మట్టి పాత్రల విశిష్టత
వాగ్బటాచార్యులు చెప్పిన మొదటి సూత్రం ఏ ఆహారమైనా వండేటప్పుడు గాలి , వెలుతురూ తగులుతూ వుండేలా చూసుకోవలెను . మనం వండుకునే ఏ ఆహారానికైనా సూర్యునికాంతి, గాలి ( పవనము ) తగలని ఆహారము తినకూడదు. అది ఆహారము కాదు విషముతో సమానము. ఈ విషము నిదానముగా పని చేస్తుంది. అంటే కొన్ని నెలలు లేకపోతే కొన్ని సంవత్సరాలుగా పని చేస్తుంది .
ప్రెషర్ కుక్కర్ లో వండే ఆహారానికి ఏ మాత్రమూ గాలి, సూర్యరశ్మి తగలదు. కావున ఇందులో వండిన ఏ ఆహారమైన విషతుల్యము. అల్యూమినియంతో ఈ ప్రెషర్ కుక్కర్ ని తయారు చేస్తారు . అల్యూమినియం పాత్రలలో ఆహారం వండటంగానీ , నిలువ వుంచటానికి గానీ ఏ మాత్రం పనికిరాదు . ఈ పాత్రలలో వండిన ఆహారాన్ని మళ్ళీ మళ్ళీ తింటూ వుంటే వారికి *మధు మేహం , జీర్ణ సంబంధిత , టి.బి. ఆస్తమా మరియూ కీళ్ళ సంబంధ* వ్యాధులు తప్పకుండా వస్తాయి . ఈ రోజు అందరి ఇళ్ళలోకి అల్యూమినియం వచ్ఛేసింది.
ప్రెషర్ అనగా ఒత్తిడి అంటే మనం ప్రెషర్ కుక్కర్ లో వండే పదార్ధం ఒత్తిడికి గురై త్వరగా మెత్తబడుతుంది. కానీ ఉడుకదు. పదార్ధం ఉడకడం వేరు మెత్తబడడం వేరు.
ఆయుర్వేదం ప్రకారం భూమిలో ఏగింజ పండడానికి ఎక్కవకాలం పడుతుందో అదేవిధంగా ఆగింజ వండడానికి ఎక్కవ సమయం తీసుకుంటుంది. గింజలోని అన్నిరకాల పోషకాలు మన శరీరంలోకి చేరాలంటే పదార్ధం వండబడాలి. మెత్తబడితే సరిపోదు. ఇది ప్రకృతి ధర్మం, ఆయుర్వేద సిద్ధాంతం .
మట్టిపాత్రలో టీ సేవనం |
ప్రాచీన కాలం నుండి భారత దేశంలో దేవాలయాలలో భగవంతునికి ప్రసాదం మట్టి పాత్రలోనే వండి, మట్టి పాత్రలోనే భగవంతునికి సమర్పిస్తారు. ఎందుకంటే మట్టి పరమ పవిత్రమైనది . మన శరీరం అంతటా ఉండేది మట్టియే. మన ఆరోగ్యానికి కావలసిన 18 రకాల మైక్రోన్యూట్రియన్స్ ఈ మట్టిలో వున్నాయి. మట్టి పాత్రలో వండిన ఆహార పదార్ధాన్ని రీసెర్చ్ చేయిస్తే వచ్చిన రిపోర్ట్ ఏమిటంటే ఈ పదార్ధాంలో ఒక్క మైక్రో న్యూట్రియన్స్ కూడా తగ్గలేదు. ప్రెషర్ కుక్కర్ లో వండిన పదార్ధాన్ని కూడా టేస్ట్ చేయిస్తే 7% లేక 13% న్యూట్రియన్స్ మాత్రమే ఉన్నాయి. 93% లేక 87% న్యూట్రియన్స్ దెబ్బతిన్నాయి, లోపించాయి అని తేలింది. *మట్టిపాత్ర* లో వండిన పదార్ధములో 100% న్యూట్రియన్స్ ఉన్నాయి. ఈ పదార్ధినికి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.
మన పూర్వీకులు ఈ సంప్రదాయం ప్రకారం జీవించినంత వరకు వారికి కళ్ళజోడు రాలేదు . జీవితాంతం వరకు పళ్ళు ఊడిపోలేదు , మోకాళ్ళ నొప్పులు , డయాబెటీస్ వంటి సమస్యలు రాలేదు . జీవితాంతం మన శరీరానికి కావల్సిన న్యూట్రియన్స్ అందుతుంటే మన పనులు మనమే చేసుకుంటూ ఎవరిమీద ఆధారపడకుండా జీవించగలం . అదీ ఒక్క మట్టిపాత్రలో వండిన ఆహారం భుజించటం వలన మాత్రమే సాధ్యమవుతుంది . డయాబెటీస్ ఏ స్ధాయిలో ఉన్నవారికైనా ఈ పద్ధతిలో భోజనం వండి పెట్టండి. సుమారు కొన్ని నెలలోపే ఖచ్చితంగా డయాబెటీస్ రోగం నుండి విముక్తులవుతారు. ఆనందంగా జీవిస్తారు.
మనం ఆరోగ్యంగా జీవితాంతం బ్రతకాలంటే గాలి, సూర్యరశ్మి తగిలేలాగా ఆహారం వండు కోవాలి. ఈ పద్ధతికి అత్యుత్తమైనది *మట్టి పాత్ర* .
మనకి మట్టి పాత్రలు తయారు చేసే కుమ్మరి వాళ్ళు ఎంతో గౌరవనీయులు . అన్ని రకాల మట్టి పాత్రలకు పనికి రాదు . ఏ మట్టి పనికి వస్తుందో , ఎలాంటి మట్టిలో వంట పాత్రలు చేయవచ్చో గుర్తించి తయారు చేస్తారు . ఇంత గొప్ప సేవచేసి మనకు ఆరోగ్యాన్ని అందించుచున్నందుకు నిజంగా వారు మనకు వందనీయులు .
*మట్టి పాత్రలోనే ఆహారం వండుకుందాం. ఆరోగ్యంగా జీవిద్దాం*
*భారతీయ కుమ్మరికి శతకోటి వందనాలు*
రచన: శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు
అనువాదం: కళ్యాణ్ & కోటి మాధవ్ బాలు చౌదరి