భారతీయ సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి
శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ సంప్రదాయం తెలియజేసేందుకు టీటీడీ కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. ప్రారంభంలో కల్యాణోత్సవం, ఆ తర్వాత అన్ని రకాల ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు సంప్రదాయ వస్త్రధారణ అమలు చేసింది. ఆన్లైన్ టికెట్ల దర్శనానికి వచ్చే భక్తులు కూడా విధిగా సంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలన్న నిబంధన ఉంది.
పురుషులు: ధోవతి–ఉత్తరీయం, కుర్తా –పైజామా
మహిళలు: చీర–రవిక, లంగా–ఓణి, చున్నీ/ పంజాబీ దుస్తులు, చుడీదార్ ధరించాల్సి ఉంటుంది.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి