శివ మానస పూజ
ఆది శంకరాచార్య |
🙏 రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్ |
జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ || 1 ||
🙏 సౌవర్ణే నవరత్నఖండ రచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ |
శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్చలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు || 2 ||
రత్న ఖచితమైన బంగారు పాత్రలలో నెయ్యి, పాయసము, పంచభక్ష్యాలు, పాలు పెరుగు అరటిపళ్ళ పానకము ఇంకనూ అనెకవిధములైన శాకపాకములతో శుభ్రమగు జలముతో యథాశక్తి నైవేద్యము సమర్పించుచున్నాను ప్రభో దయతో స్వీకరించు.
🙏 ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణా భేరి మృదంగ కాహలకలా గీతం చ నృత్యం తథా |
సాష్టాంగం ప్రణతిః స్తుతి-ర్బహువిధా-హ్యేతత్-సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో || 3 ||
ఛత్రము చామరము(చమరీమృగ కెశములతో చేయబడిన వింజామర)నిర్మలమైన దృశ్యములు కర్ణపేయమైన చిత్త శాంతిని కల్గించు సంగీతముతో నృత్యముతో, పరమాత్మా, నిన్ను రంజింపజేసి మిమ్ము స్తుతించి ,ప్రణుతించి ,సాష్టాంగ నమస్కృతులాచరించి నా మనసుకు తోచినట్లు,నా శక్తికి తగినట్లు నిన్ను పూజించుకోనుచున్నాను మహాప్రభో.
🙏 ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగ-రచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ || 4 ||
ఆత్మవు నీవు తల్లి పార్వతి మనస్సు సహచరులా ప్రాణములు ఇక శరీరమా అది గృహము పూజ అంటావా నీకే అర్పితమైన నేననుభవించే భోగములే. నిద్రావస్తాయే సమాధి స్థితి . సంచారము నీ ప్రదక్షిణము దుర్గాటములైన గిరులను గూర్చిన తలపులే నీకు నే సమర్పించే స్తోత్ర పాఠములు. నేను పైన తెలిపిన ఏ ఏ కర్మల నాచరించుచున్నానో అవి అన్నియు నీ ఆరాధనముగానే భావించుచున్నాను.
🙏 కరచరణ కృతంవా కర్మ వాక్కాయజంవా
శ్రవణ నయనజంవా మానసంవాపరాధం
విహితమహితంవా సర్వామే తక్షమస్వ
శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో II 5 II
నమస్తే నమస్తే నమస్తె నమః
స్వస్తి
రచన: చెరుకు రామ మోహన రావు