కాలము - దాని వివరణ
మన అనంత విశ్వంలో గ్రహములు, నక్షత్రములు | రాసులతో గూడి, విశ్వంలో తిరుగుచున్న సూర్య చంద్రుల గతులను బట్టి మన పూర్వీకులు కాలం నిర్ణయించుట జరిగినది.
మానవుని ఆరుకనురెప్పపాట్ల కాలమునకు ఒక విఘడియ అని పేరు పెట్టిరి.
మానవుని ఆరుకనురెప్పపాట్ల కాలమునకు ఒక విఘడియ అని పేరు పెట్టిరి.
- 60 విఫఘడియలు ఒక ఘడియ 7 1/2 ఘడియలు ఒక జాము.
- 8 జాములు ఒక రాత్రి ఒక పగలు కలిపి 'తిథి' యందురు అంటే (1 రోజు ).
- ✹ కనురెప్ప పాటు కాలము 1 సెకను.
- ✹ 60 సెకనులు 1 నిమిషము.
- ✹ 60 నిమిషములు 1 గంట.
- ✹ 12 గంటలు 1 పగలు.
- ✹ 12 గంటలు 1 రాత్రి
- ✹ ఒక రాత్రి, ఒక పగలు కలిసి ఒక రోజు.
- ✹ 24 గంటలు ఒక రోజు.
- ✹ 7 రోజులు ఒక వారము.
- ✹ 2 వారములు 1 పక్షము.
- ✹ 2 పక్షములు 1
- ✹ 12 నెలలు 1 సంవత్సరము.
- ✹ సంవత్సరములో ఫిబ్రవరి నెలకు 28 రోజులుండును.
- ✹ 4 సంవత్సరముల కొకసారి లీపు సంవత్సరం వచ్చును.
- ✹ లీపు సంవత్సరం ఫిబ్రవరి నెలకు 29 రోజులుండును.
- ✹ సంవత్సరమునకు 385 రోజులు.
- ✹ లీపు సంవత్సరమునకు 366 రోజులుండును.
- ✹ 1 సంవత్సరమునకు 12 నెలలు, 3 కాలములు 6 ఋతువులు, 24 పక్షములు 52 వారములు 365 రోజులు.
భూమి గుండ్రముగా ఉండి తన చుట్టు తాను తిరుగుచున్నందున ఎదురుగా ఉన్న సూర్యగ్రహం వెలుగు (ఎండ) భూమిపైన ఒకే ప్రక్కన పడును. అంటే సూర్యునికి ఎదురుగా ఉన్న భూభాగముపైన ఎండపడును. వెనుక వైపుపడదు. కాబట్టి చీకటిగా నుండును.
భూమి తన చుట్టు తాను తిరుగు చున్నందున సూర్యకాంతి మొత్తము భూభాగముపై పడుచున్నది. కనుక ప్రతి భూభాగమునకు వెలుతురు (పగలు) చీకటి (రాత్రి) క్రమముగా మారు చుండును. ఇలా మనకు పగలు, రాత్రులు ఏర్పడు చున్నవి. ఒక పగలు ఒక రాత్రి కలిపి ఒక రోజు అనుచున్నాము.
ఋతువులు
రెండు నెలలకు ఒక ఋతువుగా వాటి దినములలో నుండు కాలధర్మములను బట్టి ఋతువు అని పిలుచుచున్నాము. సంవత్సరములోని నెలలను 6 ఋతువులుగా నిర్ణయించబడినది భూమి తనచుట్టుతాను తిరుగుతూ, సూర్యుని చుట్టు తిరిగే సంవత్సరకాలంలో సగకాలము సూర్యునికి దగ్గరగాను, మిగతా సగకాలం సూర్యునికి దూరంగాను ఉండును. అందువలన సూర్యుడు ఉత్తరమునుండి దక్షిణమునకు, దక్షిణమునుండి ఉత్తరమునకు ప్రయాణము చేయుచున్నట్లు కనబడును. సూర్యుడు ఉత్తరము దిక్కుగా ప్రయాణము చేయుచున్నట్లు
కనబడుకాలమునకు ఉత్తరాయణము. దక్షిణపు దిక్కుగా ప్రయాణము చేయుకాలమును దక్షిణాయనము అందురు.
శకములు
సంవత్సరలెక్కల కోసం ఈ శకములు ప్రారంభమైనది. పూర్వం మనదేశంలో అనేక శకములు వాడుకలో ఉండెను. వాటిలో ముఖ్యమైనవి. 1.శాలివాహన శకము. 2. విక్రమార్కశకము శాలివాహన
శకము దక్షిణదేశంలోను, విక్రమార్కశకము ఉత్తరదేశంలోను వాడుచుండిరి.
మనకు స్వాతంత్య్రము వచ్చిన తరువాత మన భారత ప్రభుత్వము ఇటువంటి వేరువేరు భావములుండరాదని, దేశమునకు మొత్తము ఒకే జాతీయ శకము ఉండవలెనని, శాలివాహన శకమును జాతీయ శకముగా నిర్ణయించారు.
యుగములు
యుగములు నాలుగు:
1. కృత యుగము. 2. త్రేతా యుగము. 3. ద్వాపరయుగము, 4. కలి యుగము
- కృత యుగము - 17,28,000 సంవత్సరములు.
- త్రేతా యుగము - 12,96,000 సంవత్సరములు.
- ద్వాపర యుగము - 8,64,000 సంవత్సరములు.
- కలి యుగమునకు - 4,32,000 సంవత్సరములు.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి