"తులసి చెట్టు" వలన కలుగు ప్రయోజనాలను తెలుసుకోండి. తులసి చెట్టు గురించి సంపూర్ణ వివరణ - ఔషధ ఉపయోగాలు..
చిన్నపిల్లలు ముఖ్యంగా బెల్లము, చక్కెర, చాక్లేట్లు మొదలగు తీపి పదార్దాలు ఎక్కువుగా తినువారికి ఈ వ్యాధి వచ్చును. దీనిని ఆంగ్లమున warms అంటారు. ఇంట్లో పెంచే కుక్కల నుంచి మన్ను తినటం వలన కూడా ఈ వ్యాధి వచ్చును.
- 🌿 క్రిమి రోగము ఉన్న పిల్లలు నిద్రలో పండ్లు కోరుకుతారు. ముక్కు కోన యందు దురద ఉండి గోకుతారు. కొద్ది దూరం నడిచిన పిక్కలలో నొప్పి అని నడవకుండా మారం చేస్తారు. పిల్లలు నిరుత్సాహముతో ఉందురు. కొందరికి ఫిట్స్ కూడా రావొచ్చు.
- 🌿 తాజా తులసిరసమునకు సమానంగా అల్లం రసం చేర్చి కొంచెం వేడిచేసి తాగిస్తూ ఉంటే కడుపు యందు ఉండు క్రిములు చచ్చి పడిపోవును .
- 🌿 తులసి దళములు వాయువిడంగములు కలిపి నూరి సేవించిన అన్నివిధముల అయిన క్రిములు చచ్చి విరేచనం ద్వారా పడిపోవును .
- 🌿 తులసి రసమును కొంచం వేడిచేసి మిరియాల చూర్ణం కలిపి సేవించిన కడుపులోని క్రిములు చచ్చి పడిపోవును .
మలేరియా జ్వరం :
- 🌿 7 మిరియాలు, 7 తులసి ఆకులు కలిపి నమిలి మింగుచున్న మలేరియా జ్వరం మూడు రోజుల్లో హరించును.
- 🌿 మలేరియా జ్వరం ప్రతీ సంవత్సరం సీజనల్ గా వచ్చును. అప్పుడు తులసి దళములు, మిరియాలు నీటిలో వేసి ఉడికించిన కషాయమునకు కొద్దిగా బెల్లం, నిమ్మరసం కలిపి వేడిగా ఉన్నప్పుడే కాఫీ లా తాగి రగ్గు కప్పుకొని గాలి చొరబడకుండా పడుకున్న జ్వరం తగ్గిపోవును . ఇలా మూడు గంటలకు ఒకమారు చేయవలెను .
- 🌿 తులసి ఆకులు వేపచిగుళ్ళు కలిపి తినవచ్చును. తులసి చెట్టు వేర్లు కషాయం త్రాగిన బాగుగా చెమటపట్టి చలిజ్వరం వెంటనే తగ్గును.
చిన్నపిల్లల వ్యాధులు:
చిన్నపిల్లకు పండ్లు వచ్చు సమయమున ప్రతిదినం తులసి సమూల రసం ఇచ్చుచుండిన పండ్లు సులభముగా వచ్చును. విరేచనాలు వంటి వ్యాధులు తొందరగా దరిచేరవు.
తులసి ఆకులు , తుమ్మ చెట్టు లేత చిగుళ్లు , ఆముదం మూడింటికి ఒక్కోదానిని 10 గ్రాముల వంతున సేకరించి బాగా నూరి ఆ నూరిన దానిలో 5 గ్రాములు తీసుకుని 50 గ్రాముల నీటిలో వేసి పావు వంతు మిగులునట్లు ఉడికించి వడకట్టి రుచికి కొద్దిగా చక్కర కలిపి చిన్నపిల్లలకు తాగించిన ఏ జ్వరం అయినా తగ్గిపోవును .
- 🌿 తులసి రసమునకు అతిమధురం చూర్ణం కలిపి వాడిన పిల్లలకు వచ్చు సాధారణ దగ్గులు పోవును .
- 🌿 చిన్నపిల్లల కడుపు వాయవు బంధించి పొట్ట ఉబ్బుగా ఉన్న 5 నుంచి 10 గ్రాముల తులసిరసం తమలపాకుల రసం సమానంగా కలిపి వాడిన నివారణ అగును.
