మహిళలు శ్రావణమాసాన్ని అత్యంత పవిత్రంగా భావించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ మాసంలో నెలంతా పండుగ వాతావరణం సంతరించుకుంటుంది. పెళ్ళిల్లు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలు వంటి కార్యక్రమాలతో ప్రతిరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది.
ప్రతి శుక్రవారం ఇంటి ఇల్లాలు మహాలక్ష్మిలా వెలుగొందుతూ తమ కుటుంబం ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయాలు శ్రావణ మాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడనున్నాయి. శ్రావణమాసం సందర్భాన్ని పురస్కరిన్చుకొని ప్రతి జిల్లాలోని ఆలయాల్లో చళువ పందిళ్ళు, బారీకేడ్లను ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు.
శ్రావణమాసము శుభఫలాల నెల . ముత్తైదువులందరూ ఉత్సాహముగా , సంబరముగా పండుగలు, పూజలు, పేరంటాలు జరుపుకునే మాసము. శ్రావణమాసము లో లక్ష్మీదేవిని మనసరా పూజిస్తే సిరి సంపదులు చేకూరుతాయి.
ఈ నెలలో ప్రతిరోజూ కూ ఒక ప్రత్యేకత ఉన్నది . విష్ణుమూర్తి శ్రవణా నక్షత్రము న పుట్టినారు . ఈ నెలలో జన్మించినవారు వేదొక్త కర్మలు నిర్వహించడము , సకలజనుల గౌరవమన్ననలు పొందడము , సిరిసంపదల సమృద్ధి తో జీవనము సాగించ గలరని నమ్మకము . ఈ నెలలో జనిమించిన మహానుభావులలో - శ్రీకృష్ణ పరమాత్మ , హయగ్రీవోత్పత్తి , అరవింద యోగి ముఖ్యులు .
మాఘమాసము లో ఆదివారాలు , కార్తీక మాసములో సోమవారాలు , మార్గశిరమాసములో లక్ష్మివారాలు - ఇలా ఒక్కోమాసములో ఒక్కొక్క రోజు పవిత్రదనాలుగా భావిస్తారు . ఐతే శ్రావణమాసములో అన్నిరోజులు పవిత్రమైనవే ... ప్రతిదినము ముఖ్యమైనదే .
ఈ మాసంలో ఒక్కోరోజు ఒక్కో దేవున్ని పూజిస్తారు.
- 1. సోమవారాల్లో శివుడికి అభిషేకాలు,
- 2. మంగళవారం గౌరీ వ్రతం,
- 3. బుధవారం విఠలుడికి పూజలు,
- 4. గురువారాల్లో గురుదేవుని ఆరాధన,
- 5. శుక్రవారాల్లో లక్ష్మీ, తులసి పూజలు,
- 6. శనివారాల్లో హనుమంతుడికి, తిరుమలేశునికి, శనీశ్వరునికి ,
భక్తులు ప్రత్యేక పూజలు చేస్తూ కొలుస్తారు. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కో దేవున్ని పూజించడం తర తరాల నుండి సాంప్రదాయంగా వస్తుంది
రోజు చేస్తున్న పూజలు కాకుండా ఈ మాసంలో నాగపంచమి, పుత్రదైకాదశి, వరలక్ష్మి వ్రతం, రాఖీపౌర్ణమి, రుషి పంచమి, గోవత్సబహుళ, సీతల సప్తమి, శ్రీకృష్ణాష్టమి, పొలాల అమావాస్య వంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి. ఒకటి తర్వాత ఒకటి పండుగలు రావడంతో కొత్త అళ్ళుల్లు, కోడళ్ళు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు రావడంతో ప్రతి హైందవ గడప సందడిగా మారుతుంది.
అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి