: అభిమన్యు-ఉత్తర లకు పుట్టిన వాడు.అర్జునునికి మనుమడు.జనమేజయుడు ఈయన పుత్రుడు.పరీక్షిత్తు అంటే అంతటా దర్శించగల వాడని అర్ధం.
- 卍 పాంచజన్యం: శ్రీ మహాష్ణువు శంఖం.
- 卍 పాసుపతాస్త్రము: శివుని గురించి తపస్సు చేసి అర్జునుడు పొందిన అస్ర్తం.
- 卍 పుష్పకము: కుబేరుని విమానము. పిదప రావణుడు, శ్రీరాముడు పొందారు. దీనిలో ఎంత మంది అయినా కూర్చోవచ్చును.
- 卍 పూతన: ఒక రాక్షసి. బాలకౄష్ణునిచే చంపబడినది.
- 卍 ప్రవరాఖ్యుడు: ‘మనుచరిత్రా లో పాత్ర బ్రహ్మచారి.
- 卍 బలరాముడు: శ్రీ కౄష్ణునికి అన్న.
- 卍 బాణుడు: బలిచక్రవర్తి కూమారుడు. ఉషకు తండ్రి.
- 卍 బుద్ధుడు: బౌధ్ధమత స్థాపకుడు. లుంబిని అతని జన్మస్థలి. ‘షగభిజ్ణ్జుడూ అని ప్రసిద్ధి. అనగా దివ్యదౄష్టి, దివ్యశ్రోత్రము, పూర్వనివాసానుస్మౄతి, పరచిత్త జ్ణ్జానం, అప్రత్యక్షవిషయజ్ణ్జానము, వియద్గమనాగమన వ్యూహాదిలక్షణ బుద్ధి అను ఆరింటిని ఎరిగినవాడు.
- 卍 బౄందావనం: యమునానదీ తీరాన మథురలో ఉన్నవనం. ఇచ్చటీ గోకులంలో శ్రీకౄష్ణుడు గోపికలతో అనేక లీలలు సల్పాడు.
- 卍 భద్రకాళి: పార్వతీ దేవి మరొక నామం.
- భరతుడు: భరతుడు పేరు గలవారు ముగ్గురు కలరు. 1. దశరథ -కైకేయి కుమారుడ్. శ్రీరాముని సోదరుడు. 2. ౠషభుని జ్యేష్ఠ పుత్రుడు. ఇతని పేరు మీదనే ‘భారతదేశా మని పేరు వచ్చింది. 3. శకుంతల దుష్యంతులకు పుట్టినవాడు.
- 卍 మత్యయంత్రం: ద్రౌపదీ స్వయంవరంలొ పైన ఒక మత్స్య యంత్రాన్ని నిర్మించి దాని కింద ఉన్న నీటిళో ఆ యంత్ర ప్రతిబింబాన్ని చూస్తూ ఆ యంత్రాన్ని చేదించగలిగినవాడే తన కుమార్తెకు తగిన వరుడని ద్రుపద మహారాజు ప్రకటిస్తాడు. దానిని అర్జునుడు చేదించి ద్రౌపదిని పరిణయమాడుతాడు.
- 卍 మన్మధుడు: విష్ణువు కు మానస పుత్రుడు.రతీదేవి ఈయన భార్య.పుష్పధన్యుడు.మంచి రూపం కలిగిన వాడు.
- 卍 మహిషాసుర మర్దిని: మహిషాసురుడు అనే రక్షస్శుణ్ణి చంపడం వల్ల పార్వతికి ఈ పేరు వచ్చింది.
- 卍 మానస సరోవరం : పవిత్ర తటాకం.ఇది హిమాలయ పర్వతసిఖరాల.మధ్య టిబెట్టులో ఉన్నది. హిందువులకు పవిత్ర తిర్థస్థలి.
- 卍 మారీచుడు: రక్షసి తాటక కుమారుడు.రావనునిచే సితపహరన సమయం లో ఎతడు బంగారు జింకగా మాయరూపం దాల్చాడు.
- 卍 మేనక: విస్వామిత్రుని తపోభంగానికి ఇంద్రుదు నియమించిన అప్సరస.వీరెకలయిక వల్ల శకుంతల జన్మించింది.
- 卍 మేరుపర్వతం : గొప్ప పర్వతం. ధైర్యసహసాల్ని సాదరనంగా దీనితో పోలుస్తారు.
- 卍 మోహిని: క్షీరసాగర మధనమప్పుడు ఫలించిన అమౄతం అసురులకు దక్కకుండా మోసం చేయడానికి విష్ణువు ధరించిన స్త్రీ వేషం.
- 卍 యశోద: శ్రీ కౄష్ణుని పెంపుడు తల్లి నందుని భార్య.
- 卍 యాజ్ణ్జవల్క్యం : అష్టాదశ స్మౄతులలో ఒకటి.
- 卍 యాజ్ణ్జవల్క్యుడు: యజుర్వేద ధురందురుడు ఇన వైశంపాయుని శిష్యుడు.
- 卍 యుధిష్ఠరుడు: ధర్మరాజుకు మరొక పేరు.
- 卍 రంభ: ఒక అప్సరస.ఇంద్ర సభలో రూపురేఖా లావణ్యాలు గల స్త్రీ.
- 卍 రతీదేవి: మన్మధుని భార్య.
- 卍 రాధ: శ్రీకౄష్ణుని ప్రియురాలు.నందుని చెల్లెలు.
- 卍 రావణుడు: లంకాధిపతి.రామయనం లో ప్రతినాయకుడు. విశ్వవసుని పుత్రుడు. దశకంఠుడు. మండోదరి ఈయన భార్య. ఇంద్రజిత్తు, మేఘనాదుడు ఇతని కొడుకులు.
- 卍 రుక్మిణి: శ్రీకౄష్ణుని పెద్ద భార్య.ప్రద్యుమ్నుడు తల్లి.
- 卍 లక్ష్మిదేవి: విష్ణుమూర్తి భార్య. క్షీరసాగర మధనం సమయం లో పుట్టినది.
- 卍 లవకుశులు: సీతారాముల కవల పిల్లలు.
- 卍 లేలావతి: హిరణ్యకశివుని భార్య.ప్రహలాదుని తల్లి.
- 卍 లోపాముద్ర: అగస్త్యుని భార్య.మహాపతివ్రత.
- 卍 వజ్రదమ్ష్ర్టుడు: రావణుని భటుడు.వీనిని అంగదుడు చంపుతాడు.
- 卍 వరూధిని: ఒక గంధర్వ స్త్రీ.మనుచరిత్ర లో నాయక శౄంగారనయక.
- 卍 వశిస్ఠుడు: సప్తమహర్షులల్లో ఒకరు.ఇతని భార్య అరుంధతి. దశరథునికి గురువు.
- 卍 వసుదేవుదు: శ్రీ కౄష్ణుని తండ్రి.
- 卍 వాలి: సుగ్రీవుని అన్న.అంగదుడు ఈయన పుత్రుడు.తార ఈయన భార్య.
- 卍 వాల్మీకి: వాల్మీకం అంటే పుట్ట.పుట్టలోంచి పుట్టిన వాడు వాల్మీకి.సంస్కౄత భాషలో మహాకవి.రామాయణ కర్ర్త. మొట్టమొదట కావ్యకర్ర్త.
- 卍 వికర్ణుడు: గాంధరి-దౄతరాష్ర్టుల కుమారుడు.ద్రౌపదీ వస్త్రపహరనకు ముందు సభలో దుర్యోధనుని చర్య గ్రహించినవాదు.
- 卍 విచిత్రవీర్యుడు: దౄతరాష్ర్ట,పాండురాజుల తంద్రి.
- 卍 విద్యుత: అలకాపురి దీవకన్య,అస్టావక్రుడి గౌరవార్ర్ధం నౄత్యం చేస్తుంది.
- 卍 విదురుడు : వ్యాసమహర్షికి అంత:పురంలోని దాసి (అంబిక యొక్క దాసీ) యందు పుట్టినవాడు. నీతి విద్యాపారంగతుడు. దృతరాష్ట్రునికి నీతీని బోదిస్తూ ఉంటాడు.
- 卍 విభీషణుడు : రావణుని సోదరుడు. ఇతడు రావణునికి నీతిబోధచేయగా వినిపించు కోలేదు.
- 卍 విప్రుడు : దౄవుడి వంశంలోని రాజు సుచ్హాయ శిష్టుల కుమారుడు.
- 卍 విశ్వపతి : మనువు అనే అగ్ని రెండవ కుమారుడు.
- 卍 విశ్వరూపుడు : విశ్వకర్మ కుమారుడు సూర్యుని కుమార్తె, విష్టి ఇతని భార్య.
- 卍 వేదవ్యాసుడు : సత్యవతి పరాశరుల కుమారుడు. మహాభరత కర్త.
- 卍 వేది : బ్రహ్మదేవుని భార్య.
- 卍 శకుంతల : మేనక విశ్వామిత్రుల కుమార్తె. దుష్యంతుని గాంధార వివాహం చేసుకుంటుంది. వీరి కుమారుడు భరతుడు ఇతని పేరే భారత దేశానికి వచ్హినది.
- 卍 శరవణం : పర్వతీపరమేశ్వరుల రహస్యంగా విహరించే ఒక అరణ్యం.
- 卍 శివగంగ : అగ్ని పెద్దకుమారుడైన అంగిరసుడి భార్య.
- 卍 షష్టీదేవి : మూల ప్రకౄతిలోని ఆరవ భాగము నుండి జన్మించిన దేవత.
- 卍 సత్యభామ : సత్రాజిత్తు కుమార్తె, శ్రీ కౄష్ణుని భార్య.
- 卍 సత్యలోకం : బ్రహ్మలోకాన్ని సత్యలోకమంటారు.
- 卍 సాలగ్రామం : మహావిష్ణు స్వరూపమైనరాయి, గండకి నదిలో ఉంటుంది.
- 卍 సాంబుడు : జాంబవతి , శ్రీ కౄష్ణుల కుమారుడు.
- 卍 సుదర్శనం : శ్రీ మహావిష్ణువు చక్రం సూర్యరేణువులతో విశ్వకర్మ చేశాడు.
- 卍 సురభి : దేవతల గోవు .
- 卍 హంసగీత : హంసరూపధరుడైన బ్రహ్మ సాధ్యులకు ఉపదేశించిన ధర్మప్రకారాన్ని తెలిపే ఒక గ్రంధం.
- 卍 హోమధేనువు : యజ్ణ్జానికి కావలసిన పాలు ఇచ్హే ఆవు.
- 卍 హ్లాదుడు : హిరణ్యకశిపుడి కుమారుడు, దమని ఇతని భార్య, వాతాపి ఇల్వలులు వీరి కుమారుడు.
రచన: నాగవరపు రవీంద్ర