- 🌿 తులసి విత్తనాల చూర్ణం పాలతో కలిపి ఇచ్చిన వాంతులు నిలిచిపోవును .
- 🌿 తులసి విత్తనాల చూర్ణం 2 గ్రాములు తల్లిపాలతోగాని ఆవుపాలతో కాని కలిపి ఇచ్చిన చిన్నపిల్లలకు వచ్చు అతిసార విరేచనాలు నిలిచిపోవును .
- 🌿 తులసిదళముల రసం , తేనె , అల్లపు రసం మూడింటిని కలిపి 20 నుంచి 60 చుక్కల వరకు వాడిన జ్వరం , దగ్గు తగ్గును.
- 🌿 తులసి రసమున శొంటి చూర్ణం కలిపి ఇచ్చిన చిన్నపిల్లల కడుపునొప్పులు పోవును .
తలనొప్పికి:
- 🔸 తులసి ఆకులను నీడన ఎండించి మెత్తటి చూర్ణం చేసుకొనవలెను . ఆ చూర్ణమును ఒక గాజు సీసాలో నిలువ ఉంచుకుని తలనొప్పి ఉన్నవారు ఆ చూర్ణమును ముక్కుపొడుము వలే లోపలికి పీల్చుచున్న తలనొప్పులు పోవును .
- 🔸 తులసి రసం 5 గ్రాములు , గలిజేరు ఆకురసం 5 గ్రాములు , మిరియాలు 4 కలిపి బట్టలో నూరి ముక్కులలో రెండు మూడు చుక్కల వంతున పిండిన తలనొప్పి, తల బరువు , ముక్కు వెంట నీరు కారుట వంటి సమస్యలు నివారణ అగును.
- 🔸 తులసి ఆకులు , శొంటి, లవంగము కలిపి నూరి ఆ గంధమును కొద్దిగా వెచ్చచేసి లేపనం చేసిన తలనొప్పులు మాయం అగును.
- 🔸 తులసి పువ్వు గుత్తులను నీడన ఎండించి మెత్తటి చూర్ణం చేసుకొని ఆ చూర్ణమును తేనెతో సేవించిన పార్శ్వపు నొప్పి పోవును .
దగ్గుకి:
- 🔸 తులసి పువ్వులు , అల్లము, సమాన బాగాలుగా తీసుకుని కలిపి నూరి అందు కొంచం తేనె కలిపి పూటకు 5 గ్రాముల చొప్పున రెండు పూటలా తీసుకొనుచున్న దగ్గులు పోవును .
- 🔸 తులసి దళములు , 10 నుంచి 12 తీసుకుని 3 నుంచి 4 మిరియాలు , కొద్దిగా అల్లపు ముక్క ఒక చిటికెడు సైన్ధవ లవణం కలిపి ఒక గ్లాసు నీటిలో వేసి అరకప్పు మిగులునట్లు కాచి సేవించిన పడిశము , దగ్గులు మాయం అగును.
- 🔸 తులసి రసమును నలభై గ్రాముల చొప్పున మోతాదుగా రోజూ రెండు మూడు మార్లు పుచ్చుకొనుచున్న దగ్గులు హరించును .
- 🔸 తులసి ఆకుల రసము 10 గ్రాములు , తేనె 10 గ్రాములు కలిపి ఒక మోతాదుగా రోజూ మూడు పూటలా వాడిన చిన్నపిల్లల దగ్గులకు చాలా బాగుగా పనిచేయును . కఫం హరించి శ్వాసనాళం శుభ్రపడి పిల్లలు సుఖంగా నిద్రించును.
- 🔸 పైన చెప్పిన విధముగా తులసి చాలా రోగాలకు అత్యద్భుతమైన ఔషధముగా పనిచేయును . తులసి వనంలో ఉంచిన శవం కూడా కుళ్లిపోదు అని ఆయుర్వేదం చెప్తుంది . ఇంటి ముందు ఉన్న తులసి చెట్టుని బట్టి ఆ ఇంట్లో ఉన్నవారి ఆరోగ్యం గురించి చెప్పవచ్చు.
వీలైనంత వరకు ఇంట్లో ఒక తులసి చెట్టు పెంచుకోవడానికి ప్రయత్నించండి.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి