పూజ చేస్తున్నప్పుడు ఆసనానికి కూడా అత్యంత ప్రాముఖ్యత ఉంది. పూజ నిర్విఘ్నముగ జరిగేందుకు ఆసనం యొక్క ఆవశ్యక్త ఎంతో ఉంటుంది. అందుకే ఆసనం గురించి
ఈ క్రింద విధముగా చెప్పారు -
ఆత్మ సిద్ధి ప్రదానాశ్చ సర్వరోగనివారణం
నవసిద్ధి ప్రదానశ్చ ఆసనం పరికీర్తితం.
ఆత్మ ఙ్ఞాన్ని కలిగించడానికి, సర్వరోగాలను నివారించడానికి,నవసిద్ధులను ప్రాప్తింపజేయడానికి, " ఆసనం" అత్యంతావశ్యకమైనదని చెప్పబడుతోంది.
ఇక " ఆ" అంటే ఆత్మ సాక్షాత్కారం కలిగిస్తూ, " స" అంటే సర్వరోగాలను హరిస్తూ, "నం" అంటే నవసిద్ధులను ఇచ్చేదని అర్ధం.
అనువాదము: కోటి మాధవ్ బాలు చౌదరి