యావత్ అండపిండ బ్రహ్మాండంలో అణువణువునా అష్టదిక్కులలో ఆ పరమాత్మ భగవంతుడు ఆవహించి అవతరించి ఉన్నాడు,ఈ సంపూర్ణ సృష్టి అంతా దైవ మాయ శూన్య కల్పనా విచిత్ర స్వప్న సాక్షాత్కారం.
భగవంతుడు, భూ, జల, వాయువు తలంలో చరాచర సమస్త శత సహశ్ర అనంత కోటి జీవ ఆత్మలను సృజించి భూత,వర్తమాన,భవిషత్ కాలాల్లో క్షణం క్షణం శాసిస్తున్నాడు.
ఈ బ్రహ్మాండం సృష్టి లో రానున్న భవిష్యత్ లిప్త శత సహశ్రంశ సమయానికి దైవనాటకంలో ఏమి జరుగునో ఆ పరమాత్మ భగవంతుడికి ఒక్కడికే తెలుసు. ఈ జగన్నాటకంలో శత సహశ్రకోటి ఆత్మల ,ప్రాణుల నిండు నూరేళ్ళ భావి జీవితాలు ఆ భగవత్ సంకల్ప సిద్దితో కొనసాగుతూ కాలగర్భంలో కలిసిపోతుంటాయి.ఈ యావత్ అండపిండ బ్రహ్మాండంలో అణువణువునా అష్టదిక్కులలో ఆ పరమాత్మ భగవంతుడు ఆవహించి అవతరించి ఉన్నాడు,ఈ సంపూర్ణ సృష్టి అంతా దైవ మాయ శూన్య కల్పనా విచిత్ర స్వప్న సాక్షాత్కారం.
భగవంతుడు ,భూ,జల,వాయువు తలంలో చరాచర సమస్త శత సహశ్ర అనంత కోటి జీవ ఆత్మలను సృజించి భూత, వర్తమాన,భవిషత్ కాలాల్లో క్షణం క్షణం శాసిస్తున్నాడు. ఈ అనంత బ్రహ్మాండ సృష్టి ఉహాతీతమైన విధంగా క్షణ క్షణం లిప్త లిప్తకు బహు వేగంగా అడుగడున అష్టదిక్కుల విస్తారిస్తునే ఉన్నది.
రచన: H.V.S.R.C. శర్మ C.ENGR.(RTD)