అచ్యుత మానస కూచిపూడి నాట్య కళాకారిణి ఆంధ్రప్రదేశ్ లో పుట్టింది. ఈమె తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి, రవిచంద్ర. ఈమె అధికారిక జాలస్థలిని రవిశంకర్ ప్రారంభించాడు. అచ్యుత మానస కూచిపూడి నాట్యంలో అత్యంత యువ నాట్య కళాకారిణిగా గుర్తింపు పొందింది. ఈమె తన ఆరవ యేట నుండే కూచిపూడి అభ్యాసం ప్రారంభించింది.. ఈమె గురువు మధు నిర్మల, ఆపై గురువు శ్రీ నరసయ్య. తరువాత ప్రముఖ గురువు మహంకాళి సూర్యనారాయణ శర్మ వద్ద మూడేళ్ళ పాటూ అభ్యాసం చేసింది. అక్కడి నుండి ఈమె కాజా వెంకట సుబ్రమణ్యం వద్ద తదుపరి అభ్యాసం మొదలు పెట్టింది. ఈ వెంకట సుబ్రమణ్యం పేరుపొందిన నాట్యాచార్యులు. ఇతను వెంపటి చినసత్యం, చింతా ఆదినారాయణ శర్మల వద్ద శిష్యరికం చేసారు.
అచ్యుత మానసకు ప్రస్తుతం 19 సంవత్సరాలకు పైబడి నాట్యానుభవం ఉంది. ఈమె 800 పైగా కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చింది. ఈమెకు ఎన్నో గుర్తింపులు, పురస్కారాలు వచ్చాయి. ఎందరో ప్రముఖుల నుండి, ప్రేక్షకుల నుండి ప్రశంసలు వచ్చాయి. ఈమె ఇప్పుడు దూరదర్శన్ లో గ్రేడెడ్ ఆర్టిస్ట్. ఈమె 2011 కు గానూ యునెస్కో వారి మెంబెర్ ఆఫ్ ఇంటర్నేషనల్ డ్యాన్స్ కౌన్సిల్ - సీఐడీ (సభ్యురాలు), గ్రీకులో జరిగిన 31వ ప్రపంచ నృత్య పరిశోధన కాంగ్రెస్ లో ప్రదర్శన ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఆహ్వానం పొందింది.
అచ్యుత మానస |
అచ్యుతమానస నాట్యానికి అదనంగా ఇంజనీరింగ్ చదివింది. ఒక సాఫ్టువేర్ కంపెనీలో పని కూడా చేసేది, కానీ నృత్యానికి పూర్తి సమయం కేటాయించాలి అనే భావంతో ఉద్యోగం వదిలేసింది.
ప్రదర్శనలు
ఈమె ఎన్నో పురస్కారాలను అందుకుంది :
అచ్యుత మానస |
- ఎసెన్స్ ఆఫ్ లైఫ్ (జీవితపు పరమార్ధం) తాజ్ వివాంతా, హైదరాబాదులో
- ఎసెన్స్ ఆఫ్ లైఫ్ (జీవితపు పరమార్ధం)చౌడయ్య మెమోరియల్ హాల్, బెంగుళూరులో
- ఆలయ నాట్యం - స్సింహానందిని ప్రదర్శన, కువైట్ లో
- 11వ ఏకామ్ర నృత్య ఉత్సవం-2013, భువనేశ్వర్ లో
- హైదరాబాద్ హెరిటేజ్ ఫెస్టివల్-2013, చౌమొహల్లా ప్యాలెస్, హైదరాబాదులో
- బైసాఖీ ఫెస్టివల్, హఒదరాబాద్
- 4వ లక్ష్మణ గర్నాయిక్ స్మృతి - అంతర్జాతీయ నృత్య సంగీత ఉత్సవం - అంతర్జాతీయ నృత్య సంగీత సమారోహ్-2013, కటక్, ఒడిశాలో
- సీతా కళ్యాణం అను నృత్య రూపకంలో (తితిదే వారి సమర్పణ)
- ఐఐఐటీ మరియు ఐఎస్బీలో వేరు వేరు సందర్భాలలో నృత్య ప్రదర్శన
- ప్రపంచ తెలుగు మహాసభలలో ప్రదర్శన
- కథక్ ప్రదర్శన 2012 లో
ఈమె ఎన్నో పురస్కారాలను అందుకుంది :
- ప్రతిభా పురస్కారం - ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ద్వారా,
- నాట్యమయూరి
- ఉగాది పురస్కారం
- కళాశ్రవంతి
- సప్తగిరి బాల ప్రవీణ
- నాట్యకళామయి
- ప్రతిభాపల్లవం
- ఎన్టీఆర్ స్మారక తెలుగు మహిళా అవార్డు
- "యునెస్కో మిలీనీయం బెస్ట్ కల్చరల్ అంబాసిడర్”