పరమాత్మ |
జీవి ఉన్నంత వరుకే కదా ఈ బంధాలు, బాంధవ్యాలు జీవి చనిపోయాక జీవాత్మ పరమాత్మ లోకి చేరేక ఈ బాంధవ్యాలతో సంబంధం లేనప్పుడు. ఈ పిండాలు పెట్టడం శ్రార్ద ఖర్మలు చేయడం దేనికి ఇది నా మదిలో వచ్చిన ప్రశ్న?.
జీవి (ఆత్మ) పరమాత్మ ప్రతి రూపం. ఋణాను బంధ రూపేన శత సహశ్ర కోటి ఆత్మలతో దైవ లీలాను సారం ప్రతి ఆత్మా మరో ఆత్మతో బంధ పాశం లో చిక్కుకొని ప్రతి జన్మను ఆయష్యాను సారం ఈ అండ భ్రహ్మండలో కర్మలను ఆచరిస్తుంది. మరణానంతరం గత జీవితా బాంధవ్యాల రిత్యా ప్రతి జీవి తన ఋణ విమోచన కు సనాతన సాంప్రదాయ శౌచ కర్మలు విద్యుక్త ధర్మం గా ఆచరిస్తుంది.అది సర్వత్రా లోక విదితమైన విషయం.
జీవి (ఆత్మ) పరమాత్మ ప్రతి రూపం |
ఇక ఆధ్యాత్మిక అంతర్గత రహస్య విషయ మేమిటంటే. ఆత్మ,పరమాత్మ అద్వైత సిధ్ధాంతాను సారం జీవులు, దేవుడు ప్రతి రూపాలు కనుక ఆత్మకు మరణం లేదు కనుక .జీ వుల మరణాంతరం ప్రాపంచిక ఊహాజ్ఞానం రిత్యా బంధం ఉండదని భావించటం సహజ ప్రాకృతిక అజ్ఞాన అభిప్రాయం.కాని అండ పిండ భ్రహ్మండ భగవత్నాటకం ఈ సృష్టిలో సాగినంతవరకు ప్రతి జీవాత్మ బంధం కొనసాగుతునే ఉంటుంది. అందుకని మన దిన కర్మలు జీవితాంతం నిర్విఘ్నంగా కొనసాగిస్తునే ఉండాలి. మన పితృ,దైవ ఋణం తీర్చుకుంటు వారి ఆశీస్సులతో పుణ్య లోకాలకు వెళ్ళాలి. మళ్ళీ కర్మాను సారం పవిత్ర జన్మలెత్తి పర లోకాలకు పయనమై మోక్షం, కైవల్య ప్రాప్తి పొందాలి.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి