దేవుని కి అరటి పండు ఎందుకు సమర్పిస్తారు?
అరటి చెట్టు జీవిత కాలంలో ఒకే ఒక్క సారి అరటి గెలను ఇస్తుంది. అలా వచ్చిన అరటి పండును దేవుడికి మనం సంర్పిస్తాము.
జన్మలల్లో మనిషి జన్మ ఒకసారే వస్తుంది. అరటి పండును ఆదర్శంగా తీసుకొని మనలను మనం దేవుడికి సమర్పించుకొంటామన్నమాట.
అరటి సంస్కృతంలో "కడలి" అనీ వన లక్ష్మి అనీ అంటారు. అరటి లో ప్రతీ భాగం ఉపయోగమే అరటి వేరు అరటి కాండం(దూట) దాని పువ్వు, అరటి అక్కులు, అరటి కాయ, అరటి పండు, అరటి పీచు. అరటిలో ప్రతీదీ మనం వాడుకోనేదే.
దీన్ని మనం ఆహారం లో ఆరోగ్యం గావున్నప్పుడే కాదు. కొన్ని రోగాల సమస్యలు పరిష్కరించుకోడానికి వుపయోగిస్తారు.
ఆయుర్వేదములో అరటి పండు గుణములు ఇలా వివరించారు.
|| శ్లో || "మౌచం స్వాదురసం ప్రోక్తం కషాయం నాతి శీతలం !
రక్త పిత్త హారం వృ షయం రుచ్యం శ్లేష్మకరం గురు ||
అరటి పళ్ళు మధుర, కషాయం రసం కలిగి వుంటాయి. గుణం -గురుగుణం అంటే కడుపునిండిన భావం కలిగి వుంటుంది. శరీరంలో ధాతువులని పెంచుతుంది. బరువులను పెంచుతుంది. మరీ చలవ కాదు. రక్త దోషాన్ని నివారిస్తుంది. రుచిని పుట్టిస్తాయి.
అరటి పండు: ప్రపంచమంతా దొరికే పండు. అన్ని సీజన్స్ లో దొరుకుతుంది. అరటి పండు వెంటనే శక్తీని ఇస్తుంది. దీన్ని సంపూర్ణ ఆహారంగా తేసుకోవచ్చు.
రచన: లహరి