శివభగవానుడు ! |
ఈ కార్తీక మాసం వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి, కాలకృత్యములు తీర్చుకుని, నదికిబోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి, సంకల్పము చెప్పుకుని, మరల నీటమునిగి సూర్య భగవానునకు అర్ఘ్యప్రదాన మొసంగి, పితృ దేవతలకు క్రమప్రకారముగా తర్పణములొనర్చి, గట్టుపై మూడు దోసిళ్ల నీళ్లు పోయవలెను.
ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో యే ఒక్క నదిలోనైననూ స్నానమాచరించిన యెడల గొప్ప ఫలము కలుగును.
తడిబట్టలు వీడి, మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్యధూప, దీప, నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకుని, గంధము తీసి భగవంతునికి సమర్పించి, తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిధి ఆభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి, తనయింటి వద్దగాని, దేవాలయములలో గాని, లేక రావి చెట్టు మొదటగాని కూర్చుండి కార్తీక పురాణము చదువవలయును.
ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి, శివాలయమందుగాని, విష్ణ్యాలయమందుగాని, లేక తులసికోటవద్దగాని, దీపారాధన చేసి శక్తినిబట్టి నైవేద్యము తయారుచేయించి, స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలయును.
ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును, ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమున కర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారలు వ్రతము చేసినవారలను జూచి, వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును.
ఈ మాసమంతయు ప్రతి దినము చదివి, అందరికీ వినిపించవలసిన 30 రోజుల ముప్పది కార్తీక పురాణములు విన్నవారికి పాపములనుండి విముక్తి పొందుతారు:
కార్తీక పురాణములు (రోజువారీగా):
- కార్తీక పురాణము - 1వ రోజు
- కార్తీక పురాణము - 2వ రోజు
- కార్తీక పురాణము - 3 వ రోజు
- కార్తీక పురాణము - 4వ రోజు
- కార్తీక పురాణము - 5వ రోజు
- కార్తీక పురాణము - 6వ రోజు
- కార్తీక పురాణము - 7వ రోజు
- కార్తీక పురాణము - 8 వ రోజు
- కార్తీక పురాణము - 9వ రోజు
- కార్తీక పురాణము - 10వ రోజు
- కార్తీక పురాణము - 11వ రోజు
- కార్తీక పురాణము - 12 వ రోజు
- కార్తీక పురాణము - 13 వ రోజు
- కార్తీక పురాణము - 14 వ రోజు
- కార్తీక పురాణము - 15 వ రోజు
- కార్తీక పురాణము - 16వ రోజు
- కార్తీక పురాణము - 17వ రోజు
- కార్తీక పురాణము - 18 వ రోజు
- కార్తీక పురాణము - 19 వ రోజు
- కార్తీక పురాణము - 20 వ రోజు
- కార్తీక పురాణము - 21 వ రోజు
- కార్తీక పురాణము - 22 వ రోజు
- కార్తీక పురాణము - 23వ రోజు
- కార్తీక పురాణము - 24 వ రోజు
- కార్తీక పురాణము - 25 వ రోజు
- కార్తీక పురాణము - 26వ రోజు
- కార్తీక పురాణము - 27వ రోజు
- కార్తీక పురాణము - 28వ రోజు
- కార్తీక పురాణము - 29వ రోజు
- కార్తీక పురాణము - 30వ రోజు
సేకరణ మరియు అనువాదం: గోగులపాటి కృష్ణమోహన్
మూలం: స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్యం