- ✹ సూర్యోదయము, సంపూర్ణచంద్రోదయము కలలో కని పించి నచో ధనలాభము కలుగును.
- ✹ క్షేత్రదర్శనము. గురువులు, పుణ్యపురుషులను కలవచ్చిన యెడల సుఖము, సంపదలు కలుగును.
- ✹ నీటి మీద తిరిగివచ్చినట్లు కల వచ్చిన శుభము.
- ✹ పూల తోటలో తిరిగినట్లు వచ్చిన స్త్రీ వలన లాభము.
- ✹ పచ్చని పైరుకలలో వచ్చిన ధనలాభం కలుగును.
- ✹ మలము దేహమున పూసుకొనుచున్నట్లును, ఏనుగుమీద ప్రయాణము
- ✹ చేసినట్లును వచ్చిన అతి త్వరలో ధనలాభము కలుగును.
- ✹ వేశ్శనుగాని వివాహము జరుగుటగాని చూచి వారితో మాట్లాడినట్లు వచ్చిన శుభకార్యము ప్రొప్తించును.
- అన్నము, ఆవు, గుర్రము, ఏనుగు కలలో కనిపించిన పుత్రలాభము, శుభము జరుగును.
- ✹ శత్రువులను జయించునట్లు కనిపించిన విజయము.
- ✹ రక్తము, కల్లు త్రాగునట్లు, తెల్లని వస్త్రములు ధరించినట్లు, పూజించినట్లు, పూలు కనిపించిన విద్యాప్రాప్తి, ధనలాభము కలుగును.
అశుభ స్వప్నములు
- ✹ తల గొరిగినవాడు గాని విధవను గాని, చూచుట అశుభము.
- ✹ నూనెతో తలంటు కొనినట్లు, దూది, ఇనుము కనిపించిన మరణము, ఆపదలు కలుగును.
- ✹ క్షీణచంద్రుడు నక్షత్రము రాలుచున్నట్లు కనిపించిన దు:ఖము.
- ✹ పర్వతము నెక్కునపుడు కాలు జారినట్లును, పడవ ప్రయాణములో మునిగినట్లును కలవచ్చిన మరణము, నిలువ ధనమునకు హాని.
- ✹ ఇంటిలో దొంగలుపడినట్టు కలవచ్చిన ధనం పోవును.
అనువాదము: కోటి మాధవ్ బాలు చౌదరి