- పసుపుకొమ్ములు - 200 గ్రాములు
- పటిక - 20 గ్రాములు
- ఎలిగారం - 20 గ్రాములు
- నిమ్మకాయలు - 6
- నువ్వులనూనె - 10 గ్రాములు
పటికనూ, ఎలిగారంలనూ కచ్చాపచ్చాగా దంచి నిమ్మరసం బాగా కలపాలి. ఆపై పసుపుకొమ్ములు అందులో వేసి కలిపి ఓ రోజంతా ఉంచాలి. మరుసటిరోజు మరో పాత్రలోకి మార్చాలి. పసుపుకొమ్మలకి బాగా పట్టి వుంటాయి. వాటిని నీడ ఉండే ప్రదేశంలో ఉంచి ఎండబెట్టాలి ఆ తర్వాత రోటిలో వేసి బాగా మెత్తగా దంచాలి. దంచిన కుంకుమని తెల్లబట్టలో వేసి జల్లించుకోవాలి. చాలా కొద్దిగా నూనె వేసి కలుపుకొని కుంకుమ భరిణలో పదిలం చేసుకోవాలి. మీరు చేసుకున్న కుంకుమను ..మీరే ఆనందంగా అలంకరించుకోండి, ధరించండి
రచన: శ్రీ లక్ష్మీ నిధి