నేను గాయత్రి ఉపాసన తీసుకుందామనుకుంటున్నాను మార్గాన్ని చూపగలరు.
గాయత్రీ ఉపాసన అంటే అఖండ నిష్టా.నియమాలను పాటించాలి.మగ వారు ఆడ దేవతా ఉపాసన చేస్తే బహు అనిర్వచనీయమైన పరీక్షలు తట్టుకునే పూర్వ జన్మ సుకృత దైవ బలం.నఖ.శిఖ పర్యంతం ఆత్మ జ్ఞానం .ఆత్మ బలం సమృద్ధిగా ఉండాలి.లేని యడల బెడిసి కొట్టిందా రక్తం కక్కుకో వోవాలి. అనుభవం ఉన్న గురువు సన్నిధి అత్యంత శ్రేయోదాయకం. కృతయగ సిధ్ధాంతాను సారం గృహ జీవితం త్యాగం చేయాలి.
ఇన్ని విధాల ప్రయత్నం చేసినా మణీద్వీప మహిమాన్వితమైన అమ్మ వారి ఆజ్ఞా.ఆశీస్సులు ఉండాలి. కనుక గాయత్రీ ఉపాసన మానవులకు అతీతమైన. అగమ్యగోచరమైన బృహత్తర. కార్యం.ఆరంభించే ముందు లక్షల.కోట్ల మాట్లు యోచించుకొని మన ఆత్మ స్థైర్యం నిర్థారణ చేసుకుంటే ఉత్తరోత్తా సర్వ మంగళంగా భవిష్యత్ ఊహించటానికి ఆస్కారం ఉంటుంది.
రచన: H.V.S.R.C. శర్మ C.ENGR.(RTD)