దేవాలయములు నిర్మించేటప్పుడు , వాటి కి సంబంధించి ముఖ్యంగా నిర్మించ వల్సిన భాగములు ఇవి అని మా తాత గారు కాశీభట్ల వీర" రాఘవయ్య గారు చెప్పారు
అవి:
- 卍 గర్భాలయము
- 卍 అంతరాలయము
- 卍 ముఖ మండపము
- 卍 అలయ విమానం
- 卍 విమానం కలశ ము
- 卍 ధ్వజ స్తంభం
- 卍 ఆలయ ప్రాకారం
- 卍 గాలి గోపురం
- 卍 కళ్యాణ మండప ము
- 卍 ఉత్సవ సమయంలో స్వామి వారిని ఊరేగించే వాహనములు ఉంచుట కు వాహనశాల యజ్ఞశాల
- 卍 అలయము లోపల బావి.
ఇపి ముఖ్య మయినపి ఎందుకు అంటారు అంటే , ఆయన చాల మంచి ఏవరణ ఇచ్చారు.
- 卍 శిఖరం = స్వామి వారి శిరస్సు
- 卍 గర్భాలయం = స్వామి వారి కంఠం
- 卍 మంటపము = స్వామి వారి ఉదరం
- 卍 ప్రాకారం = స్వామి వారి మోకాళ్ళు, పిక్కలు
- 卍 గోపురము = స్వామి వారి పాదములు
- 卍 ధ్వజము = స్వామి వారి జీవ స్థానము అని, అందుకు ఇవి అత్యంత ముఖ్య మయినవిగా పరిగణించాలి అని ఆయన చెప్పారు.
మూర్తులు:
- ఇక మూర్తుల విషయానికి వస్తే, ప్రతి ష్ఠించబడిన శిలాపిగ్రహములకు "ధరువ మూర్తులు" అని "మూల విరాట్టు" అని పేరు.
- తామ్ర లోహంతో తయారు అయిన పిగ్రవల కు "కౌతుకమూర్తులు" అని పేరు. సమస్త పూజోపచారములు ఈ కౌతుక మూర్తులకి చేస్తారు.
- తరువాత "ఉత్సవ పిగ్రహాలు" చాల ముఖ్యమయిన పి. ఈ ఉత్సవ విగ్రహాలకే ఆలయోత్సవాలు, గ్రా మోత్సవాలు, కళ్యాణోత్సవాలు జరిపిస్తారు.
- స్నాపన మూర్తులు నిత్యనై మిత్తికాభిషేకము ఈ మూత్రులకి చేస్తారు.
అర్చక ధర్మాలు:
సరే ఇక అర్చన వృత్తులకి వస్తే - అర్చకులు ప్రాతః కాల మున లేచి కాలకృత్యాలు నెరవేర్చుకుని , స్నానమాచరించి, పరిశుభ్ర మయిన వస్త్రాలు ధరించి, బొట్టు ధరించి, దేవాలయానికి వెళ్ళి అక్కడి మాలిన్య ద్రవ్యాలు బయట పారబోసి, తీర్థ పాత్రలు శుద్ధి చేసి, తీర్ధ ము తయారు చేసి స్వామి వారికి దీపారధన చేసి, తులసి, పుష్పములు మొదలయిన
పూజా ద్రవ్యాలతో స్వామి వారికి అర్చన చెయ్యాలి అని తాత గారు
చెప్పారు
తరువాత స్వామి వారికి అన్నము, పెరుగు, నెయ్యి నివేదన చేసి సాయం స మయ మునందు స్వామి వారికి దీపారాధన చేసి అవసర నివేదన సమర్పిస్తారు అని - ఇవి అర్చకుని ప్రధాన ధర్మాలు అని చెప్పారు
రచన: మాగంటి వంశీ మోహన్