దీపం అనగానే మనకు శాంతికి చిహ్నం , భక్తికి నిదర్శనం, భక్తి భావాలు కలుగుతాయి . అలాంటి దీపం ఊరికే వెలిగిస్తే సరిపోదు కొన్ని పద్దతులను అనుసరించి దీపాన్ని పద్దతిలో వెలిగిస్తే సరైన ఫలితాలు మనకు లభిస్తాయి. దీపం విధానం కొన్ని పద్దతులు మన పూర్వీకులు చెప్పినవి ఇవి .
- 🔸దీపం దేవుని ముందు ఉంచటం ద్వారా స్త్రీలకు సకల సౌభాగ్యములు సిద్దిస్తాయి.
- 🔸దీపం పెట్టని ఇల్లు ని మన హిందువులు స్మశాన వాటికతో సమానం అంటారు .
- 🔸దీపం పెట్టాలనుకున్నావారు కొన్ని పద్దతులను పాటించి దీపం వెలిగించి మంచి ఫలితాలను పొందవచ్చు .
- 🔸దీపం కుందులు వెండి, పంచలోహాలు, ఇత్తడి, మట్టి ప్రమిధలలో దీపారాధన చేయవచ్చు.
- 🔸దీపం మునకు ఖచ్చితంగా రెండు వత్తులు వాడాలి అది భగవంతుని వైపుకి వెలిగించాలి. దీపాల మద్యలో దేవుళ్ళు ఉండాలి .
- 🔸ఒక వత్తి వెలిగించరాదు అలా వెలిగించటం దోషం. ఒకసారి పూజకు వినియోగించిన వత్తిని మళ్ళీ వాడకూడదు , కుందులని కూడా కడిగి మళ్ళీ పూజకు వాడాలి, కొత్త వత్తులు వాడాలి.
- 🔸మహాశివునికి ఎడమవైపున దీపాన్ని మహావిష్ణువునకు కుడివైపున దీపాన్ని ఉంచాలి .
- 🔸నిత్య దీపారాధన చేసే వారి ఇంట సుఖ సంతోషాలు పండుతాయి.
- 🔸ఆవు నెయ్యి తో దీపారాధన చేస్తే ఎన్నో మంచి ఫలితాలు ఇస్తుంది. అష్టైశ్వర్యాలు , సుఖ సంతోషాలు ఉంటాయి .
రచన: సుజాత