ఉమ్మడి కుటుంబాలు
గతంలో పల్లెల్లో వున్నవన్ని ఉమ్మడి కుటుంబాలె. ఒక కుటుంబంలో పదుల సంఖ్యలో సభ్యులుండే వారు. దాంతో వ్యవసాయ పనులు చాల చక్కగా జరిగేవి. ఎవరి పనులు వారి కుండేవి. ఒక కుటుంబంలోని వ్వక్తులకు ఒక్కొక్క పని కేటాయించ బడి వుండేది. ఇద్దరు ముగ్గురు ఆడవారు ఇంటిపనికి వుంటే మిగతా ఆడవారు పొలం పనులకు వెళ్లే వారు. మగవారిలో ఒకరు గొర్రెలను కాయడానికి వెళితే మరొకరు మేకలను కాయడానికి వెళ్లె వారు. మరొకరు ఆవులను పాలు పిండి తర్వాత మేతకు తీసుకెళ్లే వారు. మిగతా వారు పొలం పనులకు వెళ్లే వారు. పెద్ద పనులు వున్నప్పుడు అనగా వరి నాట్లు, కలుపు తీత, వరికోతలు, చెరకు గానుక ఆడడము మొదలగు పనులకు చాల మంది అవసరము. ఆ సందర్భంలో ఇంటి వారందరు కలసి ఆ పనిని కొంత మేర చేసి తర్వాత తమ పనులకు వెళ్లె వారు.
ఆ విధంగా కుటుంబ మంతా ఒకే నాయకత్వంలో కలిసి మెలిసి పనిచేసి వ్వవ సాయం చేసి చాల గొప్పగా బతికారు. అదే విధంగా ఆ పల్లెలోని అన్ని కుటుంబాలు అన్ని కలిసి ఒకే కుటుంబంగా మెలిగేవి. ఎవరికి ఏ కష్టం కలిగినా వూరు వూరంతా వారిని ఆదుకునే వారు. ఒక కుటుంబంలో పెళ్ళి లాంటి శుభ కార్వం జరిగినా..... చావు లాంటి అశుభ కార్యం జరిగినా ఆ వూరి వారంతా ఆ ఇంట్లో తామె చేయగలిగిన పని చేసేవారు. అలా అంతా ఐకమత్యంతో జీవనం సాగించే వారు.
కానీ..ఇప్పుడు..ఉమ్మడి కుటుంబం మచ్చుకైనా లేదు. దాంతో...ఐకమత్యము, ఆత్మీయత, ప్రేమ, అనురాగము, అనే వాటికి అర్థం లేకుండా పోయింది. పక్కింట్లో ఏదైనా ఆపద సంబవిస్తే.... మాట వరసకు పలకరింపులు తప్ప మరే సహాయ సహకారాలు అందించడం లేదు. ఎదుటి వారు కూడా వారి సహాయ సహకారాలను కూడా ఆసించడము లేదు. ఇది కాలాను గుణంగా వస్తున్న మార్పు.
సేకరణ & అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి