వైష్ణవ దేవాలయాలలో మనం ఆళ్వార్లు ని దర్శించుకుంటాం. ఆళ్వార్ అంటే నిమగ్నమై ఉన్నవాడు అని అర్ధం. తాము నమ్ముకున్న విధానంపట్ల అచంచల విశ్వాసాన్ని, భక్తిని కలిగి ఉన్నారని అర్ధం. ఆ శ్రీమన్నారాయణుని పట్ల భక్తిని పెంచుకున్నారు. ఆ భక్తిభావం కలిగిన అనంతరం వేరే భావాన్ని మదిలోకి రానివన్నంత గాఢంగా విశ్వాసాన్ని పెంచుకున్నారు. అందుకే భగవంతునికి అంత చేరువ కాగలిగారు. ప్రస్తుతం 12మంది ఆళ్వార్లు లేని వైష్ణవాలయం ఉండదంటే అతిశయోక్తి కాదు. వీరు ఉన్నపుడే ఆ ఆలయానికి పూర్ణత్వం సిద్ధిస్తుందని సాక్షాత్తూ ఆ శ్రీమన్నారయణుడే వీరిని స్వయముగా అనుగ్రహించడం ఇక్కడ విశేషం. అంతగా స్వామి ధ్యానంలో పరవశులైనారు వీరు.
ఆళ్వార్లు |
భూతం సరశ్చ మహాదాహ్వాయ భట్టనాధ
శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్
భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్
శ్రీమత్సరాంకుశ మునిం ప్రణతోస్మినిత్యం
- ✹ భూతయోగి - పూదత్తాళ్వార్ - కౌమోదకి అనే గద
- ✹ సరోయోగి - పోయిగయాళ్వార్ - పాంచజన్యం అనే శంఖం
- ✹ మహాయోగి - పేయాళ్వార్ - నందకం ఖడ్గం
- ✹ భట్టనాధుడు - పెరియాళ్వార్ - గరుడుడు
- ✹ ఆండాల్ - గోదాదేవి - లక్ష్మీదేవి అంశ
- ✹ భక్తిసారయోగి - తిరుమళిసైయాళ్వార్ - సుదర్శన చక్రం అంశ
- ✹ కులశేఖరాళ్వార్ - కౌస్తుభమణి అంశ
- ✹ మునివాహనులు - తిరుప్పాణాళ్వార్ - శ్రీవత్సలాంచన అంశ
- ✹ భక్తాంఘ్రిరేణువు - తొండరడిప్పొడియాళ్వార్ - వైయజంతి అను పూమాల అంశ
- ✹ పరకాలయోగి - తిరుమంగైయాళ్వార్ - శారంగం అను ధనస్సు
- ✹ మధురకవి ఆళ్వార్ - కుముదాంశ
- ✹ శఠకోపముని - నమ్మాళ్వార్ - విశ్వక్సేనుని అంశ
ఈ వరుస క్రమముని ఒక్కోరు ఒక్కో విధంగా చెప్తారు. వీరంతా దాదాపుగా దక్షిణదేశానికి చెందినవారు. ఇక, వీరిలో నలుగురేమో పల్లవ రాజ్యానికి, ముగ్గురేమో చోళదేశానికి, ఒకరేమో కేరళ కి చెందినవారుకాగా, మరో నలుగురేమో పాండ్యదేశానికి చెందినవారు.
కులమతాలకు అతీతంగా వీరిలో అందరూ ఉన్నారు. ముందు చెప్పిన విధంగా ఈ 12మందిలో ఒకరు దేశాన్నేలే రాజు కాగా, మరొకరు చోరవృత్తి చేసే వారు కూడా ఉన్నారు. ఆళ్వార్లు అందరూ మంచి కవులే.
కులమతాలకు అతీతంగా వీరిలో అందరూ ఉన్నారు. ముందు చెప్పిన విధంగా ఈ 12మందిలో ఒకరు దేశాన్నేలే రాజు కాగా, మరొకరు చోరవృత్తి చేసే వారు కూడా ఉన్నారు. ఆళ్వార్లు అందరూ మంచి కవులే.
ఇక ఆండాల్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆమె సాక్షాత్తూ శ్రీరంగడి పత్నిగా ఆయన హృదయంలోనే ప్రతిష్టితురాలైన గొప్ప భక్తురాలు. తిరుప్పావై ఈమె వ్రాసినదే. ఆమె తండ్రి పెరాయాళ్వార్ విష్ణుచిత్తుడిగా పేరుపొందాడు.
రచన: శ్రావణీ రాజ్