భారతీయ సంస్కృతిలో మానవ లక్ష్యాన్ని చేర్చే మార్గాలు ద్వైతము అద్వైతము, విశిష్టాద్వైతము మూడు మతములు ప్రఖ్యాతి గాంచినాయికానీ మూఢ మతస్థులు తాము అనుసరిస్తున్న మార్గమే విశిష్ట మైనదని భావిస్తూ యితర మార్గాలను అనుసరించే వారిని ద్వేషిస్తారు.
ఒకరు శివుడు గొప్ప అంటే వేరొకరు విష్ణువు గొప్ప అంటూ వుంటారు..శివనామము వుచ్చరించని వైష్ణవులు, విష్ణునామము ఉచ్చరించని శైవులు కొంతకాలం ముందుండేవారు.
శివపురము, చెన్నం పల్లి అనే గ్రామాలు పక్క పక్కనే వుండేవి. ఒక వైష్ణవాచార్యునికి శివపురము లో పొలాలు వుండేవి. ఆయన శివపురమునకు తన భూములను చూసుకుందుకు వెళుతున్నప్పుడు ఎవరైనా ఎక్కడికి వెళుతున్నారు స్వామీ అని అడిగితే చెన్నం పల్లి పక్కనున్న గ్రామానికి వెళుతున్నాను అని చెప్పేవాడట,శివనామాన్ని పలుక కూడదని అలా చెప్పేవాడట.
ద్వైత, అద్వైతుల గురించి ఒక కథ ప్రచారము లో వుంది. ఒక అద్వైతి తన యింటి గోడపై 'సోహం' అని వ్రాశాడట. ఒక ద్వైతి ఆ దోవన పోతూ సోహం ముందు 'దా' వ్రాసి "దాసోహం' అని ద్వైత పరంగా వ్రాసాడట. మరుదినం అద్వైతి దాన్ని చూసి మండిపడి దానికి 'స' చేర్చి 'సదాసోహం' అని అద్వైత పరంగా దానికి 'స' చేర్చి 'సదాసోహం' అని అద్వైత పరంగా వ్రాశాడు. మరునాడు ద్వైతి దాని ముందు 'దా' చేర్చి 'దాసదాసోహం' అని వ్రాశాడు. యిలా వ్రాసి గోడంతా పాడు చేశారు .ఈ పిడివాదులు. అజ్ఞానం తో ఈ పిడివాదులు ద్వేషాలను రెచ్చగొట్టు కుంటూ వుంటారు..వీరు శివుడంటే ఏమో,కేశవుడంటే ఏమో తెలియని మూర్ఖులు.
అన్ని నదులూ సముద్రము చేరినట్టే మనము ఏ దేవునికి నమస్కరించినా అది దేవదేవుడైన పరమాత్ముని చేరుతాయి " ఏ యథా మాం ప్రపద్యన్తే తాం సథైవ భజామ్యహమ్ మమ వర్త్మాను వర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః "ఎవరెవరు తమకు నచ్చినరూపము లో ధ్యానించితే నేను ఆయా రూపములతో సాక్షాత్కరిస్తాను, అన్నాడు గీతాచార్యుడు.
ద్వైతము నిజమా? అద్వైతము నిజమా? విశిష్టాద్వైతము నిజమా? అని వివేకానందుడిని ప్రశ్నిస్తే ఆయన అన్నియు సత్యమే ఒక సత్యము అంతకన్నా విశిష్ట మైన సత్యాన్ని చూపుతుంది.
మహా భక్తాగ్రేసరుడైన ఆంజనేయుడు ఈమూడు సిద్దాంతాలను అద్భుతంగా సమన్వయ పరిచాడు."దేహ భావేన దాసోహం"(ద్వైతము)"జీవ భావే త్వదంశకః (విశిష్టాద్వైతము) "ఆత్మాభావే త్వమేవాహం" (అద్వైతము) ఇతియే నిశ్చితా మతః అనగా దేహభావం తో భగవంతుని 'దాసోహం' (నీ దాసుడను) అని అర్చిస్తాడు.
జీవభావంతో 'నేను భగవదంశను ' అని మరొకరు (విశిష్టాద్వైతము) దేవుని ప్రార్థిస్తారు ఆత్మ భావం తో నీవే నేను (సోహం)అని అ ద్వైతి భగవంతుడిని ఆరాధిస్తాడు; ఎవరెవరు తమ ప్రకృతి ననుసరించి వారు తమ పద్ధతి ప్రకారం భగవంతుడిని ఆరాధిస్తారు..మార్గాలు వేరైనా లక్ష్యమొకటే అని తెలిసికొంటే ద్వేషానికి తావుండదు.
శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు: విష్ణోశ్చ హృదయం శివఃయథా శివమయో విష్ణురేవం విష్ణు మయశ్శివః యథాంతరం నపస్యామి తథామే స్వస్తిరాయుషి.
రచన: H.V.S.R.C. శర్మ C.ENGR.(RTD)